Tuesday, August 6, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_17


8-54-క.
రిఁ దిగుచు మకరి సరసికిఁ
రి దరికిని మకరిఁ దిగుచు రకరి బెరయన్
రికి మకరి మకరికిఁ గరి
మనుచును నతల కుతల టు లరుదు పడన్.
        గజేంద్రుణ్ణి మొసలి మడుగులోకి లాగింది. ఆ మొసలిని ఏనుగుల రాజు గట్టుపైకి ఈడ్చింది. రెండూ ద్వేషాన్ని పెంచుకున్నాయి, ఏనుగు కంటె మొసలి బలమైనది, మొసలి కంటె ఏనుగు బలమైంది. అని అనుకుంటు అతల కుతల లోకాల వీరులు ఆశ్చర్యపడ్డారు.
          గజేంద్ర మోక్షంలోని ఈ పోతన పద్య నడక సౌందర్యం ఆస్వాదించండి. కార కార కారాలు ఎంత చక్కగా కుదిరాయో చూసారా. శత్రువు లిద్దరికి సరిపోలే పదాలు కరి మకరి వాడారు చూసారా. మరి గజరాజ రక్షకునికి సర్వం సమానమే కదా.
        కరిఁ దిగుచు - కరిన్ = ఏనుగును; తిగుచున్ = లాగును; మకరి = మొసలి; సరసికిఁ గరి - సరసి = మడుగులోని; కిన్ = కి; కరి = ఏనుగు; దరికిని - దరి = ఒడ్డున; కిని = కి; మకరిఁ దిగుచు గర కరి బెరయన్ - మకరిన్ = మొసలిని; తిగుచున్ = లాగును; కరకరిన్ = శౌర్యము; పెరయన్ = అతిశయించగా; గరికి - కరి = ఏనుగున; కిన్ = కు; మకరి = మొసలి; మకరికిఁ గరి - మకరి = మొసలి; కిన్ = కి; కరి = ఏనుగు; భర మనుచును నతల కుతల - భరము = భారమైనది; అనుచున్ = అంటూ; అతల = అతలలోకపు; కుతల = కుతలలోక; భటు లరుదు - భటుల్ = వీరులు; అరుదు = ఆశ్చర్య; పడన్ = పడగా.

తెలుగుభాగవతం.కం  http://www.telugubhagavatam.com/

 || ఓం నమో భగవతే వాసుదేవాయః ||

2 comments:

Snigdha said...

avvnu andi.. potana garu chakkani paddalu upayogincharu...e padyallu maku noti ki eppudu vostayo...

vsrao5- said...

+snigdha గారికి,
మీ స్పందనకు ధన్యవాదాలు. అవును తల్లీ పోతనామాత్యులు వారి పద్యాలన్నీ చక్కటివి, చిక్కటివి, తియ్యటివి. అవి నోటికి రావటమే కాదు హృదయంలో జీర్ణం చేసుకో దగ్గవి.