దూర్వాంకురంబుల
4-254-సీ.
దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము; జలజంబులను
జారు జలజనయనుఁ
దులసీ దళంబులఁ దులసికా దాముని; మాల్యంబులను
సునైర్మల్య చరితుఁ
బత్రంబులను బక్షిపత్రునిఁ గడు వన్య; మూలంబులను
నాది మూలఘనుని
నంచిత భూర్జత్వగాది నిర్మిత వివి; ధాంబరంబులను
పీతాంబరధరుఁ
తే. దనరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత
రూపముల యందుఁ గాని నిరూఢమైన
సలిలముల యందుఁ గాని సుస్థలము లందుఁ
గాని పూజింపవలయు న క్కమలనాభు.
4-254-see.
doorvaaMkuraMbula
doorvaaMkuraSyaamu
jalajaMbulanu
jaaru jalajanayanu@M
dulasee
daLaMbula@M dulasikaa daamuni
maalyaMbulanu
sunairmalya charitu@M
batraMbulanu
bakshipatruni@M gaDu vanya
moolaMbulanu
naadi moolaghanuni
naMchita
bhoorjatvagaadi nirmita vivi
dhaaMbaraMbulanu
peetaaMbaradharu@M
tae. danaru bhaktini mRchChilaadaaru rachita
roopamula
yaMdu@M gaani nirooDhamaina
salilamula
yaMdu@M gaani susthalamu laMdu@M
gaani
poojiMpavalayu na kkamalanaabhu.
ధృవునికి
నారదుడు ఓం నమోభగవతే వాసుదేవాయః మంత్రోపదేశం అనుగ్రహిస్తు నారాయణుని పూజించే
విధానం వివరిస్తున్నాడు. – గరిక పోచల వలె శ్యామల వర్ణం గల
వాసుదేవుని గరికపోచలతో పూజించాలి; పద్మాలవంటి కన్నులు
కలవాడు కనుక పూజించాలి; తులసి మాలలు ధరిస్తాడు కనుక తులసీ
దళాలతో పూజించాలి; మాలిన్యం లేని శీలం కలవాడు కనుక ఆ
స్వామిని పూలమాలలతో సేవించాలి; గరుత్మంతుని
వాహనంగా కల వైకుంఠుని చిగురాకులతో సేవించాలి; లోకాలకు
సృష్టికి ఆది మూలమైన వాడు కాబట్టి వనమూలికలతో ఆరాధించాలి; పచ్చని పట్టు
వస్త్రాలు కట్టుకొనే హరిని బూరుగుబట్టాది నానావిధ వస్త్రాలతో సేవించాలి. మిక్కిలి
భక్కితో ఆ లక్ష్మీపతిని మట్టి, శిల, చెక్క ప్రతిమలలో కాని నిర్మలమైన తీర్థాలలో
కాని పవిత్ర స్థలాలలో కాని ఆరాధించాలి.
దూర్వాంకురంబుల - దూర్వార = గఱిక అనెడి గడ్డి; అంకురంబులన్ = లేత చివుళ్ళతో; దూర్వాంకుర శ్యాము – దూర్వారాంకుర శ్యాము = లేత గఱిక వలె నవనవ లాడు శ్యామల వర్ణుని; జలజంబులను జారు జలజనయనుఁ దులసీ దళంబులఁ దులసికా దాముని - జలజంబులను = పద్మములతో; చారు = అందమైన; జలజ నయనున్ = పద్మముల వంటి కన్నులు కలవాని; తులసీ దళంబులన్ = తులసి దళములతో; తులసీకా దామునిన్ = తులసిమాల ధరించు వాని; = మాల్యంబులను - మాల్యంబులన్ = మాలలతో; సునైర్మల్య చరితుఁ బత్రంబులను
బక్షిపత్రునిఁ గడు వన్య - సు = మంచి; నైర్మల్య = నిర్మల మైన; చరితున్ = వర్తన కల వానిని; పత్రంబులన్ = ఆకులతో; పక్షి = గరుత్మంతుని; పత్రుని = రెక్కలపై కల వానిని; కడు = అనేక మైన; వన్య = అడవి; = మూలంబులను నాది మూల ఘనుని నంచిత
- మూలంబులను = దుంపలతో; ఆది మూల ఘనుని = సృష్టికి మొదటి దుంప వంటి వానిని; అంచిత = చక్కటి; భూర్జ త్వ గాది నిర్మిత - భూర్జ = బూరుగుదూది; త్వక్ = బట్ట; ఆది = మొద లైన వానిచే; నిర్మిత = చేయబడిన; వివి దాంబరంబులను - వివిధ = రకరకముల; అంబరములను = వస్త్రముల చేత; పీతాంబరధరుఁ దనరు భక్తిని
– పీతాంబర ధరునిన్ = విష్ణుమూర్తిని; తనరు = అతిశయించిన; భక్తిని = భక్తితో.
మృ చ్ఛిలా దారు రచిత
- మృత్ = మట్టి; శిలా = శిల; దారు = కర్ర; రచిత = చేయబడిన; రూపముల
- రూపములన్ = బొమ్మలు; యందుఁ గాని
- అందు = వలన; కాని = కాని; నిరూఢ మైన = ప్రసిద్ధమైన; సలిలముల = జలముల; యందుఁ గాని
- అందు = లో; కాని = కాని; సుస్థలము
లందుఁ గాని - సుస్థలముల = మంచి ప్రదేశముల; అందు = లో; కాని = కాని; పూజింపవలయు
న క్కమలనాభు - పూజింపవలయున్ = పూజించవలెను; ఆ = ఆ; కమలనాభున్ = విష్ణుమూర్తిని {కమలనాభుడు - పద్మము నాభి యందు కలవాడు, విష్ణువు}.
తెలుగుభాగవతం.కం http://www.telugubhagavatam.com/
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||
No comments:
Post a Comment