Wednesday, July 17, 2024

-:వాల్మీకి తెలుగు రామాయణము:- -॥శతతమ సర్గః॥ 46 నుండి 49 వరకు.

 జైశ్రీరామ

-:వాల్మీకి తెలుగు రామాయణము:-

-॥శతతమ సర్గః॥

[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]



2.100.46.అనుష్టుప్.

వివర్జితో నరైః పాపైః

మమ పూర్వైస్సురక్షితః।

కచ్చిజ్జనపదస్స్ఫీతః

సుఖం వసతి? రాఘవ!

తాత్పర్యము :- 

రఘువంశోద్భవుడవైన భరతా? మన పూర్వీకులు పూర్తి సురక్షితము అగునట్లు పాలించినది, పాపాత్ములు లేనిది, సకల సంపదలు సమృద్ది కలది ఐన ఆ కోసల సుఖనివాసమై ఉన్నది కదా 

ప్రతిపదార్థము :- 

వివర్జిత = విడువబడిన; నరైః = మానవులు; పాపైః = పాపాత్ములైన వారిచే; మమ = నా; పూర్వైః = పూర్వీకులచే; సురక్షితః = బాగుగా రక్షింప బడినది; కచ్చిత్ = కదా?; జనపదః = దేశము; స్ఫీతః = సమృద్దిగా; సుఖమ్ = సౌఖ్యముగా; వసతి = ఉన్నది; రాఘవ = రఘువంశమువాడ.

2.100.47.అనుష్టుప్.

కచ్చిత్తే దయితాస్సర్వే

కృషిగోరక్షజీవినః।

వార్తాయాం సంశ్రిత స్తాత!

లోకో హి సుఖమేధతే॥

తాత్పర్యము :- 

వ్యవసాయదారులు, గోపాలకులు అందరకూ నీవు ఇష్టుడవే కదా? వ్యవసాయము, గోపాలనలు చేపట్టి ప్రజలందరూ సుఖముగా అభివృద్ధి పొందుతున్నారు కదా?

ప్రతిపదార్థము :- 

కచ్చిత్ = కదా; దయితాః = ఇష్టమైనవానివి; సర్వే = సమస్తమైన; కృషి = వ్యవసాయము; గోరక్షః = పశుపాలకులనలపై; జీవినః = జీవించువారికి; వార్తాయామ్ = వార్త అనగా కృషిగోరక్షణములు యందు; సంశ్రితః = ఆశ్రయించినవారై; తాత = నాయనా; లోకః = ప్రజలు; హి = నిశ్చయముగా; సుఖమ్ = సుఖముగా; ఏధతే = వృద్దిపొందుచున్నారు.

2.100.48.అనుష్టుప్.

తేషాం గుప్తిపరీహారైః

కచ్చిత్తే భరణం కృతమ్।

రక్ష్యా హి రాజ్ఞా ధర్మేణ

సర్వే విషయవాసినః॥

తాత్పర్యము :- 

నీవు వారందరి రక్షణ, పోషణ, ఆపదలను తొలగించుట చేయుచుంటివి కదా? మరి, రాజధర్మము ప్రకారము దేశములోని ప్రజలను అందరినీ పాలింపవలసిన బాధ్యత రాజుదే కదా?

ప్రతిపదార్థము :- 

తేషాం = వారియొక్క; గుప్తి = కాపాడుట; పరీహారైః = ఆపదలను నివారించుటచేతను; కచ్చిత్ = కదా; తే = నీచే; భరణమ్ = పోషణము; కృతమ్ = చేయబడినది; రక్ష్యాః = రక్షింపదగినవారు; హి = నిశ్చయంగా; రాజ్ఞా = రాజుచేత; ధర్మేణ = ధర్మముచేత;  సర్వే = అందరు; విషయ = దేశమునందు; వాసినః = నివసించువారిని.

2.100.49.అనుష్టుప్.

కచ్చిత్ స్త్రియస్సాంత్వయసి

కచ్చిత్తాశ్చ సురక్షితాః।

కచ్చిన్న శ్రద్ధాధాస్యాసామ్

కచ్చిద్గుహ్యం న భాషసే॥

తాత్పర్యము :- 

స్త్రీలతో అనునయంగా మాట్లాడుచుంటివి కదా? వారికి బాగా రక్షణ కల్పించుచుంటివి కదా? వారి మాటలను నమ్ముటలేదు కదా? రహస్యములేవీ వారికి చెప్పుట లేదు కదా?

ప్రతిపదార్థము :- 

కచ్చిత్ = కదా; స్త్రియః = స్త్రీలను; సాంత్వయసి = అనునయించుచుంటివి; కచ్చిత్ = కదా; తా = వారు; చ = కదా; సు = బాగుగా; రక్షితాః = రక్షింపబడుచున్నారు; కచ్చిత్ = కదా; తే = నీచేత; న = లేదు; శ్రద్ధాధాసి = నమ్ముట; ఆసామ్ = ఈ స్త్రీల మాటలను; కచ్చిత్ = కదా; గుహ్యం = రహస్యం; న = లేదు; భాషసే = చెప్పుట.

-----

శ్రీరామ రక్ష జగదభి రక్ష

No comments: