Tuesday, August 20, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_30


8-74 పరి జగములు

8-74-క.
            పరి జగములు వెలినిడి
            యొపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై
            లార్థ సాక్షి యగు న
            య్యలంకుని నాత్మమూలు ర్థిఁ దలంతున్.
8-74-ka.
            okapari jagamulu veliniDi
            yokapari lOpaliki@M gonuchu nubhayamu@M daanai
            sakalaartha saakshi yagu na
            yyakalaMkuni naatmamoolu narthi@M dalaMtun^.
            ఒకసారి లోకాలను సృష్టి చేసి, ఇంకొకసారి తనలో లయం చేసుకుంటు, ఆ లోకాలు రెండు తానే అయ్యి, అన్ని విషయాలను సాక్షీభూతంగా ఆలోకిస్తూ, ఆత్మలకు ఆత్మ అయిన ఆ పరమాత్మను ఆసక్తితో ధ్యానం చేస్తాను.అని గజేంద్రుడు మొసలి బారిన పడి శరణు కోరుటకు భగవంతుని నెలకొల్పుకుంటున్నాడు.
          ఒకపరి = ఒకసారి; జగములు = లోకములను; వెలినిడి = బయటపెట్టి, సృష్టించి; యొకపరి - ఒకపరి = ఒకసారి; లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై - లోపలికిన్ = తనలోపలికి; కొనుచున్ = లయము చేసికొనుచు; ఉభయంబున్ = ఆ రెండు లోకములును; తాను = తనే; = అయ్యి; సకలార్థసాక్షి - సకల = సమస్తమైన; అర్థ = విషయములకు; సాక్షి = అతీతముగ చూచువాడు; యగు న య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్ - అగున్ = అయినట్టి; = ; అకలంకున్ = దోషములు లేని వానికి; ఆత్మమూలున్ = పరమాత్మను; అర్థిన్ = కోరి; తలంతున్ = ధ్యానము చేసెదను. 

|| ఓం నమో భగవతే వాసుదేవాయః || 

No comments: