7-268-క.
పాలింపుము
శేముషి ను
న్మూలింపుము
కర్మబంధముల సమదృష్టిం
జాలింపుము
సంసారముఁ
గీలింపుము
హృదయ మందుఁ గేశవభక్తిన్."
7-269-వ.
అనినఁ బరమభాగవతశేఖరునకు దోషాచరశేఖరుం డిట్లనియె.
టీకా:
పాలింపుము = నియమించుము; శేముషిన్ = బుద్ధిని;
ఉన్మూలింపుము = తెంచివేయుము; కర్మ =
కర్మములనెడి; బంధములన్ = కట్టుతాళ్ళను;
సమదృష్టిన్ = సమత్వభావముతో; చాలింపుము =
చాలింపుము; సంసారమున్ = సంసారమును; కీలింపుము
= నాటుకొనజేయుము; హృదయము = హృదయము; అందున్
= లో; కేశవ = విష్ణు {కేశవుడు -
బ్రహ్మరుద్రాదులును తన స్వరూపముగాగలవాడు, విష్ణువు}; భక్తిన్ = భక్తిని.
అనినన్ =
అనగా; పరమ = అత్యుత్తములైన; భాగవత = భాగవతులలో; శేఖరున్ = శిఖరమువలె మేలైనవాని; కున్ = కి; దోషాచర = రాక్షసులలో {దోషాచరుడు - దోష (రాత్రులందు)
చరుడు (తిరుగువాడు), రాక్షసుడు}; శేఖరుండు
= గొప్పవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె
= పలికెను.
భావము:
మంచి
మనస్సుతో మరొకసారి ఆలోచించు; కర్మ బంధాలను త్రెంచివెయ్యి; భేదభావం లేకుండా
చక్కని సమదృష్టి అలవరచుకో; నిరంతంరం మనసంతా మాధవునిపై లగ్నం
చెయ్యి.”
అని పలికాడు పరమ భక్తశిఖామణి ప్రహ్లాదుడు. విన్న దోషమార్గానువర్తి అయిన ఆ
రాక్షస శిఖామణి హిరణ్యకశిపుడు ఇలా హుంకరించాడు.
७-२६८-क.
पालिंपुमु शेमुषि नु
न्मूलिंपुमु कर्मबंधमुल
समदृष्टिं
जालिंपुमु संसारमुँ
गीलिंपुमु हृदय मंदुँ
गेशवभक्तिन्."
७-२६९-व.
अनिनँ बरमभागवतशेखरुनकु
दोषाचरशेखरुं डिट्लनिये.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment