Saturday, July 27, 2024

-:వాల్మీకి తెలుగు రామాయణము:- -॥శతతమ సర్గః॥ 73-74-75

జైశ్రీరామ

-:వాల్మీకి తెలుగు రామాయణము:-

-॥శతతమ సర్గః॥

[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]

 2.100.73.అనుష్టుప్.

కచ్చిదేషైవ తే బుద్ధిః
     యథోక్తా మమ రాఘవ
!
ఆయుష్యా చ యశస్యా చ
     ధర్మకామార్థ సంహితా॥

తాత్పర్యము :-
      ఓ భరతా
! ఉన్నత రఘువంశమున జన్మించినవాడవు కదా. నేను చేసిన బోధలు ప్రకారము, నీ బుద్ది ధర్మార్థకామములందు శ్రద్ధకలదై ఆయుర్దాయమును కీర్తినీ పెంపొందించు విధముగా ఉన్నది కదా?

ప్రతిపదార్థము :-
      కచ్చిత్
= కదా; ఏషైవ = అట్టిదే; తే = నీ; బుద్ధిః = బుద్ది; యథాః = ఎట్లు; ఉక్తా = చెప్పబడినట్లు; మమ = నాచేత; రాఘవ = రఘువంశ భరతుడా; ఆయుష్యాః = ఆయుర్దాయము; = మఱియు; యశస్యాః = కీర్తులను; = మఱియు; ధర్మకామార్థ = ధర్మార్థకామములందు; సంహితా = కూడినదిగా ఉన్నది.

2.100.74.అనుష్టుప్.

యాం వృత్తిం వర్తతే తాతో
     యాం చ నః ప్రపితామహాః।
తాం వృత్తిం వర్తసే కచ్చిత్
     యా చ సత్పథగా శుభా

తాత్పర్యము :-
      సత్పురుషులు అనుసరించవలసినట్టిది, శుభకరమైనది అగు ఏ ఆచారములను మన తండ్రి ఆచరించుచున్నాడో, మన తాతముత్తాతలు అనుసరించిరో, వానినే నీవు కూడ అనుసరించుతున్నావు కదా
?

ప్రతిపదార్థము :-
      యామ్
= ; వృత్తిమ్ = ఆచారమున, పద్దతిలో; వర్తతే = నడచుచున్నాడో; తాతః = తండ్రి; యామ్ = ; = మఱియు; నః = మన; ప్రపితామహాః = ముత్తాత; తామ్ = అట్టి; వృత్తిమ్ = పద్దతిలో; వర్తసే = నడచుచుంటివి; కచ్చిత్ = కదా; యా = ఏది; = పాదపూరణము; సత్పథగా = మంచివారి మార్గము; శుభా = మంగళకరమైనదో.

2.100.75.అనుష్టుప్.

కచ్చిత్త్స్వాదు కృతం భోజ్యమ్
     ఏకో నాశ్నాసి రాఘవ
!
కచ్చిదాశంసమానేభ్యో
     మిత్రేభ్యస్సంప్రయచ్ఛసి॥

తాత్పర్యము :-
     
ఓ రఘు వంశపు భరతుడ! మృదుమధురమైన ఆహారాము నీవొక్కడవే భుంజిచుటలేదు కదా. మిత్రులకు కూడా పెడుతున్నావు కదా.

ప్రతిపదార్థము :-
      కచ్చిత్
= కదా; స్వాదు = మధురముగా; కృతం = చేయబడిన; భోజ్యమ్ = ఆహారము; ఏకః = ఒక్కడవే; = లేదు;శ్నాసి = తినుట; రాఘవ = రఘుకుల భరత; కచ్చిత్ = కదా; అశం = దానిని; సమానేభ్యః = కోరుచున్న; మిత్రేభ్యః = మిత్రులకొఱకు; సంప్రయచ్ఛసి = ఇచ్చుచున్నావు.

-----

శ్రీరామ రక్ష జగదభి రక్ష

No comments: