10.1-368-క.
గజ్జలు గల్లని మ్రోయఁగ
నజ్జలు ద్రొక్కుటలు మాని యతిజవమున యో
షిజ్జనములు నగఁ దల్లియుఁ
బజ్జం జనుదేర నతఁడు పరువిడె నధిపా!
కృష్ణుని
అల్లరి చూసి యశోద దండించ బోగా ఓ పరీక్షిన్మహారాజా! కాలి గజ్జలు గల్లుగల్లు మని మోగుతుండగా చిందులు తొక్కటం మానేసి పరుగెట్టాసాగాడు. గొల్లభామలు చూసి నవ్వుతున్నారు.
తల్లి వెంటబడి పరిగెట్టింది. అతను
తల్లికి అందకుండా బాగా వేగంగా పరుగెత్తాడు.
గజ్జలు = కాలిగజ్జలు; గల్లని
- గల్లు = గల్లుగల్లు; అని = అని; మ్రోయఁగ
నజ్జలు ద్రొక్కుటలు - మ్రోయగన్ = మోగుతుండగా; అజ్జలు = చిందులు; త్రొక్కుటలు = వేయుట; మాని = వదిలేసి; యతి
- అతి = మిక్కిలి; జవమున
- జవమునన్ = వేగముగా; యోషిజ్జనములు = ఆడవాళ్ళు; నగఁ దల్లియుఁ
బజ్జం జనుదేర నతఁడు - నగన్ = నవ్వుతుండగ; తల్లియున్ = తల్లి; పజ్జన్ = కూడా; చనుదేరన్ = వస్తుండగా; అతడు = అతను; పరువిడెనధిపా
- పరువిడెన్ = పరుగెట్టెను; అధిపా = రాజా.
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||
No comments:
Post a Comment