Saturday, June 13, 2015

నారాయణుని వైషమ్య అభావం - హరిసాధింతు

7-12-మత్తేభ విక్రీడితము
హరిసాధింతు హరిన్ గ్రసింతు హరిఁ బ్రాణాంతంబు నొందింతుఁ దా
హరికిన్ వైరినటంచు వీఁడు పటురోషాయత్తుఁడై యెప్పుడుం
దిరుగుం, బ్రువ్వదు నోరు, వ్రీలిపడ దా దేహంబు, దాహంబుతో
నరకప్రాప్తియు నొందఁ, డే క్రియ జగన్నాథుం బ్రవేశించెనో?
          ఈ శిశుపాలుడు ఎప్పుడూ రోషంతో, ద్వేషంతో తిరుగుతుండేవాడు; ఎప్పుడూ “కృష్ణుణ్ణి ఓడిస్తా, పట్టుకుంటా, చంపేస్తా, కృష్ణుడు నా బద్ధ విరోధి” అంటూ ఉండే వాడు కదా! పుణ్యపురుషుని దూషించే వీడికి పురుగులు పట్టి నోరు ఎందుకు పుచ్చిపోలేదు; శరీరావయవాలు విరిగి పడిపోలేదు; దేహం దహించి నరకంలో పడిపోలేదు; పైగా వాడి ఆత్మ ఎలా సర్వలోకాధి నాయకుడైన శ్రీహరిలో ప్రవేశించింది; 
७-१२-मत्तॅभ विक्रीडितमु
हरिसाधिंतु हरिन ग्रसिंतु हरिँ ब्राणांतंबु नोंदिंतुँ दा
हरिकिन वैरिनटंचु वीँडु पटुरॉषायत्तुँडै येप्पुडुं
दिरुगुं, ब्रुव्वदु नॉरु, व्रीलिपड दा दॅहंबु, दाहंबुतॉ
नरकप्राप्तियु नोंदँ, डॅ क्रिय जगन्नाथुं ब्रवॅशिंचेनॉ?
            హరిన్ = శ్రీకృష్ణుని; సాధింతున్ = ఓడించెదను; హరిన్ = శ్రీకృష్ణుని; గ్రసింతున్ = మింగెదను; హరిన్ = శ్రీకృష్ణుని; ప్రాణాంతంబున్ = మరణమునకు; ఒందింతున్ = చెందించెదను; తాన్ = తను; హరి = శ్రీకృష్ణుని; కిన్ = కి; వైరిన్ = శత్రువును; అట = అని; అంచున్ = అనుచు; వీడు = ఇతడు; పటు = దట్టమైన; రోష = కోపము; ఆయత్తుడు = కలవాడు; ఐ = అయ్యి; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; తిరుగున్ = మళ్ళీ; ప్రువ్వదు = పుచ్చిపోదు; నోరు = నోరు; వ్రీలి = విరిగి; పడదు = కూలిపోదు; ఆ = ఆ; దేహంబున్ = శరీరము; దాహంబు = యాతనల; తోన్ = తోటి; నరక = నరకమును; ప్రాప్తియున్ = చెందుటను; ఒందడు = పొందడు; ఏ = ఏ; క్రియన్ = విధముగ; జగన్నాథున్ = విష్ణువునందు {జగన్నాథుడు - జగత్తునకు నాథుడు, విష్ణువు}; ప్రవేశించెనో = చేరెనో.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Friday, June 12, 2015

నారాయణుని వైషమ్య అభావం - వేనుఁడు మాధవుం

7-11-ఉత్పలమాల
వేనుఁడు మాధవుం దెగడి విప్రులు దిట్టిన భగ్నుఁడై తమో
లీనుఁడు గాఁడె తొల్లి; మదలిప్తుఁడు చైద్యుఁడు పిన్ననాటనుం
డేనియు మాధవున్ విన సహింపఁడు భక్తి వహింపఁ డట్టివాఁ
డే నిబిడప్రభావమున నీ పరమేశ్వరునందుఁ జొచ్చెనో?
          పూర్వం వేనుడనే రాజు విష్ణుమూర్తిని దూషించగా, వేదమూర్తులు అయిన బ్రాహ్మణులు శపించారు; అతను అలా నరకంలో పడిపోయాడు కదా! ఈ పొగరుబోతు చేది దేశపు శిశుపాలునికి భక్తి ఎలాగూ లేదు; పైగా చిన్నప్పటి నుండి కృష్ణుడి మాటంటేనే మండిపడేవాడు కదా! అటువంటి వాడు ఇలా ఏ మహా మహిమతో కృష్ణమూర్తిలో లీనం అయ్యాడు?
७-११-उत्पलमाल
वॅनुँडु माधवुं देगडि विप्रुलु दिट्टिन भग्नुँडै तमॉ
लीनुँडु गाँडे तोल्लि; मदलिप्तुँडु चैद्युँडु पिन्ननाटनुं
डॅनियु माधवुन विन सहिंपँडु भक्ति वहिंपँ डट्टिवाँ
डॅ निबिडप्रभावमुन नी परमॅश्वरुनंदुँ जोच्चेनॉ?
            వేనుడు = వేనుడనెడి మహారాజు {వేనుడు - పృథుచక్రవర్తి తండ్రి, అంగుని కుమారుడు}; మాధవున్ = విష్ణుమూర్తిని; తెగడి = నిందించి; విప్రులు = బ్రాహ్మణులు; తిట్టినన్ = శపించగా; భగ్నుడు = నశించినవాడు; ఐ = అయ్యి; తమస్ = చీకటిలోకమున, నరకమున; లీనుండు = కలిసినవాడు; కాడె = కాలేదా ఏమి, అయ్యెనుకదా; తొల్లి = పూర్వకాలమందు; మద = పొగరు; లిప్తుడు = పట్టినవాడు; చైద్యుడు = శిశుపాలుడు {చైద్యుడు -చేదిదేశపురాజు,శిశుపాలుడు}; పిన్ననాట = చిన్నతనము; నుండేనియున్ = నుండియును; మాధవున్ = శ్రీకృష్ణుని; వినన్ = వినుటనుకూడ; సహింపడు = ఓర్వడు; భక్తిన్ = భక్తిని; వహింపడు = కలిగి యుండడు; అట్టి = అటువంటి; వాడు = అతడు; ఏ = ఎట్టి; నిబిడ = దట్టమైన; ప్రభావమునన్ = మహిమవలన; ఈ = ఈ; పరమేశ్వరున్ = భగవంతుని; అందున్ = లో; చొచ్చెనో = లీనమయ్యెనో.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Thursday, June 11, 2015

నారాయణుని వైషమ్య అభావం - ఎట్టివారికైన

7-10-ఆటవెలది
“ఎట్టివారి కైన నేకాంతులకు నైన,
వచ్చి చొరఁగ రాని వాసుదేవు
తత్త్వమందుఁ జేది ధరణీశుఁ డహితుఁడై,
యెట్లు జొచ్చె? మునివరేణ్య! నేఁడు.
          “ఓ నారదా! ఎలాంటివారికైనా ఎంతటి అనన్యభక్తులకు అయినా ప్రవేశించడానికి సులభంకానట్టి ఆ మహా తత్వంలో, విష్ణు తత్వంలో శతృత్వం చూపుతున్న ఈ చేది దేశపు రాజు అయిన శిశుపాలుడు ఇంత సులువుగా ఎలా ఐక్యం అయ్యాడు; నీవు గొప్ప మునులలో మిన్న అయినవాడవు. ఇదెలా సాధ్యం అయిందో నాకు చెప్పు.
७-१०-आटवेलदि
“एट्टिवारि कैन नॅकांतुलकु नैन,
वच्चि चोरँग रानि वासुदॅवु
तत्त्वमंदुँ जॅदि धरणीशुँ डहितुँडै,
येट्लु जोच्चे? मुनिवरॅण्य! नॅँडु.
            ఎట్టి = ఎటువంటి; వారి = వారల; కిన్ = కు; ఐనన్ = అయినప్పటికిని; ఏకాంతుల్ = అనన్యభక్తులు; కున్ = కు; ఐనన్ = అయినను; వచ్చిచొరగన్ = ఐక్యమగుటకు; రాని = సాధ్యముకాని; వాసుదేవు = విష్ణువు యనెడి; తత్త్వము = పరమాత్మ; అందున్ = లో; చేది = చేదిదేశపు; ధరణీశుడు = రాజు {ధరణీశుడు - ధరణి (రాజ్యమున)కు ఈశుడు (ప్రభువు), రాజు}; ఎట్లు = ఏ విధముగ; చొచ్చెన్ = ప్రవేశించెను; ముని = మునులలో; వరేణ్య = శ్రేష్ఠుడా; నేఁడు = ఇప్పుడు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, June 10, 2015

నారాయణుని వైషమ్య అభావం - మున్ను ధర్మరాజు

7-9-వచనము
మున్ను ధర్మరాజు చేయు రాజసూయయాగంబున బాలుండైన శిశుపాలుండు హరిని నిందించి నిశితనిర్వక్రచక్రధారాదళితమస్తకుం డయి తేజోరూపంబున వచ్చి హరిదేహంబు జొచ్చినం జూచి వెఱఁగు పడి ధర్మజుండు సభలోనున్న నారదునిం జూచి యిట్లనియె.
          పూర్వం ధర్మరాజు రాజసూయయాగం చేస్తున్నాడు. అజ్ఞాని అయిన శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందించాడు. బహు వాడి అయిన సుదర్శన చక్రంతో కృష్ణుడు అతని తల ఖండించాడు. అతని ఆత్మ తేజోరూపంతో కృష్ణునిలో ఐక్యం అయింది. అది చూసి ఆశ్చర్యపోయి, ధర్మరాజు అప్పుడు అక్కడ సభలో ఉన్న నారదుడితో ఇలా అన్నాడు. 
७-९-वचनमु
मुन्नु धर्मराजु चॅयु राजसूययागंबुन बालुंडैन शिशुपालुंडु हरिनि निंदिंचि निशितनिर्वक्रचक्रधारादळितमस्तकुं डयि तॅजॉरूपंबुन वच्चि हरिदॅहंबु जोच्चिनं जूचि वेर्रँगु पडि धर्मजुंडु सभलॉनुन्न नारदुनिं जूचि यिट्लनिये.
            మున్ను = పూర్వము; ధర్మరాజు = ధర్మరాజు; చేయు = చేసెడి; రాజసూయ = రాజసూయము యనెడి {రాజసూయము - ఒకరాజు తక్కిన రాజులను జయించి చేసెడి యజ్ఞము}; యాగంబునన్ = యజ్ఞమునందు; బాలుండు = అజ్ఞాని; ఐన = అయిన; శిశుపాలుండు = శిశుపాలుడు {శిశుపాలుడు - శ్రీకృష్ణుని మేనత్త కొడుకు, చేదిదేశపు రాజు}; హరిని = శ్రీకృష్ణుని; నిందించి = తిట్టి; నిశిత = వాడియైన; నిర్వక్ర = మరల్పరాని; చక్ర = చక్రముయొక్క; ధారా = అంచులచే; దళిత = ఖండింపబడిన; మస్తకుండు = శిరస్సుగలవాడు; అయి = అయ్యి; తేజస్ = వెలుగు; రూపంబునన్ = రూపముతో; వచ్చి = చేరి; హరి = శ్రీకృష్ణుని; దేహంబున్ = శరీరమును; చొచ్చినన్ = ప్రవేశించగా, ఐక్యముకాగా; చూచి = చూసి; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; ధర్మజుండు = ధర్మరాజు; సభ = సభావాటిక; లోనన్ = అందు; ఉన్న = ఉన్నట్టి; నారదునిన్ = నారదుని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Tuesday, June 9, 2015

నారాయణుని వైషమ్య అభావం - జననాయక

7-8-కంద పద్యము
జననాయక! యీ యర్థము
ఘనయశుఁ డగు ధర్మజునకుఁ గ్రతుకాలమునన్
మును నారదుండు చెప్పెను
వినిపించెద వినుము చెవులు విమలత నొందన్.
          జనులందరిని సరైన మార్గంలో నడిపించే ఓ పరీక్షిన్మహారాజా! ఇప్పుడు నీవడిగిన సంగతినే పూర్వం ధర్మవిదుడైన ధర్మరాజునకు రాజసూయ యాగ సమయంలో ధర్మవిదుడైన నారదమహర్షి చెప్పాడు. ఇప్పుడు నీకు చెప్తాను చెవులకు పండువుగా విను,
७-८-कंद पद्यमु
जननायक! यी यर्थमु
घनयशुँ डगु धर्मजुनकुँ ग्रतुकालमुनन
मुनु नारदुंडु चेप्पेनु
विनिपिंचेद विनुमु चेवुलु विमलत नोंदन.
            జననాయక = రాజా {జననాయక - జనులకు నాయకుడు, రాజు}; ఈ = ఇట్టి; అర్థము = సందర్భమునందు; ఘన = గొప్ప; యశుడు = కీర్తిగలవాడు; అగు = అయిన; ధర్మరాజున్ = ధర్మరాజున; కున్ = కు; క్రతు = యజ్ఞ; కాలమునన్ = సమయమునందు; మును = పూర్వము; నారదుండు = నారదుడు; చెప్పెను = తెలియజెప్పెను; వినిపించెదన్ = చెప్పెదను; వినుము = వినుము; చెవులు = చెవులు; విమలతన్ = నిర్మలత్వమును; ఒందన్ = పొందునట్లుగా.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :