Saturday, October 31, 2015

ప్రహ్లాద చరిత్ర - పగవారైన

7-119-మత్తేభ విక్రీడితము
పగవారైన సురేంద్రులున్ సభలలోఁ బ్రహ్లాదసంకాశులన్
సుగుణోపేతుల నెందు నే మెఱుఁగ మంచున్ వృత్తబంధంబులం
బొగడం జొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ! మీబోఁటి స
ద్భగవద్భక్తులు దైత్యరాజతనయుం బాటించి కీర్తింపరే?

७-११९-मत्तेभ विक्रीडितमु
पगवारैन सुरेंद्रुलुन् सभललोँ ब्रह्लादसंकाशुलन्
सुगुणोपेतुल नेंदु ने मेर्रुँग मंचुन् वृत्तबंधंबुलं
बोगडं जोत्तुरु सत्कवींद्रुल क्रियन् भूनाथ! मीबोँटि स
द्भगवद्भक्तुलु दैत्यराजतनयुं बाटिंचि कीर्तिंपरे?

         పగవారు = శత్రువులు; ఐనన్ = అయినను; సుర = దేవతా; ఇంద్రులున్ = ప్రభువులుకూడ; సభల్ = సభలు; లోన్ = అందు; ప్రహ్లాద = ప్రహ్లాదునికి; సంకాశులన్ = సమానమైనవారిని; సుగుణ = మంచిగుణములు; ఉపేతులన్ = కలవారిని; ఎందున్ = ఎక్కడను; నేము = మేము; ఎఱుంగము = తెలియము; అంచున్ = అనుచు; వృత్త = పద్యవృత్తములందు; బంధంబులన్ = కూర్చబడినవానిలో; పొగడన్ = స్తుతించ; చొత్తురు = ప్రారంభించిరి; సత్ = మంచి; కవీంద్రులన్ = కవులవలె; క్రియన్ = వలె; భూనాథ = రాజా {భూనాథుడు - భూ (రాజ్యమునకు) నాథుడు (ప్రభువు), రాజు}; మీ = మీ; పోటి = వంటి; సత్ = నిజమైన; భగవత్ = భగవంతుని; భక్తులు = భక్తులు; దైత్యరాజతనయున్ = ప్రహ్లాదుని; పాటించి = లక్షించి; కీర్తింపరే = స్తుతింపరా ఏమి.

ఓ నరేంద్రా! రాక్షసకులంలో పుట్టిన అతని ఆజన్మ శత్రువులైన ఇంద్రుడు మొదలైన దేవతాశ్రేష్ఠులు సైతం, “ప్రహ్లాదుని వంటి మహాత్ములు సుగుణశీలురు ఎక్కడా ఉండరు” అంటూ గొప్ప పండితులు సభలలో చదివినట్లు రకరకాల వృత్తాలలో పద్యాలల్లి మరీ పొగుడుతుంటారు. ఇంక మీలాంటి భాగవతత్తములు అతనిని పొగడకుండా ఉంటారా?
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Friday, October 30, 2015

ప్రహ్లాద చరిత్ర - ఆకార జన్మ

7-116-వచనము
మఱియును.
7-117-సీస పద్యము
కార జన్మ విద్యార్థ వరిష్ఠుఁడై; ర్వసంస్తంభ సంతుఁడు గాఁడు
వివిధ మహానేక విషయ సంపన్నుఁడై; పంచేంద్రియములచేఁ ట్టుబడఁడు
వ్య వయోబల ప్రాభవోపేతుఁడై; కామరోషాదులఁ గ్రందుకొనఁడు
కామినీ ప్రముఖ భోము లెన్ని గలిగిన; వ్యసన సంసక్తి నావంకఁ బోఁడు
7-117.1-ఆటవెలది
విశ్వమందుఁ గన్న విన్న యర్థము లందు; స్తుదృష్టిఁ జేసి వాం యిడఁడు
రణినాథ! దైత్యనయుండు హరిపర; తంత్రుఁ డై హతాన్యతంత్రుఁ డగుచు.
              మఱియును = ఇంకను.
               ఆకార = అందమునందు; జన్మ = వంశమునందు; విద్య = చదువునందు; అర్థ = సంపదలందు; వరిష్ఠుడు = గొప్పవాడు; = అయ్యి; గర్వ = గర్వముయొక్క; సంస్తంభ = ఘనీభవించుటను; సంగతుడు = కలవాడు; కాడు = కాదు; వివిధ = పలురకముల; మహా = గొప్ప; అనేక = అనేకమైన; విషయ = విషయపరిజ్ఞానములనెడి; సంపన్నుడు = సంపదలుగలవాడు; = అయ్యి; పంచేంద్రియముల్ = పంచేంద్రియములు {పంచేంద్రియములు - త్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణములనెడి యైదింద్రియములు}; చేన్ = వలన; పట్టుబడడు = లొంగిపోడు; భవ్య = మంచి; వయోస్ = ప్రాయము; బల = బలము; ప్రాభవము = ప్రభుత్వాధికారము; ఉపేతుడు = కూడినవాడు; = అయ్యి; కామరోషాదులన్ = కామక్రోధాదులందు {కామక్రోధాదులు - 1కామ 2లోభ 3క్రోధ 4మోహ 5మద 6మాత్సర్యములనెడి అరిషడ్వర్గములు}; క్రందుకొనడు = చొరడు; కామినీ = కాంత; ప్రముఖ = ఆదులైన; భోగములు = భోగములు; ఎన్ని = ఎన్ని; కలిగినన్ = ఉన్నప్పటికిని; వ్యసన = వ్యసనములందు; సంసక్తిన్ = తగులముతో; = అటు; వంకన్ = వైపు; పోడు = వెళ్ళడు.
 విశ్వము = జగత్తు; అందున్ = లోన; కన్న = చూసినట్టి; విన్న = వినినట్టి; అర్థములు = వస్తువుల; అందున్ = ఎడల; వస్తుదృష్టిన్ = బ్రహ్మేతరమేలేదన్నదృష్టితో; చేసి = చూసి; వాంఛ = కోరిక; ఇడడు = పెట్టుకొనడు; ధరణీనాధ = రాజా {ధరణీనాధ - ధరణీ (భూమికి) నాథుడు (ప్రభువు), రాజు}; దైత్యతనయుండు = ప్రహ్లాదుడు {దైత్యతనయుడు - దైత్య (రాక్షసుడైన హిరణ్యకశిపుని) పుత్రుడు, ప్రహ్లాదుడు}; హరి = నారాయణునియందు; పరతంత్రుడు = పరాధీనుడు; = అయ్యి; హత = అణచివేయబడిన; అన్య = ఇతరమైన; తంత్రుడు = ప్రవృత్తులుగలవాడు; అగుచు = అగుచు.
७-११६-वचनमु
मर्रियुनु.
७-११७-सीस पद्यमु
आकार जन्म विद्यार्थ वरिष्ठुँडै; गर्वसंस्तंभ संगतुँडु गाँडु
विविध महानेक विषय संपन्नुँडै; पंचेंद्रियमुलचेँ बट्टुबडँडु
भव्य वयोबल प्राभवोपतुँडै; कामरोषादुलँ ग्रंदुकोनँडु
कामिनी प्रमुख भोगमु लेन्नि गलिगिन; व्यसन संसक्ति नावंकँ बोँडु
७-११७.१-आटवेलदि
विश्वमंदुँ गन्न विन्न यर्थमु लंदु; वस्तुदृष्टिँ जेसि वांछ यिडँडु
धरणिनाथ! दैत्यतनयुंडु हरिपर; तंत्रुँ डै हतान्यतंत्रुँ डगुचु.
            ఇంకా ప్రహ్లాదుడు ఎల్లప్పుడు విష్ణువును తన చిత్తమునందు చేర్చుకుని ఇతర ఆలోచనలు అన్నీ వదిలేస్తాడు. సౌందర్యము, కులము, చదువు, ధనము సమృద్ధిగా ఉన్నా కూడా గర్వపడడుగొప్ప వస్తువులు ఎన్నో అందుబాటులో ఉన్నా ఇంద్రియ లోలుడు కాడు. దివ్యమైన యౌవనమూ బలమూ అధికారములు అన్నీ ఉన్నా కామము, క్రోధాది అరిషడ్వర్గానికి లొంగడు. స్త్రీలు మొదలగు చాపల్య భోగములెన్ని  ఉన్నా వ్యసనాలలో తగులుకోడు. లోకంలో కనబడేవీ, వినబడేవీ అయిన వస్తువులను వేటినీ కావాలని వాంఛించడు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

ప్రహ్లాద చరిత్ర - సద్గుణంబు లెల్ల

7-118-ఆటవెలది
సద్గుణంబు లెల్ల సంఘంబు లై వచ్చి
యసురరాజతనయ నందు నిలిచి
పాసి చనవు విష్ణుఁ బాయని విధమున
నేఁడుఁ దగిలి యుండు నిర్మలాత్మ!
७-११८-आटवेलदि
सद्गुणंबु लेल्ल संघंबु लै वच्चि
यसुरराजतनय नंदु निलिचि
पासि चनवु विष्णुँ बायनि विधमुन

नेँडुँ दगिलि युंडु निर्मलात्म!

సద్గుణంబులు = సుగుణములు; ఎల్లన్ = సర్వమును; సంఘంబులు = గుంపులు కట్టినవి; ఐ = అయ్యి; వచ్చి = వచ్చి; అసురరాజతనయన్ = ప్రహ్లాదుని {అసురరాజతనయడు - అసుర (రాక్షస) రాజ (రాజు యైన హిరణ్యకశిపుని) తనయుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు}; అందున్ = అందు; నిలిచి = స్థిరపడి; పాసి = వదలి; చనవు = పోవు; విష్ణున్ = విష్ణుమూర్తిని; పాయని = వదలిపోని; విధమునన్ = విధముగ; నేడు = ఇప్పుడు; తగిలి = లగ్నమై; ఉండున్ = ఉండును; నిర్మలాత్మా = శుద్దచిత్తముగలవాడా.

నిర్మలమైన మనసు గల పరీక్షిన్మహారాజా! ఆ రాక్షస రాకుమారుడు ప్రహ్లాదుడు  విష్ణుమూర్తిని ఎప్పటికీ వదలిపెట్టడు. అలాగే సుగుణాలు అన్నీ, ఎప్పటికీ విడిచిపెట్టకుండా, అతనిలో ప్రోగుపడి ఉంటాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=6&Padyam=118.0
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Thursday, October 29, 2015

ప్రహ్లాద చరిత్ర - తన యందు

7-115-సీస పద్యము
తన యందు నఖిల భూతము లందు నొకభంగి; సమహితత్వంబున జరుగువాఁడు;
పెద్దలఁ బొడగన్న భృత్యునికైవడిఁ; జేరి నమస్కృతుల్ చేయువాఁడు;
కన్నుదోయికి నన్యకాంత లడ్డం బైన; మాతృభావము జేసి మరలువాఁడు;
తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను; దీనులఁ గావఁ జింతించువాఁడు;
7-115.1-తేటగీతి
సఖుల యెడ సోదరస్థితి జరుపువాఁడు; దైవతము లంచు గురువులఁ దలఁచువాఁడు
లీల లందును బొంకులు లేనివాఁడు; లలితమర్యాదుఁ డైన ప్రహ్లాదుఁ డధిప!

ఓ ధర్మరాజా! ఆ ప్రహ్లాదుడు చక్కటి మర్యాద, మంచి చెడు వివేకం తెలిసినవాడు. జీవులు అందరిని తనతో సమానులుగా చూస్తూ సమ భావం నెరపుతూ మెలుగుతాడు. పెద్దవారిని చూస్తే దగ్గరకు వెళ్ళి సేవకుడిలా మొక్కుతాడు. పరస్త్రీలు కనబడితే తన తల్లివలె చూసి దారి ఇస్తాడు. దిక్కులేని వారిని తల్లిదండ్రుల వలె రక్షిస్తాడు. స్నేహితులను అన్నదమ్ముల్లా చూస్తాడు. గురువులను దేవుళ్ళు గా భావిస్తాడు. సరదాలకు కూడ అబద్ద మాడడు.
దానవ రాజు హిరణ్యకశిపుడికి నలుగురు కొడుకులు. వారు సంహ్లాదుడు, హ్లాదుడు, అనుహ్లాదుడు, ప్రహ్లాదుడు. వారిలో ప్రహ్లాదుడు మహాభక్తుడు. అతని చరిత్ర నారదుడు ధర్మరాజుకి చెప్తున్నాడు.  
७-११५-सीस पद्यमु
तन यंदु नखिल भूतमु लंदु नोकभंगि; समहितत्वंबुन जरुगुवाँडु;
पेद्दलँ बोडगन्न भृत्युनिकैवडिँ; जेरि नमस्कृतुल् चेयुवाँडु;
कन्नुदोयिकि नन्यकांत लड्डं बैन; मातृभावमु जेसि मरलुवाँडु;
तल्लिदंड्रुल भंगि धर्मवत्सलतनु; दीनुलँ गावँ जिंतिंचुवाँडु;
७-११५.१-तेटगीति
सखुल येड सोदरस्थिति जरुपुवाँडु; दैवतमु लंचु गुरुवुलँ दलँचुवाँडु
लील लंदुनु बोंकुलु लेनिवाँडु; ललितमर्यादुँ डैन प्रह्लादुँ डधिप!
తన = తన; అందున్ = ఎడల; అఖిల = ఎల్ల; భూతముల్ = ప్రాణుల; అందున్ = ఎడల; ఒక = ఒకే; భంగిన్ = విధముగ; సమహిత = సమత్వ; తత్వంబునన్ = భావముతో; జరుగు = మెలగు; వాడు = వాడు; పెద్దలన్ = పెద్దలను; పొడగన్న = గమనించినచో; భృత్యుని = సేవకుని; కైవడి = వలె; చేరి = దగ్గరకు వెళ్ళి; నమస్కృతుల్ = నమస్కారములు; చేయు = చేసెడి; వాడు = వాడు; కన్నుదోయి = రెండుకళ్ళ; కిన్ = కి; అన్య = ఇతర; కాంతలు = స్త్రీలు; అడ్డంబు = ఎదురుపడుట; ఐన = జరిగిన; మాతృ = తల్లి యనెడి; భావము = భావము; చేసి = వలన; మరలు = మెలిగెడి; వాడు = వాడు; తల్లిదండ్రుల = తల్లిదండ్రుల; భంగిన్ = వలె; ధర్మవత్సలతన్ = న్యాయబుద్ధితో; దీనులన్ = బీగలను; కావన్ = కాపాడుటకు; చింతించు = భావించు; వాడు = వాడు.
సఖుల = స్నేహితుల; యెడ = అందు; సోదర = తోడబుట్టినవాడి; స్థితిన్ = వలె; జరుపు = నడపు; వాడు = వాడు; దైవతములు = దేవుళ్ళు; అంచున్ = అనుచు; గురువులన్ = గురువులను; తలచు = భావించెడి; వాడు = వాడు; లీలలు = ఆటలు; అందును = లోనయినను; బొంకులు = అబద్ధములు; లేని = చెప్పనేచెప్పని; వాడు = వాడు; లలిత = చక్కటి; మర్యాదుడు = మర్యాదగలవాడు; ఐన = అయిన; ప్రహ్లాదుడు = ప్రహ్లాదుడు; అధిప = రాజా.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, October 28, 2015

కాళియ మర్దన - సరసిజనిభహస్తా

10.1-1791-మాలి.
సరసిజనిభహస్తా! సర్వలోకప్రశస్తా!
నిరుపమ శుభమూర్తీ! నిర్మలారూఢకీర్తీ!
పరహృదయవిదారీ! భక్తలోకోపకారీ!
గురుబుధజనతోషీ! ఘోరదైతేయశోషీ!
సరసిజనిభహస్తా = శ్రీరామా {సరసిజనిభహస్తుడు - సరసిజ (పద్మము) నిభ (వంటి) హస్తుడు (అరచేతులు కలవాడు), శ్రీరాముడు}; సర్వలోకప్రశస్తా = శ్రీరామా {సర్వలోకప్రశస్తుడు - సర్వ (సమస్తమైన) లోక (లోకములలోను) ప్రశస్తుడు (శ్లాఘింపబడువాడు), శ్రీరాముడు}; నిరుపమశుభమూర్తీ = శ్రీరామా {నిరుపమశుభమూర్తి - నిరుపమ (సాటిలేని) శుభ (మేళ్ళు కలిగించెడి) మూర్తి (ఆకృతి కలవాడు), శ్రీరాముడు}; నిర్మలారూఢకీర్తీ = శ్రీరామా {నిర్మలారూఢకీర్తి - నిర్మల (పరిశుద్ధమైన) ఆరూఢ (నిలకడైన) కీర్తి (కీర్తి కలవాడు), శ్రీరాముడు}; పరహృదయవిదారీ = శ్రీరామా {పరహృదయవిదారి - పర (విరోధుల) హృదయ (గుండెలను) విదారి (చీల్చెడి వాడు), శ్రీరాముడు}; భక్తలోకోపకారీ = శ్రీరామా {భక్తలోకోపకారి - భక్తులను లోక (ఎల్లరకు) ఉపకారి (ఉపకారము చేయువాడు), శ్రీరాముడు}; గురుబుధజనతోషీ = శ్రీరామా {గురుబుధజనతోషి - గురు (గొప్ప) బుధ (ఙ్ఞానము కల) జన (వారికి) తోషి (సంతోషము కలిగించు వాడు), శ్రీరాముడు}; ఘోరదైతేయశోషీ = శ్రీరామా {ఘోరదైతేయశోషి - ఘోర (క్రూరమైన) దైతేయ (రాక్షసులను) శోషి (నశింపజేయు వాడు), శ్రీరాముడు}.
१०.१-१७९१-मालि.
सरसिजनिभहस्ता! सर्वलोकप्रशस्ता!
निरुपम शुभमूर्ती! निर्मलारूढकीर्ती!
परहृदयविदारी! भक्तलोकोपकारी!
गुरुबुधजनतोषी! घरदैतयशोषी!
పద్మాల వంటి హస్తములు కలవాడా! ఎల్లలోకాలలోను శ్రేష్ఠతమమైన వాడా! సాటిలేని మంగళ స్వరూపము కలవాడా! స్వచ్ఛమైన వన్నెకెక్కిన కీర్తి కలవాడా! శత్రువుల గుండెలను ఖండించు వాడా! భక్త సమూహానికి మేలు చేయువాడా! పెద్దలను, పండితులను సంతోషపరచేవాడా! భయంకరులైన రక్కసులను నాశనము చేయువాడా! శ్రీరామచంద్రప్రభూ! వందనములు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Tuesday, October 27, 2015

కాళియ మర్దన - వారిజలోచను

10.1-701-క.
వారిజలోచనుఁ డెవ్వరు
వారింపగలేని ఫణినివాసత్వంబున్
వారించిన యమున సుధా
వారిం బొలుపారె నెల్లవారికిఁ బ్రియమై.
వారిజలోచనుడు = పద్మాక్షుడు, కృష్ణుడు; ఎవ్వరున్ = ఎవరుకూడ; వారింపగలేని = అడ్డుకొనలేని; ఫణిన్ = కాళియసర్పము యొక్క; నివాసత్వంబున్ = ఉనికిని; వారించినన్ = పోగొట్టగా; యమున = యమునానది; సుధా = అమృతపు; వారిన్ = నీటిని; పొలుపారెన్ = ఒప్పియుండెను; ఎల్లవారి = లోకులందర; కిన్ = కి; ప్రియము = ఇష్టమైనది; అయ్యి = అయ్యి.
१०.१-७०१-क.
वारिजलोचनुँ डेव्वरु
वारिंपगलेनि फणिनिवासत्वंबुन्
वारिंचिन यमुन सुधा
वारिं बोलुपारे नेल्लवारिकिँ ब्रियमै.
కమలలాంటి కన్నులున్న కన్నయ్య ఎవరికి వారింప శక్యంకాని కాళియుడనే సర్పం నివాసాన్ని తొలగించగానే యమునానది అమృతం వంటి నీళ్ళతో అందరికి ప్రీతిపాత్రమై విలసిల్లింది.”
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, October 26, 2015

కాళియ మర్దన - అని యిట్లు.

10.1-700-వ.
అని యిట్లు విచిత్రవిహారుండైన గోపాలకృష్ణకుమారుం డానతిచ్చిన, నియ్యకొని, చయ్యన నయ్యహీంద్రుండు తొయ్యలులుం దానును నెయ్యంబున నయ్యీశ్వరునకు నవ్యదివ్యాంబరాభరణ రత్నమాలికానులేపనంబులు సమర్పించి, తేఁటితండంబులకు దండ యగు నీలోత్పలంబుల దండ యిచ్చి, పుత్ర మిత్ర కళత్ర సమేతుండై, బహువారంబులు కైవారంబుచేసి, వలగొని, మ్రొక్కి లేచి, వీడ్కొని రత్నాకరద్వీపంబునకుం జనియె; నిట్లు.
అని = అని; ఇట్లు = ఈ విధముగ; విచిత్ర = ఆశ్చర్యకరమైన; విహారుండు = వర్తనకలవాడు; ఐన = అయిన; గోపాల = గోపాలుడైన; కృష్ణకుమారుండు = బాలకృష్ణుడు; ఆనతిచ్చినన్ = సెలవియ్యగా, చెప్పగా; ఇయ్యకొని = అంగీకరించి; చయ్యన = శీఘ్రమే; ఆ = ఆ యొక్క; అహి = సర్ప; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; తొయ్యలులున్ = భార్యలు; తానును = అతను; నెయ్యంబునన్ = భక్తితో; ఆ = ఆ ప్రసిద్ధుడైన; ఈశ్వరున్ = కృష్ణున; కున్ = కు; నవ్య = సరికొత్త; దివ్య = భవ్యమైన; అంబర = బట్టలు; ఆభరణ = భూషణములు; రత్నమాలిక = రత్నాలహారములు; అనులేపంబులు = మేని పూతము; సమర్పించి = చక్కగానిచ్చి; తేటి = తుమ్మెదల; తండంబుల్ = బారుల; కున్ = కు; దండ = ఆవాసము; అగు = ఐన; నీలోత్ఫలంబుల = నల్లకలువల; దండ = దండను; ఇచ్చి = ఇచ్చి; పుత్ర = కొడుకులతోను; మిత్ర = స్నేహితులతోను; కళత్ర = భార్యలతోను; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; బహు = అనేక; వారంబులు = మార్లు; కైవారంబులు = నమస్కారములు; చేసి = చేసి; వలగొని = ప్రదక్షిణలుచేసి; మ్రొక్కి = వంగి నమస్కరించి; లేచి = లేచి; వీడ్కొని = శలవుతీసుకొని; రత్నాకర = కడలిలోని {రత్నాకరము - రత్నములు ఉండు స్థానము, సముద్రము}; ద్వీపంబున్ = ద్వీపమున; కున్ = కు; చనియె = వెళ్ళిపోయెను.
१०.१-७००-व.
अनि यिट्लु विचित्रविहारुंडैन गोपालकृष्णकुमारुं डानतिच्चिन, निय्यकोनि, चय्यन नय्यहींद्रुंडु तोय्यलुलुं दानुनु नेय्यंबुन नय्यीश्वरुनकु नव्यदिव्यांबराभरण रत्नमालिकानुलेपनंबुलु समर्पिंचि, तेँटितंडंबुलकु दंड यगु नीलोत्पलंबुल दंड यिच्चि, पुत्र मित्र कळत्र समेतुंडै, बहुवारंबुलु कैवारंबुचेसि, वलगोनि, म्रोक्कि लेचि, वीड्कोनि रत्नाकरद्वीपंबुनकुं जनिये; निट्लु.
ఈ విధంగా విచిత్రమైన నడవడికలు కలిగిన గోపాలుడైన బాలకృష్ణుడు కాళియుడిని ఆఙ్ఞాపించేడు. ఆ నాగరాజు వెంటనే అంగీకరించాడు. తన భార్యలతో కలిసి అతను కృష్ణుడికి సరికొత్త దివ్యవస్త్రాలు, ఆభరణాలు, రత్నహారాలు, సుగంధ మైపూతలు సమర్పించాడు. ఇంకా తియ్యటితేనెలు వెల్లివిరిసే నల్లకలువల దండ సమర్పించాడు. పెళ్ళంపిల్లలు స్నేహితులు అందరితో కలిసి అనేకమార్లు ఆ నందనందనునికి వందనాలు చేసాడు, ప్రదక్షిణలు చేసి, మొక్కాడు. సెలవుతీసుకొని సముద్రంలోని ఒక ద్వీపానికి వెళ్ళిపోయాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, October 25, 2015

కాళియమర్దనం - గరురుడభీతి

10.1-699-ఆ.
రుడభీతి రమణద్వీప మొల్ల కీ
డువుఁ జొచ్చి తీవు; త్పదాబ్జ
లాంఛనములు నీ తను నుంటఁజూచి యా 
క్షిరాజు నిన్నుఁ ట్ట డింక."

టీకా:

గరుడ = గరుత్మంతుని వలన; భీతిన్ = భయముచేత; రమణక = రమణకము అనెడి; ద్వీపమున్ = ద్వీపముననుండుటకు; ఒల్లక = అంగీకరింపక; ఈ = ఈ యొక్క; మడువున్ = మడుగును; చొచ్చితివి = ప్రవేశించితివి; ఈవు = నీవు; మత్ = నా యొక్క; పద = పాదములనెడి; అబ్జ = పద్మముల; లాంఛనములు = గుర్తులు; నీ = నీ యొక్క; తలనున్ = పడగలపైన; ఉంటన్ = ఉండుటను; చూచి = చూసి; ఆ = ఆ ప్రసిద్ధుడైన; పక్షిరాజు = గరుత్మంతుడు; నిన్నున్ = నిన్ను; పట్టడు = పట్టుకొనడు; ఇంక = ఇకపైన. 

jభావము:

ఇంతకు ముందు గరుత్మంతుని వలన భయంతో రమణకద్వీపాన్ని వదలిపెట్టి ఈ మడుగులో చేరావు. కాని నా పాదాల గుర్తులు నీ పడగలమీద ఉండటం చూసి, ఇకపై పక్షిరాజైన గరుత్మంతుడు నిన్ను పట్టుకొనడు.”
http://www.telugubhagavatam.org/Admin.php?tebha&Skanda=10.1&Ghatta=86&Padyam=699.0
చదువుకుందాం భాగవతం - బాగుపడదాం మనం అందరం