తోయములు దెమ్ము
1-460-క.
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||
"తోయములు దెమ్ము మా కీ
తోయము వేఁటాడు వేళ దొల్లి పొడమ దీ
తోయముక్రియ జలదాహము
తోయమువారలును లేరు దుస్సహ మనఘా!"
పరీక్షిన్మహారాజు తీవ్ర దాహంతో ముని వాటిక చేరి తపోమగ్ను
డైన శమీకుని చూసి నీళ్ళి మ్మని అడిగాడు. మహారాజు కదా ఎంత అందంగా అడుగు తున్నాడో చూడండి.
(సాహిత్యంలో అందా లద్దడానికి వాడేవి అలంకారాలు. ఆడంబరానికి శబ్దాలంకారం ప్రసిద్ధి.
రెండు కాని అంతకంటె ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థ బేధం
ఉంటే అది యమకం).
మంచి నీళ్ళియ్యి మహానుభావా! నీకు పుణ్యం ఉంటుంది. వేటాడ లే
నంత దాహంతో వచ్చా నిప్పుడు. ఇంత దుస్సహ మైన దాహం ఎప్పుడూ లేదు. మా వాళ్ళా
అందబాటులో లేరు. తట్టుకోలేకపోతున్నా తొందరగా ఇయ్యి.
తోయములు దెమ్ము - తోయములు = నీరు; తెమ్ము = తీసుకొని రమ్ము; మాకీ - మాకు = మాకు; ఈ = ఈ; తోయము - తోయము = తడవు; వేఁటాడు వేళ దొల్లి - వేఁటాడు = వేటాడు; వేళ = సమయములో; తొల్లి = ఇంతకు ముందు; పొడమ దీ - పొడమదు = కలుగదు; ఈ = ఈ; తోయము క్రియ - తోయము = విధము; క్రియ = వలె; జల దాహము - జల = నీటి కోసము; దాహము = దాహము; తోయము వారలును - తోయము = తోటి; వారలును = వారును; లేరు - లేరు = లేరు; దుస్సహ మనఘా - దుస్సహము = సహించుటకు కష్టమైనది; అనఘా = పాపము లేనివాడా.
No comments:
Post a Comment