Monday, August 5, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_16


2-78-క.
తోజసంభవ నా కీ
తోము వివరింపు, చాలఁ దోఁచిన నే నా
తోము వారికి నన్యుల
తోములం జెందకుండ ధ్రువ మెఱిఁగింతున్.
        ఓ బ్రహ్మ దేవుడా! నాకు ఈ విషయం బాగా అర్థమయ్యేలా వివరించు. నన్ను అనుసరించేవాళ్ళకి ఇతర మార్గాలకు పోకుండా గట్టిగా బోధిస్తాను.
        నారదుడు బ్రహ్మ దేవుని నీవే కదా అధిదేవుడివి. నీవు ఎవరిని ధ్యానిస్తున్నావు అని అడుగుతున్న సందర్భంలోది ఈ పద్యం. దీంట్లో తోయము అనే పదానికి ఉన్న నీరు, విధము, పరివారము, తెగ అనే నానా అర్థాలు ఎంతో చక్కగా వాడిన పోతన గారి పలుకుల చమత్కృతి గమనించారు కదా.
        తోయజసంభవ - తోయన్ = నీటిలో; = పుట్టినదానిలో (పద్మమున); సంభవ = పుట్టినవాడ (బ్రహ్మ); నాకీ - నాకున్ = నాకు; = ; తోయము - తోయమున్ = వృత్తాంతమును; వివరింపు = వివరముగ చెప్పు; చాలఁ దోఁచిన - చాలన్ = సరిపడ; తోచినన్ = గోచరించినచో, తెలిసినచో; నేనా - నేన్ = నేను; నా = నా యొక్క; తోయము = తోటి, వంటి; వారికి నన్యుల - వారన్ = వారల; కిన్ = కి; అన్యుల = ఇతరుల; తోయములం జెందకుండ - తోయములన్ = పద్ధతులలో, మార్గములో; చెందక = పడకుండగ; ఉండన్ = ఉండునట్లు; ధ్రువ మెఱిఁగింతున్ - ధ్రువమున్ = నిశ్చయమైనదిగ; ఎఱిఁగింతున్ = తెలియజేయుదును.
తెలుగుభాగవతం.కం  http://www.telugubhagavatam.com/
 || ఓం నమో భగవతే వాసుదేవాయః ||

No comments: