Wednesday, April 22, 2015

కృష్ణలీలలు

10.1-367-వచనము
అని నిశ్చయించి కేలనున్న కోల జళిపించి బాలా! నిలునిలు మని బగ్గుబగ్గున నదల్చుచు దల్లి డగ్గఱిన బెగ్గడిలిన చందంబున నగ్గలికచెడి ఱోలు డిగ్గనుఱికి.
         అల్లరి కృష్ణుని ఆగడాలు ప్రత్యక్షంగా చూసిన తల్లి యశోద . .         
         దండించాలి అని నిర్ణయించుకొంది. చేతిలో బెత్తం పట్టుకొని కోపంతో ఝళిపిస్తూ ఒరేయ్ పిల్లాడా! ఆగక్కడ అని అరుస్తూ యశోద దగ్గరకు వచ్చింది . కృష్ణ బాలుడు భయపడినట్లు ముఖం పెట్టి, అల్లరి ఆపేసాడు. గభాలున రోలుమీంచి కిందకి దూకాడు
10.1-367-vachanamu
ani nishchayiMchi kElanunna kOla jaLipiMchi baalaa! nilunilu mani baggubagguna nadalchuchu dalli DaggaRrina beggaDilina chaMdaMbuna naggalikacheDi RrOlu DigganuRriki.
          అని = అని; నిశ్చయించి = నిర్ణయించుకొని; కేలన్ = చేత; ఉన్న = ఉన్నట్టి; కోలన్ = కొరడాకర్రను; జళిపించి = వేగముగాఊపి; బాలా = పిల్లవాడా; నిలునిలుము = ఆగిపొమ్ము; అని = అని; బగ్గుబగ్గున = కోపముతోమండిపోతూ; అదల్చుచు = బెదిరించుచు; తల్లి = అమ్మ; డగ్గఱినన్ = దగ్గరకురాగా; బెగ్గడిలిన = భయపడిపోయిన; చందంబునన్ = విధముగ; అగ్గలిక = ఉత్సాహము; చెడి = పోయి; ఱోలున్ = రోటిని; డిగ్గన = దుమికి; ఉఱికి = పరుగెట్టి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: