Friday, June 12, 2015

నారాయణుని వైషమ్య అభావం - వేనుఁడు మాధవుం

7-11-ఉత్పలమాల
వేనుఁడు మాధవుం దెగడి విప్రులు దిట్టిన భగ్నుఁడై తమో
లీనుఁడు గాఁడె తొల్లి; మదలిప్తుఁడు చైద్యుఁడు పిన్ననాటనుం
డేనియు మాధవున్ విన సహింపఁడు భక్తి వహింపఁ డట్టివాఁ
డే నిబిడప్రభావమున నీ పరమేశ్వరునందుఁ జొచ్చెనో?
          పూర్వం వేనుడనే రాజు విష్ణుమూర్తిని దూషించగా, వేదమూర్తులు అయిన బ్రాహ్మణులు శపించారు; అతను అలా నరకంలో పడిపోయాడు కదా! ఈ పొగరుబోతు చేది దేశపు శిశుపాలునికి భక్తి ఎలాగూ లేదు; పైగా చిన్నప్పటి నుండి కృష్ణుడి మాటంటేనే మండిపడేవాడు కదా! అటువంటి వాడు ఇలా ఏ మహా మహిమతో కృష్ణమూర్తిలో లీనం అయ్యాడు?
७-११-उत्पलमाल
वॅनुँडु माधवुं देगडि विप्रुलु दिट्टिन भग्नुँडै तमॉ
लीनुँडु गाँडे तोल्लि; मदलिप्तुँडु चैद्युँडु पिन्ननाटनुं
डॅनियु माधवुन विन सहिंपँडु भक्ति वहिंपँ डट्टिवाँ
डॅ निबिडप्रभावमुन नी परमॅश्वरुनंदुँ जोच्चेनॉ?
            వేనుడు = వేనుడనెడి మహారాజు {వేనుడు - పృథుచక్రవర్తి తండ్రి, అంగుని కుమారుడు}; మాధవున్ = విష్ణుమూర్తిని; తెగడి = నిందించి; విప్రులు = బ్రాహ్మణులు; తిట్టినన్ = శపించగా; భగ్నుడు = నశించినవాడు; = అయ్యి; తమస్ = చీకటిలోకమున, నరకమున; లీనుండు = కలిసినవాడు; కాడె = కాలేదా ఏమి, అయ్యెనుకదా; తొల్లి = పూర్వకాలమందు; మద = పొగరు; లిప్తుడు = పట్టినవాడు; చైద్యుడు = శిశుపాలుడు {చైద్యుడు -చేదిదేశపురాజు,శిశుపాలుడు}; పిన్ననాట = చిన్నతనము; నుండేనియున్ = నుండియును; మాధవున్ = శ్రీకృష్ణుని; వినన్ = వినుటనుకూడ; సహింపడు = ఓర్వడు; భక్తిన్ = భక్తిని; వహింపడు = కలిగి యుండడు; అట్టి = అటువంటి; వాడు = అతడు; = ఎట్టి; నిబిడ = దట్టమైన; ప్రభావమునన్ = మహిమవలన; = ; పరమేశ్వరున్ = భగవంతుని; అందున్ = లో; చొచ్చెనో = లీనమయ్యెనో.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: