Monday, August 19, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_29


కీడు నాచరింపము

1-479-క.
            కీడు నాచరింపము
            లోకులకున్ మనము సర్వలోక సములమున్
            శోకింప నేల పుత్రక!
            కా కోదర మేల వచ్చెఁ? గంఠంబునకున్.
1-479-ka.
ae keeDu naachariMpamu
lOkulakun^ manamu sarvalOka samulamun^
SOkiMpa naela putraka!
kaa kOdara maela vachche@M? gaMThaMbunakun^.
        నాయనా! మనం లోకంలో ఎవరికి ఎలాంటి అపకారము చేసేవాళ్ళం కాదు కదా. మనం లోకంలో అందరిని సమానంగానే చూస్తాం కదా. అయినా, నా మెడలోకి ఈ పాము ఎలా వచ్చింది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు?   అని తండ్రి యైన శమీక మహర్షి పరీక్షితుని శపించిన శృంగిని అడిగాడు.
        ఏ కీడు నాచరింపము - = ; కీడున్ = కీడు - అపకారమును; ఆచరింపము = కలుగజేయము; లోకులకున్ - లోకులు = జనులు; కున్ = కు; మనము - మనము = మనము; సర్వలోక - సర్వ = సమస్త; లోక = లోకులను; సములమున్ = సమానముగా చూచు వారము; శోకింప నేల - శోకింపన్ = ఏడ్చుట; ఏల = ఎందుకు; పుత్రక = కుమారా; కాకోదర మేల - కాకోదరము = పాము; ఏల = ఎందుకు; వచ్చెఁ గంఠంబునకున్ - వచ్చెన్ = వచ్చెను; కంఠంబు = మెడమీద; కున్ = కు.
|| ఓం నమో భగవతే వాసుదేవాయః || 

No comments: