జైశ్రీరామ
-:వాల్మీకి తెలుగు రామాయణము:-
-॥శతతమ సర్గః॥
[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]
2.100.64.అనుష్టుప్.
కచ్చిత్తే బ్రాహ్మణాశ్శర్మ
సర్వశాస్త్రార్థకోవిదాః।
ఆశంసంతే మహాప్రాజ్ఞ!
పౌరజానపదైస్సహ॥
తాత్పర్యము :-
సకల శాస్త్రములను క్షుణ్ణంగా గ్రహించిన జ్ఞానులైన బ్రాహ్మణులు, నీతోపాటు నీదేశ పౌరుల, గ్రామీణుల సుఖశాంతులు కోరుతున్నారు కదా?
ప్రతిపదార్థము :-
కచ్చిత్ = కదా; తే = నీ; బ్రాహ్మణాః = బ్రాహ్మణులు; శర్మ = సుఖశాంతులు; సర్వ = సమస్తమైన; శాస్త్రాః = శాస్తములందలి; అ¬ర్థ = విషయము; కోవిదాః = తెలుసకున్నజ్ఞాని; ఆశంసంతే = కోరుతున్నారు; మహా = గొప్ప; ప్రాజ్ఞ = బుద్దిమంతుడా; పౌరః = పురవాసుల; జానపదైః = జనపదానివాసులు; సహ = సహితముగా.
2.100.65.అనుష్టుప్.
నాస్తిక్యమనృతం క్రోధమ్
ప్రమాదం దీర్ఘసూత్రతామ్।
అదర్శనం జ్ఞానవతామ్
ఆలస్యం పంచవృత్తితామ్॥
తాత్పర్యము :-
1. నాస్తికత్వము, 2. అసత్యము, 3. క్రోధము, 4. ఏమఱుపాటప, 5. సాగతీతస్వభావము, 5. జ్ఞానవంతులవద్దకు పోకపోవుట, 6. సోమరితనము, పనిచేపట్టుటకు జాగుచేయుట, 8. పంచమనోవృత్తులు అగు ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్రమత్తు, స్మృతిరూపవాదము.
ప్రతిపదార్థము :-
నాస్తిక్యమ్ = నాస్తికత్వము, దైవములేడనుట; అనృతమ్ = అసత్యము; క్రోధమ్ = అధికమైన కోపము; ప్రమాదం = ఏమఱుపాటు; దీర్ఘసూత్రతామ్ = ప్రతిపనికి సాగతీత స్వభావము, మితిమీరిన సమయం తీసుకొనుట; అదర్శనం = చూడకపోవుట, కలియకపోవుట; జ్ఞానవతామ్ = జ్ఞానవంతులను; ఆలస్యం = సోమరిపోతుతనము; పంచవృత్తితామ్ = పంచవృత్తులు, ఐదు నడవడికలు, శబ్దరత్నాకరము.
*గమనిక :-
;పంచవృత్తులు- పంచమనోవృత్తులు, సూ. ప్రమాణవిపర్య్యవికల్పనిద్రాస్మృతతయః, వాచస్పతము, ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్రమత్తు, స్మృతిరూపవాదము అను పంచమనోవృత్తులు, సంకేతపదకోశము.
2.100.66.అనుష్టుప్.
ఏకచింతనమర్థానామ్
అనర్థజ్ఞైశ్చ మంత్రణమ్।
నిశ్చితానామనారంభమ్
మంత్రస్యాపరిరక్షణమ్॥
తాత్పర్యము :-
9. మంత్రులను సంబంధిచిన రాజోద్యోగులతో చర్చించకుండా రాజు తాను ఒక్కడే నిర్ణయము తీసుకొను ఆలోచనకూడ చేయుట. అటులనే 9. కార్య ప్రయోజనము తెలియని వారితో చర్చించుట. 1. నిర్ణయములు తీసుకొనట్టి కార్యములను మొదలుపెట్టకపోవుట. 12. మంత్రాగ విషయముల రహస్యము కాపాడకపోవుట.
ప్రతిపదార్థము :-
ఏకచింతనమ్ = ఒంటరిగా ఆలోచన చేయడం; అర్థానామ్ = కార్యముల యొక్క; అనర్థజ్ఞైః = వివరము తెలియని వారు; చ = కూడా; మంత్రణమ్ = రాజకీయ తంత్ర ఆలోచన; నిశ్చితానామ్ = నిశ్చయింపబడినవి; అనారంభమ్ = మొదలుపెట్టక పోవుట; మంత్రస్యాః = ఆలోచన యొక్క; అపరిరక్షణమ్ = రహస్యమును కాపాడకపోవుట.
-----
శ్రీరామ రక్ష జగదభి రక్ష
No comments:
Post a Comment