Saturday, July 20, 2024

-:వాల్మీకి తెలుగు రామాయణము:- -॥శతతమ సర్గః॥ 55,56 & 57

 జైశ్రీరామ

-:వాల్మీకి తెలుగు రామాయణము:-

-॥శతతమ సర్గః॥

[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]

2.100.55.అనుష్టుప్.

దేవతార్థే చ పిత్రర్థే
      బ్రాహ్మణాభ్యాగతేషు చ।
యోధేషు మిత్రవర్గేషు
      కచ్చిద్గచ్ఛతి తే వ్యయః॥

తాత్పర్యము :-
     
నీయొక్క వ్యయములు దేవకార్యముల కొఱకు, పిత్రుకార్యముల కొఱకు, బ్రాహ్మణ అతిథులకు, యుద్ధవీరులకు, మిత్రులు అందరికీ అందించుచుంటివి కదా?

ప్రతిపదార్థము :-
      దేవతాః
= దేవకార్యముల;ర్థే = కొఱకు; = మఱియు; పిత్రః = పిత్రు కార్యముల;ర్థే = కొఱకు; బ్రాహ్మణాః = బ్రాహ్మణులైన;భ్యాగతేషు = అతిథి; = మఱియు; యోధేషు = యుద్ధవీరులకు; మిత్రవర్గేషు = మిత్రులు అందరికీ; కచ్చిత్ = కదా; గచ్ఛతి = వెళ్ళుచున్నది; తే = నీ; వ్యయః = వ్యయములు.

2.100.56.అనుష్టుప్.

కచ్చిదార్యో విశుద్ధాత్మా
      క్షారితశ్చాపకర్మణా।
అపృష్టశ్శాస్త్రకుశలైః
      న లోభాద్వధ్యతే శుచిః

తాత్పర్యము :-
      గౌరవనీయుడు, పరిశుద్ధమైన మనసు కలవాడు దురాశవలన ఆరోపింపబడిన చేయని నేరమునకు, న్యాయకోవిదులచే పరీక్షింపబడకుండా మరణశిక్ష పొందుట లేదుకదా
?

ప్రతిపదార్థము :-
      కచ్చిత్
= కదా; ఆర్యః = గౌరవనీయుడు; విశుద్ధాత్మా = పరిశుద్ధమైన ఆత్మ కలవాడు; క్షారితః = ఆరోపింపబడినవాడై; = పాదపూరణము;పకర్మణా = చెడ్డపనిచేత, నేరముచేత; అపృష్ట = ప్రశ్నింపకుండనే; శాస్త్రకుశలైః = న్యాయ శాస్తమునందు నేర్పరులచేత; = లేదు; లోభాత్ = దురాశవలన; వధ్యతే = చంపుట; శుచిః = నేరము చేయనివాడు.

2.100.57.అనుష్టుప్.

గృహీతశ్చైవ పృష్టశ్చ
      కాలే దృష్టస్సకారణః।
కచ్చిన్న ముచ్యతే చోరో
      ధనలోభాన్నరర్షభ

తాత్పర్యము :-
      ఓ పురుషశ్రేష్ఠుడా
! భరతా! దొంగతనము వంటి నేరము చేసినట్లు సాక్ష్యము, చేయుటకు కారణము ఉండి, న్యాయాధికారుల పరీక్షలో ఋజువు కాబడిన నేరస్తుడు ధనాశవలన విడువబడుట లేదుకదా!

ప్రతిపదార్థము :-
      గృహీతః
= ఋజువైనవాడు; చైవ = మాత్రము; పృష్టః = ప్రశ్నింపబడిన వాడు; = మఱియు; కాలే = ఆ సమయమునందు; దృష్టః = చూడబడిన వాడు; సకారణః = కారణము ఉన్నవాడు; కచ్చిత్ = కదా; = లేదు; ముచ్యతే = విడువబడుట; చోరః = చోరుడు; ధనలోభాన్ = ధనాశవలన; నరర్షభ = పురుషశ్లేష్ఠుడా.

-----

శ్రీరామ రక్ష జగదభి రక్ష

No comments: