10.1-144-క.
ఆ శౌరికిఁ దెరువొసఁగెఁ బ్ర
కాశోద్ధత తుంగ భంగ కలిత ధరాశా
కాశ యగు యమున మును సీ
తేశునకుఁ బయోధి త్రోవ యిచ్చిన భంగిన్.
శూరుని
పుత్రుడైన వసుదేవుడు నవజాత శిశువుని రేపల్లెకు తరలిస్తు యమున దగ్గరకు వచ్చాడు. ఎగిసిపడుతున్న
పెద్దపెద్ద అలలతో భూమినుండి ఆకాశందాకా నల్దిక్కులను కమ్ముకుంటు ప్రహిస్తోంది. ఆ
నది పూర్వకాలంలో శ్రీరామునికి లంకాపురం వెళ్ళటానికి సముద్రుడు త్రోవ యిచ్చినట్లే,
ఆ శిశు రూపి శ్రీకృష్ణ భగవానునికి యమున దారి యిచ్చింది.
ఇక్కడ
దారి ఇవ్వబడినది త్రేతాయుగ మైనా ద్వాపర యుగ మైనా ఆ పరాత్పరుని అవతారమైన వానికే. దారి యిచ్చింది
కడలి అయినా యమున అయినా నారపూరమే. అంటే సమస్తం ఆ పరబ్రహ్మ స్వరూపమే అయినా, ఆత్మ
పరమాత్మ అనే గమ్యం చేరటానికి దారి యివ్వవలసినది ఙ్ఞానమే అని. . . .
ఆ = ఆ; శౌరికిఁ దెరువొసఁగెఁ బ్రకాశోద్ధత - శౌరి = వసుదేవుని {శౌరి - శూరిని మనుమడు, విష్ణువు}; కిన్ = కి; తెరువు
= దారి; ఒసంగెన్
= ఇచ్చెను; ప్రకాశ
= బాగుగా
కనబడుతు; ఉద్దతన్ = అతిశయించిన; తుంగభంగ
- తుంగ = పొడవైన; భంగ = అలలు; కలిత = కలిగిన; ధ రా శాకాశ
- ధర = భూమి; ఆశ = దిక్కులు; ఆకాశ = ఆకాశము కలది; యగు - అగు = ఐన; యమున = యమునానది; మును = పూర్వ కాలంలో; సీతేశునకుఁ
బయోధి - సీతేశున్ = శ్రీరాముని {సీతేశుడు - సీతాదేవి యొక్క భర్త, రాముడు}; కున్ = కు; పయోధి = సముద్రము {పయోధి - పయస్ (నీటి)కి నిధి, కడలి}; త్రోవ = దారి; యిచ్చిన
- ఇచ్చిన = ఇచ్చిన; భంగిన్
= విధముగా. తెలుగుభాగవతం.కం http://www.telugubhagavatam.com/
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||
No comments:
Post a Comment