Sunday, July 27, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 364

వీరెవ్వరు శ్రీకృష్ణులుగారా

10.1-374-క.
వీరెవ్వరు? శ్రీకృష్ణులు
గారా? యెన్నడును వెన్నఁ గానరఁట కదా!
చోత్వం బించుకయును
నే రఁట! ధరిత్రి నిట్టి నియతులు గలరే?
          ఓహో ఎవరండి వీరు? శ్రీకృష్ణుల వారు కాదా? అసలు వెన్న అంటే ఏమిటో ఎప్పుడు చూడనే లేదుట. పాపం దొంగతనం అంటే ఏమిటో ఎరుగరట. అబ్బో ఈ భూలోకంలో యింతటి బుద్ధిమంతులు ఎవరు లేరట.
వేరొకరి యింట్లో వెన్న దొంగిలించి కోతిపాలు చేస్తు దొరికిపోయిన చిలిపి కృష్ణుని పట్టుకొని, కొట్టజాలక కట్టేద్దా మనుకొంటు, ఇలా దెప్పుతోంది.
10.1-374-ka.
veerevvaru? SreekRshNulu
gaaraa? yennaDunu venna@M gaanara@MTa kadaa!
chOratvaM biMchukayunu
naera ra@MTa! dharitri niTTi niyatulu galarae?
          వీరు = ఈ పెద్దమనిషి; ఎవ్వరు = ఎవరు; శ్రీకృష్ణులు = కృష్ణడు గారు; కారా = కాదా; ఎన్నడును = ఎప్పుడు; వెన్నన్ = వెన్నను; కానరు = చూడనే చూడలేదు; అట = అట; కదా = కాదా; చోరత్వంబున్ = దొంగతనము; ఇంచుకయును = కొంచము కూడ; నేరరు = తెలియదు; అట = అట; ధరిత్రిన్ = భూమిపైన; ఇట్టి = ఇలాంటి; నియతులు = పద్దతి ప్రకార ముండువారు; కలరే = ఉన్నారా.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: