Wednesday, July 2, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 339

బహుజీవనముతోడ

10.1-822-సీ.
హుజీవనముతోడ భాసిల్లి యుండుటో?
 గోత్రంబు నిలుపుటో కూర్మితోడ?
హి నుద్ధరించుటో? నుజసింహంబవై
 ప్రజలఁ గాచుటొ? కాక లిఁదెరల్చి
పిన్నవై యుండియుఁ బెంపు వహించుటో?
 రాజుల గెలుచుటో ణములోన?
గురునాఙ్ఞ చేయుటో? గుణనిధి వై బల
 ప్రఖ్యాతిఁ జూపుటో ద్రలీల?
.
బుధులు మెచ్చ భువిఁ బ్రబుద్ధత మెఱయుటో?
లికితనము చేయ నత గలదె?
వావి లేదు వారివారు నావా రని
యెఱుఁగ వలదె? వలువ లిమ్ము కృష్ణ!
          ఓ కిట్టయ్యా! ఏం పనయ్యా యిది!దొడ్డ బ్రతుకుతో వన్నెకెక్కడం కాని (జలరాశిలో విలసిల్లుట – మత్యావతారం), కూర్మితో కులం ప్రతిష్ట నిలబెట్టటంకాని ( కొండను మూపున నిల్పుట – కూర్మావతారం), భూమిని రక్షించటంకాని (భూదేవిని పైకి లేవనెత్తుట – వరహావతారము), పురుషపుంగవుడవై జనులను కాపాడటంకాని ( నరకేసరియై భక్తుల రక్షించుట – నృసింహావతారం), వయసున పసివాడవయ్యు దుష్టులు బలవంతులు నైనవారిని నిగ్రహించి ప్రఖ్యాతి వహించుటకాని (వటువు రూపమున బలిచక్రవర్తి నణచి కీర్తిపొందుట – వామనావతారం), యుద్దాలలో రాజులను గెలవటం కాని ( ఇరవైయొక్క మార్లు క్షత్రియులను జయించుట – బలరామావతారం), పండితులు ప్రశంసించేలా ప్రబుద్ధుడవై లోకంలో ప్రకాశించటం కాని (పొందిన జ్ఞానంతో పండితుల ప్రశంసలకు పాత్రుడగుట - బుద్ధావతారం) తగిన పని. అంతే కాని యిలాంటి వంచకత్వం యే మాత్రం గొప్పదనంకాదయ్యా. (కల్కి పదంతో కల్క్యావతారం సూచన). నీకు వావివారసలు లేనట్లుంది, తనవారు పరాయివారు అనే వివేకం అక్కరలేదా (భగవంతునికి వావివరసలు, స్వపక్ష పరపక్షాలు లేవు). మా బట్టలు మా కిచ్చెయ్యవయ్యా.
గోపికావస్త్రాపహరణం చేసి చెట్టెక్కి కూచున్న కృష్ణుబాలుని బతిమాలుతూనే, ఓ భగవంతుడా అంటు దశావతారాలను వర్ణిస్తు స్తుతిస్తున్నారు గోపికలు. ఆహా ఎంత చక్కటి కవితా చమత్కృతి.
10.1-822-see.
bahujeevanamutODa bhaasilli yuMDuTO?
 gOtraMbu nilupuTO koormitODa?
mahi nuddhariMchuTO? manujasiMhaMbavai
 prajala@M gaachuTo? kaaka bali@Mderalchi
pinnavai yuMDiyu@M beMpu vahiMchuTO?
 raajula geluchuTO raNamulOna?
gurunaa~@Mna chaeyuTO? guNanidhi vai bala
 prakhyaati@M joopuTO bhadraleela?
aa.
budhulu mechcha bhuvi@M brabuddhata meRayuTO?
kalikitanamu chaeya ghanata galade?
vaavi laedu vaarivaaru naavaa rani
yeRu@Mga valade? valuva limmu kRshNa!
          బహు = గొప్ప, అధికమైన; జీవనము = జీవిక, జలము; తోన్ = తోటి; భాసిల్లి = ప్రకాశించియుండుటో, మత్యావతారమున భాసిల్లి; ఉండుటో = ఉండుటకాని; గోత్రంబున్ = వంశప్రతిష్టను, కొండను; నిలుపుటో = ఉద్దరించిటకాని, కూర్మవై అసరా ఇచ్చుటకాని; కూర్మి = ప్రీతితో, ప్రేమతో; మహిన్ = రాజ్యమును, భూమండలమును; ఉద్దరించుటో = ఏలుటకాని, వరహమవై భూమినెత్తుటకాని; మనుజసింహంబవు = మానవశ్రేష్ఠుడవు, నరసింహుడవు; = అయ్యి; ప్రజలన్ = గోపకులను, లోకులను; కాచుటో = ఏలుటకాని, కాపాడుటకాని; కాకన్ = లేదా; బలిన్ = కొవ్వినవారిని, బలిచక్రవర్తిని; తెరల్చి = తరిమికొట్టి; పిన్నవు = బాలుడవు, వామనుడవు; = అయ్యి; ఉండియున్ = ఉన్నప్పటికి; పంపు = అతిశయము, త్రివిక్రముడి; వహించుటో = చూపుటకాని, ప్రదర్శించుటకాని; రాజులన్ = శత్రురాజులను, లోకములోని రాజులందరను; గెలుచుటో = జయించుటకాని, పరశురామునిగా శిక్షించుటగాని; రణములోనన్ = యుద్ధభూమియందు; గురున్ = పెద్దల యొక్క, తండ్రి యొక్క; ఆజ్ఞ = ఆజ్ఞను; చేయుటో = పాటించుటకాని, పాలించుటకాని; గుణనిధివి = మంచిగుణములు కలవాడవు; = అయ్యి; బల = బలముయొక్క, బలరాముని యొక్క; ప్రఖ్యాతిన్ = ప్రసిద్ధిని; చూపుటో = ప్రదర్శించుటకాని, ప్రకాశముచేయుటకాని; భద్ర = శుభకరమైన; లీలన్ = విహారములతో; బుధులు = ఙ్ఞానులు; మెచ్చన్ = శ్లాఘించునట్లుగా; భువిన్ = భూలోకమున; ప్రబుద్ధతన్ = మిక్కిలి ఙ్ఞానముతో, బుద్ధునిగా; మెఱయుటో = ప్రకాశించుటకాని; కలికితనము = కొంటెతనపుపనులు, కల్కిచేయుపనులు; చేయన్ = చేయుటయందు; ఘనత = గొప్పదనము; కలదె = ఉన్నదా; వావి = బంధుత్వములన్నది; లేదు = లేదు; వారి = ఇతరులకుచెందిన; వారు = వారు; నా = తనకు చెందిన; వారు = వారు; అని = అని; ఎఱుగన్ = తెలిసికొన; వలదె = వద్దా; వలువలు = వస్త్రములు; ఇమ్ము = ఇచ్చివేయుము; కృష్ణ = కృష్ణుడ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: