Tuesday, February 24, 2015

కృష్ణలీలలు

10.1-252-వచనము
అప్పు డందున్న సరస పదార్థంబులు వ్యర్థంబులై నేలంగూలుటం జూచి యశోదానంద ముఖ్యులైన గోపగోపికాజనంబులు పనులు మఱచి పబ్బంబులు మాని యుబ్బుచెడి వెఱపులు ఘనంబులుగ మనంబులందుఁ గదుర.
         బాలకృష్ణుని తన్నుకు బండి ఎగిసి పడింది. దానిలోని రసవంతమైన పదార్థాలు వ్యర్థాలు అయ్యి నేలపాలయ్యాయి. అప్పుడది చూసి, యశోద, నందుడు మున్నగు గోపీ గోపకులు సంభ్రమంతో చేస్తున్న పనులు మరచారు. వేడుకలు మానారు. ఉత్సాహాలు నశించి మిక్కిలి బెదరసాగారు.
         అప్పుడు = ఆ సమయము నందు; అందున్ = దానిలో; ఉన్న = ఉన్నట్టి; సరస = మంచి, రసవంతము లైన; పదార్థంబులున్ = వస్తువులు; వ్యర్థంబులు = ప్రయోజనము లేనివి; = అయ్యి; నేలన్ = నేలమీద; కూలుటన్ = పడిపోవుటను; చూచి = చూసి; యశోద = యశోద మరియు; నంద = నందుడు; ముఖ్యులు = మున్నగు వారు; ఐన = అయిన; గోప = గోపకులు; గోపికా = గోపికలైన; జనంబులున్ = వారు; పనులున్ = చేస్తున్న పను లందు; మఱచి = విస్మతి చెంది; పబ్బంబులున్ = వేడుకలను; మాని = వదలి పెట్టి; ఉబ్బు = ఉత్సాహములు; చెడి = లేనివారై; వెఱపులు = భయములు; ఘనంబులుగా = మిక్కిలధికముగ; మనంబులన్ = మనసు లందు; కదుర = పుట్టగా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

Monday, February 23, 2015

కృష్ణలీలలు

10.1-251-కంద పద్యము
టము హరి దన్నిన దివి
బ్రటం బై యెగసి యిరుసు రమునఁ గండ్లున్
విటంబుగ నేలంబడె
టా! యని గోపబృంద మాశ్చర్యపడన్.         
         అలా బాలకృష్ణుడు బండిని తన్నగా, అది ఆకాశం అంత ఎత్తు ఎగిరింది. ఇరుసు బరువుకి చక్రాల కండ్లు నేలమీద ముక్కలుముక్కలై పడ్డాయి. అక్కడున్న గోపకులు ఆశ్చర్యపోయారు.
         శకటము మానవ దేహానికి గుర్తు. హరి బ్రహ్మజ్ఞానం తన్నటం తాకటం అంటే స్పర్శ కలిగింది. నడిపిన నడిపించిన పుణ్యాల ఫలంతో స్వర్గ ప్రాప్తి కలిగింది (ఆకాశాని కెగసింది). ఇరుసు (సంచితాది కర్మలు) బరువుకి కండ్లు అంటే (కర్మ వాసనలు)  తో ఛిన్నాభిన్నము అయ్యి నేలమీద పడెను. అంటే పుణ్యకర్మ ఫలము కరిగిపోయి మర్త్యలోకంలో పడి పునర్జన్మ పొందును. గోపకులు జ్ఞానపేక్షకులు /ముముక్షువులు.
[ఆధారం శ్రీ పాలపర్తి నాగేశ్వర్లు శాస్త్రులు గారి శ్రీమదాంధ్రభాగవత గ్రంధం. వారికి వందనాలు]
10.1-251-kaMda padyamu
shakaTamu hari dannina divi
brakaTaM bai yegasi yirusu bharamunaM~ gaMDlun
vikaTaMbuga nElaMbaDe
nakaTaa! yani gOpabRiMda maashcharyapaDan.
         శకటమున్ = బండిని; హరి = బాలకృష్ణుడు; తన్నినన్ = తన్నగా; దివిన్ = ఆకాశముమీదికి; ప్రకటంబున్ = బాగాకనబడునది; = అయ్యి; ఎగసి = ఎగిరి; ఇరుసున్ = ఇరుసు {ఇరుసు చక్రము తిరుగ నాధార మైన గుండ్రటి కమ్మి}; భరమునన్ = బరువువలన; కండ్లున్ = కండిలు {కండి - ఇరుసుపై తిరిగెడి మధ్య రంధ్రముగల గుండ్రముగానుండి ఆకులు ద్వారా చక్రములకు కలపబడి యుండెడిది}; వికటంబుగన్ = ఆకులువిరిగి విడిపోయి; నేలన్ = నేలమీద; పడెన్ = పడిపోయెను; అకటా = అయ్యో; అని = అని; గోప = గోపకుల; బృందము = సమూహము; ఆశ్చర్యపడన్ = ఆశ్చర్యపోవగ.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

Sunday, February 22, 2015

10.1-250- నిదురించిన



10.1-249-వచనము
ఆ సమయంబున.
          = ; సమయంబునన్ = సమయమునందు.
              శైశవ కృష్ణుడు బోర్లా పడ్డాడు. యశోదాదేవి పండుగ జేస్తున్నది. గోపకులను గౌరవించే హడావిడిలో, చంటిపిల్లడిని ప్రీతిగా పాన్పు మీద నిద్రపోగొట్టింది. పనులలో మునిగిపోయింది. అప్పుడు. .
10.1-250-కంద పద్యము
నిదురించిన శిశు వాకొని
కిదుకుచుఁ జనుఁ గోరి కెరలి కిసలయ విలస
న్మృదు చక్రచాపరేఖా
స్పపదమునఁ దన్నె నొక్క బండిన్ దండిన్.
          అలా నిద్రనటిస్తున్న చంటిపిల్లాడుగా ఉన్న శ్రీకృష్ణునికి ఆకలివేసింది. పాలకోసం ఒళ్ళు విరుచుకుంటు కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు. ఆ పాదాలు మామూలువా, కాదు చక్రం చాపం మున్నగు శుభరేఖలతో అలరారేది. అట్టి పాదంతో ఒక బండిని గట్టిగా తన్నాడు.
          కృష్ణుడు షడ్భావ సూన్యుడు, షడూర్మి శూన్యుడు. అయినను నిద్ర నటిస్తున్నాడు. లోకవిడంబనార్థం తల్లిపాలు తాగాలని చూస్తున్నట్లు నటిస్తున్నాడు. స్తన్యం ఇచ్చేవారు లేరని కోపం వచ్చి, కాలుతో శకటాన్ని తన్నాడు. శకటం అంటే మానవ శరీరం. అసురుడు అంటే అమానుష తత్త్వము ధరించి నిద్రా సంగమాదులలో మునిగితేలు మూర్ఖుడు. భోగవాంఛలు బండిలోని వస్తువులు. వాని వలన సంసారసాగరంలో పడుతున్నాడు. వాటిని పరిత్యజింతాలని బండిని తన్నటం. ఆ తన్నిన పాదం విశ్వాన్ని నడిపే చక్రం శాసించే చాపం తానైన పరమాత్మ. పరిత్యజించటానికైనా భగవానుని అనుగ్రహం కావాలి కనుక భక్తి ముఖ్యం అని అనుకోవచ్చు.
[ఆధారం శ్రీ పాలపర్తి నాగేశ్వర్లు శాస్త్రులు గారి శ్రీమదాంధ్రభాగవత గ్రంధం. ఆ పండితోత్తమునికి కృతజ్ఞతా పూర్వక ప్రణామ శతాలు]
10.1-250-kaMda padyamu
niduriMchina shishu vaakoni
kidukuchuM~ januM~ gOri kerali kisalaya vilasa
nmRidu chakrachaaparEkhaa
spada padamunaM~ danne nokka baMDin daMDin.
     నిదురించిన నిద్రపోయిన; శిశువు పసిపిల్లవాడు; ఆకొని ఆకలివేసి; కిదుకుచన్ ఒళ్ళువిరుచుకొనుచు; చనున్ చనుబాలు; కోరి కోరి; కెరలి విజృంభించి; కిసలయ చిగురుటాకు; విలసత్ వంటి విలాసము గల; మృదు మృదువైనమెత్తనైన; చక్ర చక్రము; చాప విల్లు; రేఖా రేఖలు; ఆస్పద ఉనికిపట్టైనఉన్న; పదమునన్ కాలితో; తన్నెన్ తన్నెనుకాలితోకొట్టెను; ఒక్క ఒకానొక; బండిన్ బండిని; దండిన్ గట్టిగా.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

Saturday, February 21, 2015

1-1 శ్రీ కైవల్యపదంబు

1-1-శా.
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్.
          సర్వలోకాలను రక్షించేవానిని, భక్తజనులను కాపాడుటలో అత్యుత్సాహం గలవానిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవానిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వానిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) ముక్తిమార్గాన్ని అందుకోడానికి సదాస్మరిస్తు ఉంటాను. (బమ్మెర పోతనామాత్యుల ఈ ప్రార్థన తన మోక్షానికా ప్రజల మోక్షానికా ?)
[జాలగూడులో మరింత వివరంగా చూడగలరు]
1-1-shaa.
shree kaivalya padaMbuM~ jEruTakunai chiMtiMchedan lOka ra
kShaikaaraMbhaku bhakta paalana kaLaa saMraMbhakun daanavO
drEkastaMbhakuM~ gELi lOla vilasaddRigjaala saMbhoota naa
naa kaMjaata bhavaaMDa kuMbhaku mahaanaMdaaMganaaDiMbhakun.
            శ్రీ = శుభకరమైన; కైవల్య = ముక్తి; పదంబున్ = స్థితిని; చేరుట = పొందుట; కున్ = కోసము; ఐ = ఐ; చింతించెదన్ = ప్రార్థింతును; లోక = లోకాలన్నిటిని; రక్ష = రక్షించుటనే; ఏక = ముఖ్యమైన; ఆరంభ = సంకల్పమున్న వాడు; కున్ = కి;  భక్త = భక్తులను; పాలన = పాలించే; కళా = కళయందు; సంరంభ = వేగిరపాటున్న వాడు; కున్ = కిన్; దానవ = రాక్షసుల; ఉద్రేక = ఉద్రేకమును; స్తంభ = మ్రాన్పడేలా చేసేవాడు; కున్ = కి; కేళి = ఆటలందు; లోల = వినోదా లందు; విలసత్ = ప్రకాశించే; దృక్ = చూపుల; జాల = వలనుండి; సంభూత = పుట్టిన; నానా = వివిధ;  = బ్రహ్మాండముల {కంజాత భవాండ - కం (నీటిలో) జాత (పుట్టినదాని, (పద్మం) లోపుట్టిన వాని(బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కుంభ = రాశితనలో కలిగిన వాడు; కున్ = కి;  - మహా = గొప్ప; నంద = నందుని; అంగనా = భార్యయొక్క; డింభ = కొడుకు; కున్ = కున్.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :