శ్రీ మన్నామ
8-1-క.
శ్రీ మన్నామ! పయోద
శ్యామ! ధరా భృల్లలామ! జగదభిరామ!
రామాజన కామ! మహో
ద్ధామ! గుణస్తోమ
ధామ! దశరథ రామా!
అష్టమ స్కంధారంభలోని ప్రార్థన! – మంగళకర మైన
పేరు కలవాడా! మేఘం వంటి కాంతివంత మైన దేహం కలవాడా! రాజులలో బహు గొప్పవాడా! ఆఖిల లోకాలలో
అంద మైన వాడా! స్త్రీలకు మన్మథుని వంటి వాడా! బహు గంభీర మైన వాడా! సుగుణాలనే సంపదలకు
నిలయ మైన వాడా! దశరథ కుమారు డైన శ్రీరామ చంద్రా! అవధరించు!
శ్రీమన్నామ = శ్రీరామ {శ్రీమ న్నాముడు - శ్రీమత్ (మంగళవంత మైన) నామ (పేరు గల వాడు),
రాముడు}; పయోద శ్యామ = శ్రీరామ {పయోద శ్యాముడు - పయోద (మేఘము వంటి) శ్యామ (నల్లని వాడు), రాముడు}; ధరాభృల్లలామ = శ్రీరామ {ధరా భృ ల్లలాముడు - ధరాభృత్ (రాజులలో) లలాముడు (శ్రేష్ఠమైనవాడు), రాముడు}; జగదభిరామ = శ్రీరామ {జగ దభిరాముడు - జగత్ (లోకములకు) రాముడు (అంద మైనవాడు), రాముడు}; రామాజన కామ = శ్రీరామ {రామాజనకాముడు - రామా (రమించు నట్టి వారైన, స్త్రీ) జన (జనులకు) కాముడు
(మన్మథుని వంటివాడు), రాముడు}; మ హోద్ధామ = శ్రీరామ {మహోద్ధాముడు - మహా (గొప్ప) ఉద్ధాముడు (ఉద్ధరించెడి వాడు), రాముడు}; గుణస్తోమధామ = శ్రీరామ {గుణస్తోమ ధాముడు - గుణస్తోమ (సుగుణములు) స్తోమ
(సంపదలకు / అనేకములకు) ధాముడు (నెల వైన వాడు), రాముడు}; దశరథరామా = శ్రీరామ {దశరథరాముడు - దశరథుని యొక్క కుమారు డైన రాముడు (ఆనందింప జేయు వాడు), రాముడు}.
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||
No comments:
Post a Comment