Saturday, February 20, 2016

ప్రహ్లాదుని జన్మంబు - నాతోడం బ్రతిభాష లాడెదు

7-271-శా.
నాతోడం బ్రతిభాష లాడెదు జగన్నాథుండ నా కంటె నీ
భూశ్రేణికి రాజు లేఁ డొకఁడు; సంపూర్ణ ప్రభావుండు మ
ద్భ్రాతం జంపిన మున్ను నే వెదకితిం ల్మాఱు నారాయణుం
డే ద్విశ్వములోన లేఁడు; మఱి వాఁ డెందుండురా? దుర్మతీ!
టీకా:
నా = నా; తోడన్ = తోటే; ప్రతిభాషలు = ఎదురుతిరిగివాదనలు; ఆడెదవు = చేసెదవు; జగత్ = లోకములకే; నాథుండన్ = ప్రభువును; నా = నా; కంటెన్ = కంటె; ఈ = ఈ; భూత = జీవముల; శ్రేణి = సమూహముల; కిన్ = కు; రాజు = ప్రభువు; లేడు = లేడు; ఒకడు = ఇంకొకడు; సంపూర్ణ = పూర్తి, మిక్కిలి; ప్రభావుండు = మహిమగలవాడు; మత్ = నా యొక్క; భ్రాతన్ = సోదరుని; చంపినన్ = చంపగా; మున్ను = ఇంతకు పూర్వము; నేన్ = నేను; వెదకితిన్ = అన్వేషించితిని; పలు = అనేక; మాఱు = మార్లు, పర్యాయములు; నారాయణుండు = విష్ణువు {నారాయణుడు - నరసంబంధ దేహముతో యవతారములను పొందువాడు, విష్ణువు}; ఏతత్ = ఈ; విశ్వము = జగత్తు; లోనన్ = అందు; లేడు = లేడు; మఱి = ఇంక; వాడు = అతడు; ఎందు = ఎక్కడ; ఉండురా = ఉంటాడురా; దుర్మతీ = చెడ్డబుద్ధిగలవాడా.
భావము:
            ఓ దుర్భుద్ధీ! నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు. ఈ జగత్తు అంతటికి అధిపతిని నేనే. నేను తప్ప ఈ జీవజాలం సమస్తానికి నాకంటే సంపూర్ణ శక్తిమంతుడైన మరొక రాజు లేడు. నేనే జగన్నాథుడిని. నా సోదరుడైన హిరణ్యాక్షుడిని చంపినప్పుడు హరి కోసం అనేక పర్యాయాలు వెతికాను. విశ్వం అంతా గాలించాను. కానీ ఆ విష్ణువు విశ్వం మొత్తంలో ఎక్కడా లేడు. మరి ఆ పిరికివాడు ఇంకెక్కడ ఉంటాడు.
७-२७१-शा.
नातोडं ब्रतिभाष लाडेदु जगन्नाथुंड ना कंटे नी
भूतश्रेणिकि राजु लेँ डोकँडु; संपूर्ण प्रभावुंडु म
द्भ्रातं जंपिन मुन्नु ने वेदकितिं बल्मार्रु नारायणुं
डे तद्विश्वमुलोन लेँडु; मर्रि वाँ डेंदुंडुरा? दुर्मती!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: