Saturday, February 21, 2015

1-1 శ్రీ కైవల్యపదంబు

1-1-శా.
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్.
          సర్వలోకాలను రక్షించేవానిని, భక్తజనులను కాపాడుటలో అత్యుత్సాహం గలవానిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవానిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వానిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) ముక్తిమార్గాన్ని అందుకోడానికి సదాస్మరిస్తు ఉంటాను. (బమ్మెర పోతనామాత్యుల ఈ ప్రార్థన తన మోక్షానికా ప్రజల మోక్షానికా ?)
[జాలగూడులో మరింత వివరంగా చూడగలరు]
1-1-shaa.
shree kaivalya padaMbuM~ jEruTakunai chiMtiMchedan lOka ra
kShaikaaraMbhaku bhakta paalana kaLaa saMraMbhakun daanavO
drEkastaMbhakuM~ gELi lOla vilasaddRigjaala saMbhoota naa
naa kaMjaata bhavaaMDa kuMbhaku mahaanaMdaaMganaaDiMbhakun.
            శ్రీ = శుభకరమైన; కైవల్య = ముక్తి; పదంబున్ = స్థితిని; చేరుట = పొందుట; కున్ = కోసము; ఐ = ఐ; చింతించెదన్ = ప్రార్థింతును; లోక = లోకాలన్నిటిని; రక్ష = రక్షించుటనే; ఏక = ముఖ్యమైన; ఆరంభ = సంకల్పమున్న వాడు; కున్ = కి;  భక్త = భక్తులను; పాలన = పాలించే; కళా = కళయందు; సంరంభ = వేగిరపాటున్న వాడు; కున్ = కిన్; దానవ = రాక్షసుల; ఉద్రేక = ఉద్రేకమును; స్తంభ = మ్రాన్పడేలా చేసేవాడు; కున్ = కి; కేళి = ఆటలందు; లోల = వినోదా లందు; విలసత్ = ప్రకాశించే; దృక్ = చూపుల; జాల = వలనుండి; సంభూత = పుట్టిన; నానా = వివిధ;  = బ్రహ్మాండముల {కంజాత భవాండ - కం (నీటిలో) జాత (పుట్టినదాని, (పద్మం) లోపుట్టిన వాని(బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కుంభ = రాశితనలో కలిగిన వాడు; కున్ = కి;  - మహా = గొప్ప; నంద = నందుని; అంగనా = భార్యయొక్క; డింభ = కొడుకు; కున్ = కున్.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: