10.1-251-కంద పద్యము
శకటము హరి దన్నిన దివి
బ్రకటం బై యెగసి యిరుసు భరమునఁ గండ్లున్
వికటంబుగ నేలంబడె
నకటా! యని గోపబృంద మాశ్చర్యపడన్.
అలా
బాలకృష్ణుడు బండిని తన్నగా, అది ఆకాశం అంత ఎత్తు ఎగిరింది. ఇరుసు బరువుకి చక్రాల
కండ్లు నేలమీద ముక్కలుముక్కలై పడ్డాయి. అక్కడున్న గోపకులు ఆశ్చర్యపోయారు.
శకటము
మానవ దేహానికి గుర్తు. హరి బ్రహ్మజ్ఞానం తన్నటం తాకటం అంటే స్పర్శ కలిగింది.
నడిపిన నడిపించిన పుణ్యాల ఫలంతో స్వర్గ ప్రాప్తి కలిగింది (ఆకాశాని కెగసింది).
ఇరుసు (సంచితాది కర్మలు) బరువుకి కండ్లు అంటే (కర్మ వాసనలు) తో ఛిన్నాభిన్నము అయ్యి నేలమీద పడెను. అంటే
పుణ్యకర్మ ఫలము కరిగిపోయి మర్త్యలోకంలో పడి పునర్జన్మ పొందును. గోపకులు
జ్ఞానపేక్షకులు /ముముక్షువులు.
[ఆధారం శ్రీ పాలపర్తి నాగేశ్వర్లు శాస్త్రులు గారి
శ్రీమదాంధ్రభాగవత గ్రంధం. వారికి వందనాలు]
10.1-251-kaMda
padyamu
shakaTamu
hari dannina divi
brakaTaM
bai yegasi yirusu bharamunaM~ gaMDlun
vikaTaMbuga
nElaMbaDe
nakaTaa!
yani gOpabRiMda maashcharyapaDan.
శకటమున్ = బండిని; హరి = బాలకృష్ణుడు; తన్నినన్ = తన్నగా; దివిన్ = ఆకాశముమీదికి; ప్రకటంబున్ = బాగాకనబడునది; ఐ = అయ్యి; ఎగసి = ఎగిరి; ఇరుసున్ = ఇరుసు {ఇరుసు – చక్రము తిరుగ నాధార మైన గుండ్రటి
కమ్మి};
భరమునన్ = బరువువలన; కండ్లున్ = కండిలు {కండి - ఇరుసుపై తిరిగెడి మధ్య రంధ్రముగల
గుండ్రముగానుండి ఆకులు ద్వారా చక్రములకు కలపబడి యుండెడిది}; వికటంబుగన్ = ఆకులువిరిగి విడిపోయి;
నేలన్ = నేలమీద; పడెన్ = పడిపోయెను; అకటా = అయ్యో; అని = అని; గోప = గోపకుల; బృందము = సమూహము; ఆశ్చర్యపడన్ = ఆశ్చర్యపోవగ.
: : చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం; మనం
అందరం : :
No comments:
Post a Comment