ఘన యమనానదీ
10.1-665-సీ.
ఘన యమునానదీ కల్లోల ఘోషంబు;
సరసమృదంగఘోషంబు గాఁగ
సాధుబృందావనచరచంచరీక గా;
నంబు గాయక సుగానంబు గాఁగ
కలహంస సారస కమనీయమంజు శ;
బ్దంబులు తాళశబ్దములు గాఁగ
దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది;
జనులు సభాసీనజనులు గాఁగ
తే.
పద్మరాగాది రత్నప్రభాసమాన
మహితకాళియ ఫణిఫణామండపమున
నళినలోచన విఖ్యాత నర్తకుండు
నిత్యనైపుణమునఁ బేర్చి నృత్య మాడె.
ఆ మహానది యమునలో కదిలే
తరంగాల ధ్వనులు, చక్కటి మృదంగ వాయిద్యంలా పలుకుతుండగా; ఆ బృందావనంలో తిరుగాడే తుమ్మెదల మధుర సంగీతం, గాయకుల సొంపైన గానంలా వినబడుతుండగా; కలహంసలు సారస పక్షులు చేస్తున్న శ్రావ్యమైన శబ్దాలు, మంజుల తాళధ్వనుల అందాలు
సంతరించుకోగా; ఆకాశం నుండి చూస్తున్న దేవతలు గంధర్వులు మున్నగు
వారంతా సభాసీనులైన ప్రేక్షకులై యుండగా; కెంపులు మొదలైన నవరత్నాల ప్రకాశంతో తులతూగే ఆ కాళియుని పాముపడగలనే విశాల మండపం
మీద బాలకృష్ణుడు అనే కలువల వంటి కన్నులు గల ప్రఖ్యాత నర్తకుడు ఎక్కి బహుళ నైపుణ్యముల
అతిశయాన్ని ప్రకాశింపజేస్తూ నాట్యం చేశాడు.
పరమాద్భుతమైన ఈ రత్నగుళికలాంటి ఈ పద్యం
వింటుంటే “పద్మరాగాది” వద్దకు వచ్చే సరికి మన కిట్టయ్య చేసే కాళియమర్థనం కళ్ళకుకట్టినట్టు
కనబడుతు ఉంటుంది.
10.1-665-see.
ghana
yamunaanadee kallOla ghOShaMbu;
sarasamRidaMgaghOShaMbu
gaa@Mga
saadhubRiMdaavanacharachaMchareeka
gaa;
naMbu
gaayaka sugaanaMbu gaa@Mga
kalahaMsa
saarasa kamaneeyamaMju sha;
bdaMbulu
taaLashabdamulu gaa@Mga
divinuMDi
veekShiMchu divija gaMdharvaadi;
janulu
sabhaaseenajanulu gaa@Mga
tE.
padmaraagaadi
ratnaprabhaasamaana
mahitakaaLiya
phaNiphaNaamaMDapamuna
naLinalOchana
vikhyaata nartakuMDu
nityanaipuNamuna@M
bErchi nRitya maaDe.
ఘన = గొప్ప; యమునా = యమున
అనెడి;
నదీ = నదియొక్క; కల్లోల = పెద్దఅలల; ఘోషంబు = పెద్దధ్వని; సరస = రసయుక్తమైన; మృదంగ = మద్దెల; ఘోషంబు = ధ్వని; కాగ = అగుతుండగ; సాధు = చక్కని; బృందావన = బృందావనము
నందు;
చర = మెలగెడి; చంచరీక = తుమ్మెదల; గానంబు = పాట; గాయక = గాయకుల; సు = మంచి; గానంబున్ = పాటలు; కాగన్ = అగుచుండగ; కలహంస = కలహంసల; సారస = బెగ్గురుపక్షుల; కమనీయ = మనోజ్ఞ
మైన;
మంజు = ఇంపైన; శబ్దంబులు = ధ్వనులు; తాళ = పక్కతాళము
వేయు వారి; శబ్దములు = ధ్వనులు; కాగన్ = అగుచుండగ; దివి = ఆకాశము; నుండి = నుండి; వీక్షించు = చూచెడి; దివిజ = దేవతలు; గంధర్వ = గంధర్వులు; ఆది = మొదలైన; జనులు = ప్రజలు; సభ = సభ యందు; ఆసీన = కూర్చున్న; జనులు = వారు; కాగన్ = అగుచుండగ; | పద్మరాగ = కెంపులు; ఆది = మొదలైన; రత్న = రత్నములచేత; ప్రభాసమాన = మిక్కలి వెలుగుచున్న; మహిత = గొప్ప; కాళియ = కాళియుడు
అనెడి;
ఫణి = పాము; ఫణా = పడగ లనెడి; మండపమునన్ = వేదికపైన; నళినలోచన = పద్మాక్షుడు, కృష్ణుడు; విఖ్యాత = ప్రసిద్ధుడైన; నర్తకుండు = నృత్యము
చేయువాడు; నిత్య = శాశ్వత
మైన;
నైపుణమునన్ = నేర్పుచేత; పేర్చి = అతిశయించి; నృత్యము = నాట్యములు; ఆడెన్ = చేసెను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment