Thursday, June 11, 2015

నారాయణుని వైషమ్య అభావం - ఎట్టివారికైన

7-10-ఆటవెలది
ట్టివారి కైన నేకాంతులకు నైన,
చ్చి చొరఁగ రాని వాసుదేవు
త్త్వమందుఁ జేది రణీశుఁ డహితుఁడై,
యెట్లు జొచ్చె? మునివరేణ్య! నేఁడు.
          ఓ నారదా! ఎలాంటివారికైనా ఎంతటి అనన్యభక్తులకు అయినా ప్రవేశించడానికి సులభంకానట్టి ఆ మహా తత్వంలో, విష్ణు తత్వంలో శతృత్వం చూపుతున్న ఈ చేది దేశపు రాజు అయిన శిశుపాలుడు ఇంత సులువుగా ఎలా ఐక్యం అయ్యాడు; నీవు గొప్ప మునులలో మిన్న అయినవాడవు. ఇదెలా సాధ్యం అయిందో నాకు చెప్పు.
७-१०-आटवेलदि
एट्टिवारि कैन नॅकांतुलकु नैन,
वच्चि चोरँग रानि वासुदॅवु
तत्त्वमंदुँ जॅदि धरणीशुँ डहितुँडै,
येट्लु जोच्चे? मुनिवरॅण्य! नॅँडु.
            ఎట్టి = ఎటువంటి; వారి = వారల; కిన్ = కు; ఐనన్ = అయినప్పటికిని; ఏకాంతుల్ = అనన్యభక్తులు; కున్ = కు; ఐనన్ = అయినను; వచ్చిచొరగన్ = ఐక్యమగుటకు; రాని = సాధ్యముకాని; వాసుదేవు = విష్ణువు యనెడి; తత్త్వము = పరమాత్మ; అందున్ = లో; చేది = చేదిదేశపు; ధరణీశుడు = రాజు {ధరణీశుడు - ధరణి (రాజ్యమున)కు ఈశుడు (ప్రభువు), రాజు}; ఎట్లు = ఏ విధముగ; చొచ్చెన్ = ప్రవేశించెను; ముని = మునులలో; వరేణ్య = శ్రేష్ఠుడా; నేఁడు = ఇప్పుడు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: