Tuesday, February 23, 2016

ప్రహ్లాదుని జన్మంబు - ఇందుగలడందులేడని

7-275-క.
ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే."
టీకా:
ఇందు = దీనిలో, ఇక్కడ; కలడు = ఉన్నాడు; అందు = దానిలో, అక్కడ; లేడు = లేడు; అని = అని; సందేహము = అనుమానము; వలదు = వద్దు; చక్రి = విష్ణువు {చక్రి - చక్రము ఆయుధముగాగలవాడు, విష్ణువు}; సర్వ = అన్నిటియందు; ఉపగతుండు = ఉండువాడు; ఎందెందు = ఎక్కడెక్కడ; వెదకి = వెదకి; చూచినన్ = చూసినచో; అందందే = అక్కడెల్లను; కలడు = ఉన్నాడు; దానవాగ్రణి = రాక్షసరాజా; వింటే = వింటివా.
భావము:
            ఓ హిరణ్యకశిప మహారాజా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం అన్నది లేదు; అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా. రాక్షసరాజా!
            ఇది అతిమధురమైన పద్యం. పోతనగారిది ప్రహ్లాద చరిత్రలోది. పదౌచిత్యం, సందర్భౌచిత్యం, పాత్రౌచిత్యం అందంగా అమరిన పద్యం. బాలుర నోట సున్నాముందున్న దకారం అందంగా పలుకుతుంది కదా (పద్యంలో చిక్కగా బొద్దుగా ఉన్నాయి). ప్రతి పదంలో రెండవ అక్షరాలకి సామ్యం ఉండాలన్నది అందమైన ప్రాస నియమం కదా. ఈ రెంటిన చక్కగా సమన్వయం చేసిన తీరు అద్భుతం. చిన్నపిల్లలు చేతులు కాళ్ళు కదుపుతు చెప్తున్నట్లు చెప్తారు కదా. అది పద్యం నడకలోనే స్పురిస్తున్న తీరు ఇంకా బావుంది. తనకే ఎదురు చెప్తాడా అన్న ఆగ్రహంతో ఊగిపోతున్నాడు తండ్రి హిరణ్యకశిపుడు. అంచేత ‘హరి హరి అంటున్నావు ఎక్కడున్నాడ్రా చూపగలవా?’ అంటు బెదిరిస్తున్నాడు తండ్రి. కొడుకు ప్రహ్లాదుడు నదురు బెదురులేని అయిదేళ్ళ పిల్లాడు. తన బాల్యానికి తగినట్లు అలా చిరునవ్వులతో నటనలు చేస్తూ ‘సర్వోపగతుడు శ్రీహరి’ అని సమాధానం చెప్పాడు. ఆ సందర్భానికి తగినట్లు పద్యం నడక సాగింది. పలుకుతున్న బాలకుడి పాత్రకు గంభీరమైన సున్నితమైన పదాలు ‘ఎందెందు’, ‘అందందు’ చక్కగా తగి ఉన్నాయి. మరి అప్పుడు ఆ పరమభక్తుని మాట బోటుపోనివ్వని నారాయణుడు నరసింహరూపంలో విశ్వమంతా వ్యాపించి సిద్ధంగానే ఉన్నాడట.”
७-२७४-म. 
इंदु गलँ डंदु लेँ डनि
संदेहमु वलदु चक्रि सर्वोपगतुं
डें देंदु वेदकि चूचिन
नंदंदे कलँडु दानवाग्रणि! विंटे."
http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=8&Padyam=275.0
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, February 22, 2016

ప్రహ్లాదుని జన్మంబు - కల డంభోధి

7-274-మ.
"కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం
గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం
గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్.
టీకా:
కలడు = ఉన్నాడు; అంభోధిన్ = సముద్రములలోను; కలండు = ఉన్నాడు; గాలిన్ = గాలిలోను; కలడు = ఉన్నాడు; ఆకాశంబునన్ = ఆకాశములోను; కుంభినిన్ = భూమియందును; కలడు = ఉన్నాడు; అగ్నిన్ = నిప్పులోను; దిశలన్ = దిక్కులన్నిటియందును; పగళ్ళన్ = దినములందును; నిశలన్ = రాత్రులయందును; ఖద్యోత = సూర్యుని {ఖద్యోతము - ఖత్ (ఆకాశమున) జ్యోతము (ప్రకాశించునది), సూర్యుడు}; చంద్ర = చంద్రుని; ఆత్మలన్ = ఆత్మలందు; కలడు = ఉన్నాడు; ఓంకారమునన్ = ఓంకారమునందును; త్రిమూర్తులన్ = త్రిమూర్తులందును {త్రిమూర్తులు - 1బ్రహ్మ 2 విష్ణు 3మహేశ్వరులు}; త్రిలింగ = స్త్రీ పురుష నపుంసక {త్రిలింగములు - 1స్త్రీలింగము 2పుల్లింగము 3నపుంసకలింగము}; వ్యక్తులన్ = జాతులవారి; అందున్ = అందు; అంతటన్ = అంతటను; కలడు = ఉనాడు; ఈశుండు = భగవంతుడు {ఈశుడు - నైజముచేతనే ఐశ్వర్యములుగలవాడు, విష్ణువు}; కలండు = ఉన్నాడు; తండ్రి = తండ్రీ; వెదుకంగన్ = అన్వేషించుట; ఏల = ఎందుకు; ఈయాయెడన్ = ఇక్కడా అక్కడా.
భావము:
            “నాయనా! భగవంతుడు అయిన శ్రీమహావిష్ణువు లేని చోటు విశ్వములో ఎక్కడ లేదు. అంతట వ్యాపించియే ఉన్నాడు. నీటిలో, గాలిలో, ఆకాశంలో ఉన్నాడు. భూమిమీద ఉన్నాడు. అగ్నిలోను ఉన్నాడు. సర్వదిక్కులలోను ఆయన ఉన్నాడు. పగలు రాత్రి సమయాలలో ఉన్నాడు. సూర్యుడు , చంద్రుడు, ఆత్మ, ఓంకారం, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, స్త్రీ పురుష నపుంసక అనే త్రిలింగ వ్యక్తులు అందరు ఇలా బ్రహ్మాది పిపీలక పర్యంతమందు ఆయన ఉన్నాడు. అట్టి సర్వ పూర్ణుడు, సర్వవ్యాపి, సర్వేశ్వరుడు కోసం ఎక్కడెక్కడో వెదకాల్సిన పనిలేదు. సర్వే, సర్వకాల సర్వావస్థలలోను ఉన్నడయ్యా!
७-२७४-म. 
"कलँ डंभोधिँ, गलंडु गालिँ, गलँ डाकाशंबुनं, गुंभिनिं
गलँ, डग्निन् दिशलं बगळ्ळ निशलन् खद्योत चंद्रात्मलं
गलँ, डोंकारमुनं द्रिमूर्तुलँ द्रिलिंगव्यक्तुलं दंतटं
गलँ, डीशुंडु गलंडु, तंड्रि! वेदकंगा नेल यी या येडन्.
http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=8&Padyam=274.0
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, February 21, 2016

ప్రహ్లాదుని జన్మంబు - వినరాడింభక

7-284-మ.
వినరా డింభక! మూఢచిత్త! గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుం
డని భాషించెద; వైన నిందుఁ గలఁడే యంచున్ మదోద్రేకియై
దనుజేంద్రుం డరచేత వ్రేసెను మహోదగ్ర ప్రభా శుంభమున్
జనదృగ్భీషణదంభమున్ హరిజనుస్సంరంభమున్ స్తంభమున్.
టీకా:
వినరా = వినుము; డింభక = పిల్లవాడా; మూఢ = మూర్ఖపు; చిత్త = బుద్దిగలవాడ; గరిమన్ = గొప్పగ, గట్టిగ; విష్ణుండు = హరి; విశ్వాత్మకుండు = విశ్వమందంతటనుగలవాడు; అని = అని; భాషించెదవు = అనుచున్నావుకదా; ఐనన్ = అయినచో; ఇందున్ = దీనిలో; కలడే = ఉన్నాడా; అంచున్ = అనుచు; మద = మదముచేత; ఉద్రేకి = అతిశయముచెందినవాడు; ఐ = అయ్యి; దనుజ = రాక్షసులలో; ఇంద్రుండు = ఇంద్రునివంటివాడు; అరచేతన్ = అరచేతితో; వ్రేసెను = దెబ్బకొట్టెను; మహ = గొప్ప; ఉదగ్ర = పొడవైన, భయంకరమైన; ప్రభా = కాంతులచే; శుంభమున్ = ప్రకాశించుచున్నదానిని; జన = ప్రజల; దృక్ = చూపులకు; భీషణ = భయముగలుపు; దంభమున్ = డంబముగలదానిని; హరి = విష్ణుని (నరసింహుని); జనుస్ = ఆవిర్భావము యొక్క; సంరంభమున్ = ఆటోపముగలదానిని; స్తంభమున్ = స్తంభమును.
భావము:
            “ఒరే! వినరా! మూర్ఖా! అర్భకా! ఎంతో గొప్పగా విష్ణువు విశ్వాత్మకుడు అంటున్నావు. అయితే దీంట్లో ఉన్నాడా?” అంటూ మదోన్మత్తుడు అయి; ఆవేశంతో ఆ రాక్షస రాజు హిరణ్యకశిపుడు అరచేతితో; జీవకోటి చూడ శక్యం కాకుండా ఉన్నట్టి,భయంకరమైన కాంతులు వెదజల్లుతున్నట్టి, శ్రీ నరసింహస్వామి వారి ఆవిర్భావానికి సంరంభ పడుతున్నట్టి; ఆ స్తంభాన్ని బలంగా చరిచాడు.
७-२८४-म.
विनरा डिंभक! मूढचित्त! गरिमन् विष्णुंडु विश्वात्मकुं
डनि भाषिंचेद; वैन निंदुँ गलँडे यंचुन् मदोद्रेकियै
दनुजेंद्रुं डरचेत व्रेसेनु महोदग्र प्रभा शुंभमुन्
जनदृग्भीषणदंभमुन् हरिजनुस्संरंभमुन् स्तंभमुन्.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

ప్రహ్లాదుని జన్మంబు - ఎక్కడగల డేక్రియ

7-272-క.
ఎక్కడఁ గలఁ డే క్రియ నే
చక్కటి వర్తించు నెట్టి జాడను వచ్చుం
జక్కడఁతు నిన్ను విష్ణునిఁ
బెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని పగిదిన్."
7-273-వ.
అనిన హరికింకరుండు శంకింపక హర్షపులకాకుంర సంకలిత విగ్రహుండై యాగ్రహంబు లేక హృదయంబున హరిం దలంచి నమస్కరించి బాలవర్తనంబున నర్తనంబు జేయుచు నిట్లనియె.
టీకా:
ఎక్కడ = ఎక్కడ; కలడు = ఉన్నాడు; ఏ = ఎట్టి; క్రియన్ = విధముగ; ఏ = ఏ; చక్కటిన్ = స్థలమునందు; వర్తించున్ = తిరుగుచుండును; ఎట్టి = ఎలాంటి; జాడనున్ = దారిలో; వచ్చున్ = వచ్చును; చక్కడతున్ = సంహరించెదను; నిన్నున్ = నిన్నును; విష్ణునిన్ = విష్ణువును; పెక్కులున్ = అదికముగా; ప్రేలెదవు = వదరెదవు; వాని = అతని; భృత్యుని = సేవకుని, బంటు; పగిదిన్ = వలె.
          అనినన్ = అనగా; హరి = విష్ణు; కింకరుండు = దాసుడు; శంకింపక = జంకక; హర్ష = సంతోషమువలన; పులకాకుర = గగుర్పాటు; సంకలిత = కలిగిన; విగ్రహుండు = రూపముగలవాడు; ఐ = అయ్యి; ఆగ్రహంబు = కోపము; లేక = లేకుండగ; హృదయమున = హృదయమందు; హరిన్ = విష్ణుని; తలంచి = స్మరించి; నమస్కరించి = నమస్కారముచేసి; బాల = చిన్నపిల్లవాని; వర్తనంబునన్ = నడవడికతో; నర్తనంబు = నాట్యము; చేయుచున్ = చేయుచు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
            విష్ణువును సేవకుడిలా తెగపొగడుతున్నావు. అసలు ఎక్కడ ఉంటాడు? ఏ విధంగా ఉంటాడు? ఏ రీతిగా తిరుగుతు ఉంటాడు? ఏ పద్ధతిలో వస్తుంటాడు? ఊఁ చెప్పు. లేకపోతే నిన్నూ, నీ హరిని సంహరిస్తాను. ముందు సమాధానం చెప్పు”
            అలా తండ్రి గద్దిస్తున్నప్పటికి పరమ హరిభక్తుడు అయిన ప్రహ్లాదుడు ఏ మాత్రం జంకలేదు. పైగా అమితమైన ఆనందంతో నిలువెల్లా పులకించిపోయాడు. ఆవగింజంత ఆగ్రహం కూడా లేకుండా, హృదయం నిండా హృషీకేశుడిని తలచుకుని నమస్కారాలు చేశాడు. ఆనందంగా ఉన్న బాలురకు సహజమైనట్లుగానే తన సంతోషంలో తాను అత్యంత విశ్వాసంతో నృత్యం చేస్తూ ఇలా పలికాడు.
७-२७२-क.
एक्कडँ गलँ डे क्रिय ने
चक्कटि वर्तिंचु नेट्टि जाडनु वच्चुं
जक्कडँतु निन्नु विष्णुनिँ
बेक्कुलु प्रेलेदवु वानि भृत्युनि पगिदिन्."
७-२७३-व.
अनिन हरिकिंकरुंडु शंकिंपक हर्षपुलकाकुंर संकलित विग्रहुंडै याग्रहंबु लेक हृदयंबुन हरिं दलंचि नमस्करिंचि बालवर्तनंबुन नर्तनंबु जेयुचु निट्लनिये.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Saturday, February 20, 2016

ప్రహ్లాదుని జన్మంబు - నాతోడం బ్రతిభాష లాడెదు

7-271-శా.
నాతోడం బ్రతిభాష లాడెదు జగన్నాథుండ నా కంటె నీ
భూతశ్రేణికి రాజు లేఁ డొకఁడు; సంపూర్ణ ప్రభావుండు మ
ద్భ్రాతం జంపిన మున్ను నే వెదకితిం బల్మాఱు నారాయణుం
డే తద్విశ్వములోన లేఁడు; మఱి వాఁ డెందుండురా? దుర్మతీ!
టీకా:
నా = నా; తోడన్ = తోటే; ప్రతిభాషలు = ఎదురుతిరిగివాదనలు; ఆడెదవు = చేసెదవు; జగత్ = లోకములకే; నాథుండన్ = ప్రభువును; నా = నా; కంటెన్ = కంటె; ఈ = ఈ; భూత = జీవముల; శ్రేణి = సమూహముల; కిన్ = కు; రాజు = ప్రభువు; లేడు = లేడు; ఒకడు = ఇంకొకడు; సంపూర్ణ = పూర్తి, మిక్కిలి; ప్రభావుండు = మహిమగలవాడు; మత్ = నా యొక్క; భ్రాతన్ = సోదరుని; చంపినన్ = చంపగా; మున్ను = ఇంతకు పూర్వము; నేన్ = నేను; వెదకితిన్ = అన్వేషించితిని; పలు = అనేక; మాఱు = మార్లు, పర్యాయములు; నారాయణుండు = విష్ణువు {నారాయణుడు - నరసంబంధ దేహముతో యవతారములను పొందువాడు, విష్ణువు}; ఏతత్ = ఈ; విశ్వము = జగత్తు; లోనన్ = అందు; లేడు = లేడు; మఱి = ఇంక; వాడు = అతడు; ఎందు = ఎక్కడ; ఉండురా = ఉంటాడురా; దుర్మతీ = చెడ్డబుద్ధిగలవాడా.
భావము:
            ఓ దుర్భుద్ధీ! నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు. ఈ జగత్తు అంతటికి అధిపతిని నేనే. నేను తప్ప ఈ జీవజాలం సమస్తానికి నాకంటే సంపూర్ణ శక్తిమంతుడైన మరొక రాజు లేడు. నేనే జగన్నాథుడిని. నా సోదరుడైన హిరణ్యాక్షుడిని చంపినప్పుడు హరి కోసం అనేక పర్యాయాలు వెతికాను. విశ్వం అంతా గాలించాను. కానీ ఆ విష్ణువు విశ్వం మొత్తంలో ఎక్కడా లేడు. మరి ఆ పిరికివాడు ఇంకెక్కడ ఉంటాడు.
७-२७१-शा.
नातोडं ब्रतिभाष लाडेदु जगन्नाथुंड ना कंटे नी
भूतश्रेणिकि राजु लेँ डोकँडु; संपूर्ण प्रभावुंडु म
द्भ्रातं जंपिन मुन्नु ने वेदकितिं बल्मार्रु नारायणुं
डे तद्विश्वमुलोन लेँडु; मर्रि वाँ डेंदुंडुरा? दुर्मती!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Friday, February 19, 2016

ప్రహ్లాదుని జన్మంబు - చంపిన జచ్చెద

7-270-క.
"చంపినఁ జచ్చెద ననుచును
గంపింపక యోరి! పలువ! కఠినోక్తుల నన్
గుంపించెదు చావునకుం
దెంపరి యై వదరువాని తెఱఁగునఁ గుమతీ!
టీకా:
చంపినన్ = చంపితే; చచ్చెదను = చచ్చిపోతాను; అనుచునున్ = అని తలచుకొని; కంపింపకన్ = బెదరక; ఓరి = ఓరి; పలువ = తులువా; కఠిన = గడుసు; ఉక్తులన్ = మాటలతో; నన్ = నన్ను; కుంపించెదు = మీరెదవు, అతిక్రమించెదవు; చావు = మరణమున; కున్ = కు; తెంపరి = తెగించినవాడవు; ఐ = అయ్యి; వదరు = ప్రేలెడి; వానిన్ = వాని; తెఱగునన్ = విధముగ; కుమతి = చెడ్డబుద్ధిగలవాడా.
భావము:
            “దుర్మతీ! చావుకు తెగించావు. చంపుతారని కానీ, చచ్చిపోతానని కానీ నీకు భయం లేకుండా పోయింది. దుర్మార్గుడా కర్ణకఠోరమైన మాటలనే ఈటెలను నా మీదకే విసురుతున్నావు. చావును కూడా లెక్కచేయకుండా మితిమీరి మాట్లాడుతున్నావు.
७-२७०-क.
"चंपिनँ जच्चेद ननुचुनु
गंपिंपक योरि! पलुव! कठिनोक्तुल नन्
गुंपिंचेदु चावुनकुं
देंपरि यै वदरुवानि तेर्रँगुनँ गुमती!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Thursday, February 18, 2016

ప్రహ్లాదుని జన్మంబు - పాలింపుము

7-268-క.
పాలింపుము శేముషి ను
న్మూలింపుము కర్మబంధముల సమదృష్టిం
జాలింపుము సంసారముఁ
గీలింపుము హృదయ మందుఁ గేశవభక్తిన్."
7-269-వ.
అనినఁ బరమభాగవతశేఖరునకు దోషాచరశేఖరుం డిట్లనియె.
టీకా:
పాలింపుము = నియమించుము; శేముషిన్ = బుద్ధిని; ఉన్మూలింపుము = తెంచివేయుము; కర్మ = కర్మములనెడి; బంధములన్ = కట్టుతాళ్ళను; సమదృష్టిన్ = సమత్వభావముతో; చాలింపుము = చాలింపుము; సంసారమున్ = సంసారమును; కీలింపుము = నాటుకొనజేయుము; హృదయము = హృదయము; అందున్ = లో; కేశవ = విష్ణు {కేశవుడు - బ్రహ్మరుద్రాదులును తన స్వరూపముగాగలవాడు, విష్ణువు}; భక్తిన్ = భక్తిని.
          అనినన్ = అనగా; పరమ = అత్యుత్తములైన; భాగవత = భాగవతులలో; శేఖరున్ = శిఖరమువలె మేలైనవాని; కున్ = కి; దోషాచర = రాక్షసులలో {దోషాచరుడు - దోష (రాత్రులందు) చరుడు (తిరుగువాడు), రాక్షసుడు}; శేఖరుండు = గొప్పవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
            మంచి మనస్సుతో మరొకసారి ఆలోచించు; కర్మ బంధాలను త్రెంచివెయ్యి; భేదభావం లేకుండా చక్కని సమదృష్టి అలవరచుకో; నిరంతంరం మనసంతా మాధవునిపై లగ్నం చెయ్యి.”
                      అని పలికాడు పరమ భక్తశిఖామణి ప్రహ్లాదుడు. విన్న దోషమార్గానువర్తి అయిన ఆ రాక్షస శిఖామణి హిరణ్యకశిపుడు ఇలా హుంకరించాడు.
७-२६८-क.
पालिंपुमु शेमुषि नु
न्मूलिंपुमु कर्मबंधमुल समदृष्टिं
जालिंपुमु संसारमुँ
गीलिंपुमु हृदय मंदुँ गेशवभक्तिन्."
७-२६९-व.
अनिनँ बरमभागवतशेखरुनकु दोषाचरशेखरुं डिट्लनिये.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :