తడవాడిరి
10.1-290-క.
తడ వాడిరి బలకృష్ణులు
దడ వాడిరి వారిఁ జూచి తగ రంభాదుల్
దడవాడి రరులు భయమునఁ
దడ వాడిరి మంతనములఁ దపసులు వేడ్కన్.
బలరాముడు,
కృష్ణుడు బాల్యావస్తలో ఎంతో తడవు క్రీడించారు. రంభా మొదలగు అప్సరసలు చూసి ఆనందంతో
ఎంతో సమయం నాట్యాలు చేసారు. అసురారి కదా, శత్రువులైన దుర్మార్గులు, రాక్షసులు భయంతో
తడబడసాగారు. తపస్సులు చేసుకొనే ఋషులు గోష్ఠులలో లోకం సుఖపడబోతోందనే సంతోషంతో
ఎంతోసేపు సంభాషించుకున్నారు.
ప్రతి పాదంలోను మొదటి నాలుగు
స్థానాలు అచ్చు హల్లు భేదాలు లేకుండా వాడి, యమకం ప్రయోగించిన యీ పద్యం బహుళ
ప్రజాదరణ పొందినది. రెండు
అంతకన్న ఎక్కువ అక్షరాలు అర్థం భేదం కలిగి మరల మరల ప్రయోగిస్తే యమకాలంకారం.
10.1-290-ka.
taDa
vaaDiri balakRshNulu
daDa
vaaDiri vaari@M joochi taga raMbhaadul
daDavaaDi
rarulu bhayamuna@M
daDa
vaaDiri maMtanamula@M dapasulu vaeDkan.
తడవు = చిరకాలం; ఆడిరి = క్రీడించిరి; బల = బలరాముడు; కృష్ణులున్ = కృష్ణుడు; తడవు = కొంతసేపు; ఆడిరి = నాట్యము
లాడిరి;
వారిన్ = వారిని; చూచి = చూసి; తగన్ = తగినట్లుగ; రంభ = రంభ; ఆదుల్ = మున్నగువారు; తడవాడిరి = తడబడిరి; అరులు = శత్రువులు; భయమునన్ = భీతిచేత; తడవు = చాలాసేపు; ఆడిరి = మాట్లాడుకొనిరి; మంతనములన్ = రహస్యముగా; తపసులు = ఋషులు; వేడ్కన్ = కుతూహలముతో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment