Monday, July 14, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 351

శామంతికా

10.1-799-క.
శామంతికా స్రగంచిత
సీమంతవతీ కుచోష్ణ జిత శీతభయ
శ్రీమంతంబై గొబ్బున
హేమంతము దోఁచె; మదనుఁ డేఁచె విరహులన్.
          ఇంతలో శ్రీమంతమైన హేమంతం ప్రవేశించేసింది. చేమంతి పూలు ధరించిన పూబంతుల చనుబంతల వేడిమిచే చలి భయాన్ని జయించారు కాని. వియోగులను మన్మథుడు వేధించాడు.
బహుచక్కని ఋతు వర్ణన సాధించిన చమత్కార పద్య మిది. ప్రబంధ లక్షణాలలో ఋతువర్ణన ఒకటి.
10.1-799-ka.
SaamaMtikaa sragaMchita
seemaMtavatee kuchOshNa jita Seetabhaya
SreemaMtaMbai gobbuna
haemaMtamu dO@Mche; madanu@M Dae@Mche virahulan.
          శామంతికా = చేమంతి పూల; స్రక్ = దండచేత; అంచిత = అలంకరింపబడిన; సీమంతవతీ = పాపటలు కలిగిన స్త్రీల; కుచ = పాలిండ్ల; ఉష్ణ = వేడిచేత; జిత = జయింపబడిన; శీత = చలివలని; భయ = భయము అనెడి; శ్రీమంతంబు = సంపదలు కలిగినవారు; = అయ్యి; గొబ్బున = తటాలున; హేమంతము = చలికాలము; తోచెన్ = కనబడెను; మదనుడు = మన్మథుడు; ఏచెన్ = బాధించెను, పీడించెను; విరహులన్ = విరహము కలవారు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: