కంటిగంటి
10.2-1152-మత్త.
“కంటిగంటి భవాబ్ధి
దాఁటఁగఁ గంటి ముక్తినిధానముం
గంటి నీ కరుణావలోకముఁ గంటి బాపము వీడ ము
క్కంటి తామరచూలియుం బొడఁగాన నట్టి మహాత్మ! నా
యింటికిం జనుదెంచి తీశ్వర! యేఁ గృతార్థతఁ బొందితిన్.
10.2-1152-matta.
“kaMTigaMTi bhavaabdhi daa@MTa@Mga@M gaMTi muktinidhaanamuM
gaMTi nee karuNaavalOkamu@M gaMTi baapamu veeDa mu
kkaMTi taamarachooliyuM boDa@Mgaana naTTi mahaatma! naa
yiMTikiM janudeMchi teeSvara! yae@M gRtaarthata@M boMditin^.
బలి తన లోకానికి వచ్చిన శ్రీకృష్ణుని ఇలా స్తుతించాడు:- శ్రీకృష్ణభగవానుడా! ఓ మహాత్మా! నీవు నా మందిరానికి విచ్చేశావు. పరమ శివుడు బ్రహ్మదేవుడు
సైతం కానరాని నిన్ను నేను దర్శించ గలిగాను. నేను ధన్యుణ్ణి అయ్యాను. సంసార సాగరాన్ని
దాట గలిగాను. మోక్షమార్గాన్ని అందుకో గలిగాను. నా పాపం అంతా అంతరించి పోయింది.
కంటిగంటి = చూడ గలిగితిని; భ వాబ్ధి - భవ = సంసారము అను; అబ్దిన్ = సముద్రమును; దాఁటఁగఁ గంటి - దాటగన్ = తరించుటను; కంటిన్ = ఎరిగితిని; ముక్తి నిధానముం గంటి - ముక్తి = మోక్షమునకు; నిధానమున్ = నిధి వంటి దానిని; కంటిన్ = కనుగొంటిని; నీ = నీ యొక్క; కరుణావలోకముఁ గంటి బాపము - కరుణా = దయాపూరిత; అవలోకమున్ = చూపులను; కంటి = పొందితిని; పాపము = పాపములు; వీడ - వీడన్ = తొలగిపోగా; ముక్కంటి = శివుడు; తామరచూలియుం బొడఁగాన నట్టి
– తామరచూలియున్ = బ్రహ్మదేవుడు; పొడగానన్ = చూడజాలని; అట్టి = అటువంటి; మహాత్మ - మహాత్మా = గొప్పవాడ; నా = నా; యింటికిం జనుదెంచి తీశ్వర - ఇంటి = గృహమున; కిన్ = కు; చనుదెంచితి = వచ్చితివి; ఈశ్వర = భగవంతుడా; యేఁ గృతార్థతఁ బొందితిన్ - ఏన్ = నేను; కృతార్థుతన్ = ధన్యుతను; పొందితిన్ = పొందాను.
తెలుగుభాగవతం.కం http://www.telugubhagavatam.com/ || ఓం నమో భగవతే వాసుదేవాయః ||
4 comments:
గొప్ప పద్యం గుగొప్ప పద్యం గుర్తుచేశారు.దయచేసి వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యండి.
ఈ పద్యంలో పోతనగారు కంటిగంటి అన్నారు. ఒకేమాట రెండు సార్లు ప్రయోగించారు, దాని అర్థం కంటితో చూశాను అనికాని, చూశాను, చూశాను అని కాని చెప్పుకోవచ్చా! వివరించగలరు. fiedA
Meeru goppa yagnam chesaru, e grandhanni online lo petti, mimmulanu bhagavantudu challaga chudu gaka.
+Hari, kastephali గార్లకు అనేక ధన్యవాదాలు. మన తెలుగుభాగవతం.ఆర్గ్ http://telugubhagavatam.org/ జాలిక ఆవిష్కరణ పనిలో ఆలస్యం చేసా క్షంతవ్యుడను.
వర్డ వెరిఫికేషన్ గూగులు వాళ్ళిచ్చింది. మెషిన్ కాదని నిర్ధారించు కోడానికి అనుకుంటా. అయినా మీరు అఙ్ఞాత గా కూడ రాయొచ్చండి. లేదా జి+లో కాని ఫేస్ బుక్ లో కాని చూసి నాకు మైలు ఇవ్వచ్చు. కష్టే ఫలి గారు. మీ వర్ఢ్ ప్రెస్ చూసా చాలా బాగుంది. కాని అక్కడ వ్యక్తీకరిద్దా మంటే. సైన్ అప్ అంటున్నారు. అది నాకు ఇష్టం లేదు.
Post a Comment