గురువులు శిష్యులకు
1-42-క.
గురువులు ప్రియశిష్యులకుం
బరమ రహస్యములు దెలియఁ బలుకుదు రచల
స్థిర కల్యాణం బెయ్యది
పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్.
గురువు
లైన వారు ప్రీతిపాత్రు లైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతు లెన్నో బోధిస్తారు
కదా. ఈ లోకంలోని మానవులకు శాశ్వత మైనట్టి కల్యాణాన్ని కలిగించే విషయ మేదో బాగా
ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించు.
శౌనకాది మునీశ్వరులు సూత మహర్షిని భాగవతం చెప్పమని ఇలా అడుగసాగారు.
1-42-ka.
guruvulu
priyaSishyulakuM
barama
rahasyamulu deliya@M balukudu rachala
sthira
kalyaaNaM beyyadi
purushulakunu
niSchayiMchi bOdhiMpu tagan.
గురువులు = గురువులు; ప్రియ =
ప్రియ మైన; శిష్యుల = శిష్యుల; కున్ =
కు; పరమ = ఉత్కృష్ట మైన; రహస్యములు =
రహస్య జ్ఞానములను; తెలియన్ = తెలియునట్లు; పలుకుదురు =
వివరిస్తారు; అచల = చాంచల్యము లేనిది; స్థిర =
స్థిరత్వము కలిగించేది; కల్యాణంబు =
అత్యంత శుభకర మైనది; ఎయ్యది = ఏదో; పురుషుల =
మానవుల; కును = కు; నిశ్చయించి =
నిర్ణయించి; బోధింపు = భోధింపుము (మాకు); తగన్ =
తగినట్లుగా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment