Friday, July 12, 2024

వాల్మీకి తెలుగు రామాయణము - శతతమ సర్గ

 2.100.28.అనుష్టుప్.

కచ్చిత్త్వాం నావజానంతి
      యాజకాః పతితం యథా।
ఉగ్రప్రతిగ్రహీతారమ్
      కామయానమివ స్త్రియః

తాత్పర్యము :-
      కాముకులను స్త్రీలు అవమానించునట్లు, వేదపండితులైన ఋత్విక్కులు

భయకరమైన దానములు కోరు పతితులను నిరసించురీతి నిన్ను అవమానించుటలేదు కదా?

ప్రతిపదార్థము :-
      కచ్చిత్
= ప్రశ్నార్థకము, కదా; త్వాం = నిన్ను; = లేదు; అవజానంతి = అవమానించుట; యాజకాః = ఋత్విక్కులు; పతితం = పతితుని; యథా = వలె; ఉగ్ర = భయంకరముగ; ప్రతిగ్రహీతారమ్ = దానములు ప్రతిగ్రహించు; కామయానమ్ = కాముకులను; ఇవ = వలె; స్త్రియః = స్త్రీలు.

2.100.29.అనుష్టుప్.

ఉపాయకుశలం వైద్యమ్
      భృత్యసందూషణే రతమ్।
శూరమైశ్వర్యకామం చ
      యో న హంతి స హన్యతే॥

తాత్పర్యము :-
      రాజోద్యోగులకు ప్రభువుపై లేనిపోనివి చెప్పి పుల్లలు పెట్టే భత్యుసందోషణము చేయు దుష్టవర్తన వాడూ, రాజులు ప్రయోగించు సామదానాది చతుర్విధోపాయము లందు నేర్పు కలవాడూ ఐన విద్యావంతుని. మఱియు సంపదలందు వెంపర్లాడు శూరుడుని సంహరింప వలెను. అటుల సంహరింపని వాడు నశించును.

ప్రతిపదార్థము :-
      ఉపాయ
= సామదానిది యందు, ఆంధ్రశబ్దరత్నాకరము; కుశలం = నేర్పు గలవానిని; వైద్యమ్ = పండితుని; భృత్యసందూషణే = భత్యసందూషణ యందు; రతమ్ = ఆసక్తికలవాడైన; శూరమ్ = శూరుని; ఐశ్వర్య = సంపదలపై; కామం = అమితాసక్తి కలవాడైన; = మఱియు; యో = ఎవరైతే; = లేదో; హంతి = చంపుట; = అతడు; హన్యతే = చంపబడును.

*గమనిక :-

      ;(1) ఉపాయము- రాజు శత్రువులను లొంగదీయు సాధనములైన సాధన విశేషము, చతుర్విధోపాయములైన సామదాన బేధ దండోపాయములు, (2) వైద్యుడు- వ్యుత్పత్తి. విద్యా+ అణ్, త.ప్ర., పండితుడు, చికిత్సకుడు. (3) భృత్యసందూషణము- లేనిపోనివి చెప్పి మనస్సు విరిచి, ఉద్యోగులను ప్రభువునకు ఎదురుతిరుగునట్లు చేయుట.

2.100.30.అనుష్టుప్.

కచ్చిద్ధృష్టశ్చ శూరశ్చ
      మతిమాన్ ధృతిమాన్ శుచిః।
కులీనశ్చానురక్తశ్చ
      దక్షస్సేనాపతిః కృతః॥

తాత్పర్యము :-
      వ్యవహారములు నిర్వహించుటలో ప్రతిభ కలవాడూ, శత్రువులతో యుద్దమునందు నిర్భభయుడై విజయము సాధించువాడూ, వ్యూహరచనాది సకల సైనిక కార్యము లందు సూక్ష్మబుద్ధి కలవాడూ, విపత్సమయములలో ధైర్యముతో కాగల కార్యము సాధించువాడూ, ఉపధ- ప్రలోభములైన ధర్మార్థ కామములచేత గుణములు పరీక్షించబడి శుద్ధుడుగా నిగ్గుతేలినవాడూ, మంచి వంశమున పుట్టినవాడూ, స్వామియందు రాజ్యమునందు భక్తి కలవాడూ ఐనవానినే సేనాపతిగా నియమించితివి కదా
?

ప్రతిపదార్థము :-
      కచ్చిత్
= ఎవరైతే; ధృష్టః = ప్రతిభ కలవాడు, వావిళ్ళ నిఘంటువు; = మఱియు; శూరః = యుద్ధమునకు భయపడనివాడు, వావిళ్ళనిఘంటువు; = మఱియు; మతిమాన్ = సూక్ష్మబుద్ధి; ధృతిమాన్ = ధైర్యశాలి; శుచిః = ఉపధాశుద్ధుడయిన వ్యక్తి, శబ్దరత్నాకరము; కులీనః = మంచికులమున పుట్టినవాడు; = మఱియు; అనురక్తః = అనురక్తి కలవాడు; = మఱియు; దక్షః = సమర్థుడు; సేనాపతిః = సేనాపతి; కృతః = చేయబడెను.

2.100.31.అనుష్టుప్.

బలవంతశ్చ కచ్చిత్తే
      ముఖ్యా యుద్దవిశారదాః।
దృష్టాపదానా విక్రాంతా
      త్వయా సత్కృత్యమానితాః

తాత్పర్యము :-
     
శ్రేష్టమైన యుద్దతంత్రజ్ఞులను, అత్యంత బలశాలులను, ఎంతోమంది శూరులను ఓడించి ప్రసిద్ధులైన వారిని ఆదరించి గౌరవించుచుంటివి కదా?

ప్రతిపదార్థము :-
      బలవంతః
= అత్యంత బలశాలులు; = మఱియు; కచ్చిత్ = ప్రశ్నార్థకము, కదా; తే = ; ముఖ్యా = శ్రేష్టమైనవారు; యుద్దవిశారదాః = యుద్ధ తంత్రము లందు నేర్పరులు; దృష్టా = వ్యక్తమైన, ప్రగల్భ; పదానా = ఓడించుట; విక్రాంతా = శూరులు కలవారు; త్వయా = నీచేత; సత్కృత్య = ఆదరించి; మానితాః = గౌరవించబడుచుంటిరి.

No comments: