Friday, February 19, 2016

ప్రహ్లాదుని జన్మంబు - చంపిన జచ్చెద

7-270-క.
"చంపినఁ జచ్చెద ననుచును
గంపింపక యోరి! పలువ! ఠినోక్తుల నన్
గుంపించెదు చావునకుం
దెంరి యై వదరువాని తెఱఁగునఁ గుమతీ!
టీకా:
చంపినన్ = చంపితే; చచ్చెదను = చచ్చిపోతాను; అనుచునున్ = అని తలచుకొని; కంపింపకన్ = బెదరక; ఓరి = ఓరి; పలువ = తులువా; కఠిన = గడుసు; ఉక్తులన్ = మాటలతో; నన్ = నన్ను; కుంపించెదు = మీరెదవు, అతిక్రమించెదవు; చావు = మరణమున; కున్ = కు; తెంపరి = తెగించినవాడవు; ఐ = అయ్యి; వదరు = ప్రేలెడి; వానిన్ = వాని; తెఱగునన్ = విధముగ; కుమతి = చెడ్డబుద్ధిగలవాడా.
భావము:
            “దుర్మతీ! చావుకు తెగించావు. చంపుతారని కానీ, చచ్చిపోతానని కానీ నీకు భయం లేకుండా పోయింది. దుర్మార్గుడా కర్ణకఠోరమైన మాటలనే ఈటెలను నా మీదకే విసురుతున్నావు. చావును కూడా లెక్కచేయకుండా మితిమీరి మాట్లాడుతున్నావు.
७-२७०-क.
"चंपिनँ जच्चेद ननुचुनु
गंपिंपक योरि! पलुव! कठिनोक्तुल नन्
गुंपिंचेदु चावुनकुं
देंपरि यै वदरुवानि तेर्रँगुनँ गुमती!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: