Tuesday, August 27, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_37



విబింబం


8-623-మ.
విబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై శిరోరత్న మై
శ్రణాలంకృతి యై గళాభరణ మై సౌవర్ణ కేయూర మై
విమ త్కంకణ మై కటిస్థలి నుదం ద్ఘంట యై నూపుర
ప్రరం బై పదపీఠ మై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.
8-623-ma.
ravibiMbaM bupamiMpa@M baatra magu Chatra Mbai SirOratna mai
Srava NaalaMkRti yai gaLaabharaNa mai sauvarNa kaeyoora mai
Chavima tkaMkaNa mai kaTisthali nudaMcha dghaMTa yai noopura
pravaraM bai padapeeTha mai vaTu@MDu daa brahmaaMDamun^ niMDuchOn^.
            అందంగా కళ్ళకు కట్టినట్లు అలవోకగా చెప్పడంలో సిద్దహస్తుడు అయిన మన పోతనా మాత్యుల వారి త్రివిక్రమావతరణ అత్యద్భుతం తెలుగు సాహిత్యానికే మకుటాయమాన మైన పద్యాలుగా ఎన్నదగ్గవి. ఉపమానం అని చెప్తు ఉపమానానికి గొప్పదనం అబ్బేలా చేయటం సామాన్య విషయం కాదు. - వామనుడు బ్రహ్మాండ మంతా నిండిపోతుంటే, మింట నుండే సూర్యబింబం ఆ పరాత్పరునికి అలంకారంగా పోల్చి చెప్పడానికి తగి ఉన్నాడట. అది ఎలాగంటే ఆ సమయంలో క్రమక్రమంగా త్రివిక్రమునికి గొడుగులా, తర్వాత శిరోమణిలా, తర్వాత మకరకుండలంలా, పిమ్మట కంఠాభరణంలా, ఆ పిమ్మట బంగారు భుజకీర్తిలా, ఆ పిమ్మట కాంతులీనే కంకణంలా, అపైన మొలలోని గంటలా, అనంతరం మేలైన కాలి అందెలా, చివరికి పాదపీఠంలా పోల్చడానికి తగి ఉన్నాడట.
        రవిబింబం బుపమింపఁ బాత్ర మగు - రవిబింబంబున్ = సూర్య బింబము; ఉపమింపన్ = సరిపోల్చుటకు; పాత్రము = తగినది; అగు = అయిన; ఛత్రం బై - ఛత్రంబు = గొడుగు; = వలె నయ్యి; శి రోరత్న మై - శిరోరత్నము = శిరసు పైని ఆభరణము; = వలె నయ్యి; శ్రవ ణాలంకృతి - శ్రవణ = చెవుల; అలంకృతి = అలంకారము; యై - = వలె నయ్యి; గ ళాభరణ మై - గళ = కంఠము నందలి; ఆభరణము = ఆభరణము; = వలె నయ్యి; సౌవర్ణ కేయూర మై - సౌవర్ణ = బంగారపు; కేయూరము = భుజకీర్తి; = వలె నయ్యి; ఛవిమ త్కంకణ మై - ఛవిమత్ = మెరిసెడి; కంకణము = చేతి కంకణము; = వలె నయ్యి; కటిస్థలి నుదంచ ద్ఘంటయై - కటిస్థలిన్ = నడుమున; ఉదంచత్ = వేయబడిన; గంట = గంట; = వలె నయ్యి; నూపుర = కాలి అందెల; ప్రవరం బై - ప్రవరంబు = పేరు; = వలె నయ్యి; పద పీఠ మై – పద పీఠంబు = పాద పీఠము; = అయ్యి; వటుఁడు దా - వటుడు = బ్రహ్మచారి; తాన్ = అతను; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; నిండుచోన్ = అంతవ్యాపిస్తున్న సమయంలో. 
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||


No comments: