8-86-క.
కలఁ డందురు దీనుల యెడఁ
గలఁ డందురు పరమ యోగి గణముల పాలం
గలఁ డందు రన్ని దిశలను
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో? లేఁడో?
దేవుడు ఆర్తు లైన వారి వెంట ఉంటాడు
అని అంటారు. ఉత్తము లైన యోగుల చెంత ఉంటా డని అంటారు. అన్ని దిక్కుల లోను ఉంటా
డంటారు. “ఉన్నాడు ఉన్నాడు” అనే ఆ దేవుడు మరి ఉన్నాడో! లేడో!
పోతనా
మాత్యుల వారి గజేంద్రుని అతి ప్రసిద్ధమైన మొర. మరి మహా పండితులు ఉత్తినే అంటారా గంటం
పంచదారలో అద్ది రాసుంటా డని .
కలఁ డందురు - కలడు = ఉన్నాడు; అందురు = అనెదరు; దీనుల యెడఁ
గలఁ డందురు - దీనుల = ఆర్తుల; యెడన్ = వెంట; కలడు = ఉంటాడు; అందురు = అనెదరు; పరమ యోగి
- పరమ = అత్యుత్తమ మైన; యోగి = యోగుల; గణముల = సమూహముల; పాలం గలఁ
డందు రన్ని - పాలన్ = అందు; కలడు = ఉన్నాడు; అందురు = అనెదరు; అన్ని = సర్వ; దిశలను
గలఁడు - దిశలను = దిక్కు లందును; కలడు = ఉన్నాడు; కలం డనెడి
వాఁడు గలఁడో - కలండు = ఉన్నాడు; అనెడి = అనెటటువంటి; వాడు = వాడు; కలడో = ఉన్నాడో; లేఁడో
- లేడో = లేడో. తెలుగుభాగవతం.కం http://www.telugubhagavatam.com/ || ఓం నమో భగవతే వాసుదేవాయః ||
1 comment:
అమృతం.. అమోఘం... పోతన గారి భాగవతం... తెలుగు గడ్డ మీద పుట్టింది, ఈ అమృతాన్ని సేవంచటం కోసమే అనుకుంటున్న..
Post a Comment