జైశ్రీరామ
-:వాల్మీకి తెలుగు రామాయణము:-
-॥శతతమ సర్గః॥
[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]
2.100.76.త్రిష్టుప్
రాజా తు ధర్మేణ హి పాలయిత్వా
మహామతిర్దండధరః
ప్రజానామ్।
అవాప్య కృత్స్నాం వసుధాం యథావత్
ఇతశ్చ్యుతః స్వర్గము పైతి
విద్వాన్॥
తాత్పర్యము :-
మహాబుద్ధిశాలి,
విద్వాంసుడు ఐన రాజు సమస్త రాజ్యమును పొంది, ప్రజలను తగు విధముగ దండించుచు,
యథాశాస్తరముగా ధర్మము ప్రకారము పరిపాలించుచు, మరణానంతరము స్వర్గలోకమునకు పొందును.
ప్రతిపదార్థము :-
రాజా = రాజు; తు = ఐతే; ధర్మేణ = ధర్మముచేత; హి = మాత్రమే; పాలయిత్వా = పరిపాలించి; మహామతిః = గొప్పబుద్ధిశాలి; దండధరః = దండించువాడై; ప్రజానామ్ = ప్రజలను; అవాప్య = పొంది; కృత్స్నాం = సమస్తమైన; వసుధాం = రాజ్యమును; యథావత్ = శాస్త్రము ప్రకారము; ఇతః = ఈ లోకమునుండి; చ్యుతః = జారినవాడై; స్వర్గమ్ = స్వర్గలోకమును; ఉపైతి = పొందును; విద్వాన్ = విద్వాంసుడైన.
2.100.77.గద్య
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు
రామాయణే।
అయోధ్యకాండే
శతతమ సర్గః॥
తాత్పర్యము :-
ఋషిప్రోక్తమూ
మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, అయోధ్యకాండలోని లోని [100] వందవ సర్గ సంపూర్ణము
ప్రతిపదార్థము :-
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; అయోధ్యకాణ్డే = అయోధ్యకాండ లోని; శతతమ [100] = నూరవ; సర్గః = సర్గ.
------
శ్రీరామ రక్ష జగదభి రక్ష
No comments:
Post a Comment