Wednesday, August 21, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_31

జనవర ఋషభుని

5.1-65-క.
            వర! ఋషభుని రాజ్యం
            బు నైహిక ఫలముఁ గోరు పురుషుని నొకనిం
            నుఁగొన నెఱుంగ మెన్నఁడు
            నితేజుం డతని మహిమ లే మని చెప్పన్.
5.1-65-ka.
     janavara! Rshabhuni raajyaM
     buna naihika phalamu@M gOru purushuni nokaniM
     ganu@Mgona ne~ruMga menna@MDu
     ninataejuM Datani mahima lae mani cheppan^.
          ఋషభచక్రవర్తి రాజ్యపాలన యందు ప్రజలలో పరిఢవిల్లిన ధార్మిక నైతి విలువలను శుకబ్రహ్మ పరీక్షిన్మహారాజుకి ఇలా వివరించారు. – మహారాజా! ఆ ఋషభుడు సూర్యుని వంటి తేజస్సు కలవాడు. అతని మహిమలు ఏమని వర్ణించను? అతని రాజ్యంలో పారలౌకిక ఫలాన్ని కోరే వాళ్ళే  తప్ప ఇహలోక ఫలాన్ని కోరేవాడు ఒక్కడు కనబడడు.
          జనవర = రాజ; ఋషభుని = ఋషభుని; రాజ్యంబున నైహిక ఫలముఁ గోరు - రాజ్యంబునన్ = రాజ్యములో; ఐహిక = ఇహ లోకపు; ఫలమున్ = ఫలితములను; కోరు = కోరెడి; పురుషుని నొకనిం గనుఁగొన నెఱుంగ మెన్నఁడు నినతేజుం డతని మహిమ లేమని - పురుషునిన్ = మానవుని; ఒకనిన్ = ఒక్కని నైన; కనుగొన = చూడ గలుగుట; ఎఱుంగము = తెలియము; ఎన్నడున్ = ఎప్పుడును; ఇన = సూర్యునితో సమాన మైన; తేజుండు = తేజస్సు గలవాడు; అతని = అతని యొక్క; మహిమల్ = గొప్పదనములు; ఏమని = ఏమని; చెప్పన్ = చెప్పను.
|| ఓం నమో భగవతే వాసుదేవాయః || 

No comments: