కటిచేలంబు
10.1-638-మ.
కటిచేలంబు బిగించి పింఛమునఁ జక్కం గొప్పు బంధించి దో
స్తట సంస్ఫాలన మాచరించి చరణద్వంద్వంబుఁ గీలించి త
త్కుటశాఖాగ్రము మీఁదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది
క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభధ్వానం బనూనంబుగన్.
నడుముకున్న దట్టీని గచ్చిగా బిగించి కట్టుకున్నాడు.
తలవెంట్రుకల కొప్పు నెమలి పింఛంతో బిగించి కట్టుకున్నాడు. రెండు చేతులతో భుజాలు
చరచాడు. రెండుకాళ్ళు కీళ్ళు బిగించి మహా పరాక్రమశాలి గోపాలబాలుడు ఆ చెట్టు కొమ్మ
మీదనుంచి కాళింది మడుగులోకి కుప్పించి దూకాడు. దూకిన వేగానికి గుభీలు మని పెద్ద
శబ్దం వచ్చింది. దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి.
10.1-638-ma.
kaTichaelaMbu
bigiMchi piMChamuna@M jakkaM goppu baMdhiMchi dO
staTa
saMsphaalana maachariMchi charaNadvaMdvaMbu@M geeliMchi ta
tkuTaSaakhaagramu
mee@MdanuMDi yuRiken gOpaalasiMhaMbu di
ktaTamul
mrOya hradaMbulO gubhagubhadhvaanaM banoonaMbugan.
కటి = మొల నున్న; చేలంబున్ = వస్త్రమును; బిగించి = గట్టిగా
కట్టి;
పింఛమునన్ = నెమలి
పింఛముతో; చక్కన్ = చక్కగా; కొప్పున్ = జుట్టు
ముడిని;
బంధించి = కట్టి; దోస్తట = అరచేతులు
రెంటిని; సంస్ఫాలనము = చఱచుట; ఆచరించి = చేసి; చరణ = కాళ్ళు; ద్వంద్వంబున్ = రెంటిని; కీలించి = కీళ్ళువంచి
బిగించి; తత్ = ఆ
యొక్క;
కుట = చెట్టు; శాఖా = కొమ్మ; అగ్రము = కొన; మీద = పై; నుండి = నుండి; ఉఱికెన్ = దుమికెను; గోపాల = గొల్లవా
డైన;
సింహంబు = అతి పరాక్రమవంతుడు; దిక్తటముల్ = దిగ్భాగములు; మ్రోయన్ = మారుమోగిపోవునట్లు; హ్రదంబు = మడుగు; లోన్ = లోనికి; గుబగుబ = గుబగుబ
అనెడి;
ధ్వానంబు = శబ్దములు; అనూనంబు = అధికముగ; కన్ = కలుగునట్లు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment