Sunday, July 13, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 350

ఒక సూర్యుండు

1-227-మ.
సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లి నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య దంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
కుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్ఠింతు శుద్ధుండనై.
          ఉన్న సూర్యుడు ఒక్కడు, సకల జీవరాసులకు ఒక్కొక్కడుగా కానవచ్చే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణుల సమూహాల హృదయ కమలాలలో నానా విధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్రహృదయంతో ప్రార్థిస్తున్నాను.
అంపశయ్యమీద నున్న భీష్మాచార్యులు కృష్ణుని స్తుతిస్తున్నారు.
1-227-ma.
oka sooryuMDu samastajeevulaku@M daa nokkokka@MDai tO@Mchu pO
lika nae daevuMDu sarvakaalamu mahaaleelan nijOtpanna ja
nya kadaMbaMbula hRtsarOruhamulan naanaavidhaanoona roo
paku@MDai yoppuchunuMDu naTTi hari nae@M braarThiMtu SuddhuMDanai.
          ఒక = ఒకే; సూర్యుండు = సూర్యుడు; సమస్త = సమస్తమైన; జీవులు = జీవులు; కున్ = కును; తాన్ = తను; ఒక్కొక్కఁడు = ఒక్కొక్కడుగా; = అయ్యి; తోఁచు = కనిపించు; పోలికన్ = విధముగ; = ; దేవుండు = దేవుడు; సర్వ = సమస్తమైన; కాలము = కాలమునందు; మహా = గొప్ప; లీలన్ = లీలతో; నిజ = తననుండి; ఉత్పన్న = జనించిన; జన్య = జీవుల; కదంబంబుల = సమూహముల; హృత్ = హృదయ; సరోరుహములన్ = పద్మములలోను {సరోరుహము - సరసున పుట్టునది, పద్మము}; నానావిధ = అనేక రకములైన; ఆనూన = గొప్పవియైన; రూపకుఁడు = రూపముకలవాడు; = అయ్యి; ఒప్పుచు = ఒప్పుతు; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; హరిన్ = హరిని {హరి - సంగవ్రాతములను హరించువాడు, విష్ణువు}; నేన్ = నేను; ప్రార్ఠింతు = పూజింతు; శుద్ధుండను = పరిశుద్ధుడను; = అయ్యి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: