Thursday, August 8, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_19


10.1-414-తే.
పిడుగు పడదు; గాక పెనుగాలి విసరదు;
ఖండితంబు లగుట గానరాదు;
బాలుఁ డితఁడు; పట్టి డఁద్రోయఁ జాలఁడు;
తరువు లేల గూలె రణిమీఁద.
          అసలు ఈ మహా వృక్షాలు ఎలా పడిపోయాయి? పిడుగు పడింది లేదు. పోనీ పెద్దగాలి వీచిందా అంటే అదిలేదు. ఎవరు నరికిన సూచనలు ఏమి లేవు. కూకటి వేళ్ళతో సహా కూలిపోయాయి. ఈ పిల్లాడు ఏమైనా పడగొట్టాడు అనుకుందా మంటే మరీ ఇంత పసిపిల్లాడు అంత పెద్ద చెట్లను పడ తొయ్యటం అసాధ్యం కదా! మరి అయితే ఈ చెట్లు ఎలా కూలిపోయినట్లు?
          అనుకుంటు, బాలకృష్ణుడు రోలు దొర్లించుకుంటు వెళ్ళి పడదోసిన మద్దిచెట్లను చూసిన, గోపాలకులు దీనిని ఉత్పాతంలా భావిస్తు సందేహపడ సాగారు.
పిడుగు = పిడు గేమీ; పడదు గాక - పడదు = పడలేదు; కాక = అదికాకుండ; పెనుగాలి = గట్టిగాలి; విసరదు = వేయలేదు; ఖండితంబు లగుట గానరాదు - ఖండితంబులు = నరకబడినవి; అగుటన్ = అగుటకూడ; కానరాదు = కనబడదు; బాలుఁ డితఁడు - బాలుడు = చిన్నపిల్లవాడు; ఇతడున్ = ఇతను; పట్టి = పట్టుకొని; పడఁద్రోయఁ జాలఁడు - పడద్రోయన్ = పడునట్లు తోయుటకు; చాలడు = సమర్థుడు గాడు; తరువు లేల గూలె - తరువులు = వృక్షములు; ఏలన్ = ఎందుచేత; కూలెన్ = పడిపోయినవి; ధరణిమీఁద - ధరణి = నేల; మీదన్ = మీద.
తెలుగుభాగవతం.కం  http://www.telugubhagavatam.com/

|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||

No comments: