Thursday, June 18, 2015

నారాయణుని వైషమ్య అభావం - కామోత్కంఠత

7-17-వచనము
ఇవ్విధంబున.
          ఇలాగే
            ఇవ్విధంబునన్ = ఈ విధముగ.
7-18-శార్దూల విక్రీడితము
కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా
సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులుం,
బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి; మెట్లైన ను
ద్ధామధ్యానగరిష్ఠుఁడైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!
          ధర్మరాజా! మన్మథ వికారముతో గోపికలు, ప్రాణభయంతో కంసుడు, విరోధంతో శిశుపాలుడు మొదలైన రాజులు, దాయాదులు అయ్యి యాదవులు, బంధుప్రీతితో మీరు, భక్తితో మేము నిరంతర స్మరణలు చేసి విష్ణుసాయుజ్యం పొందాము కదా. ఏ విధంగా అయినా సరే విడవకుండా ధ్యానించి నారాయణుని పొందవచ్చును
७-१८-शार्दूल विक्रीडितमु
कामॉत्कंठत गॉपिकल, भयमुनं गंसुंडु, वैरक्रिया
सामाग्रिन शिशुपालमुख्य नृपतुल, संबंधुलै वृष्णुलुं,
ब्रॅमन मीरलु, भक्ति नॅमु, निदे चक्रिंगंटि; मेट्लैन नु
द्धामध्यानगरिष्ठुँडैन हरिँ जेंदन वच्चु धात्रीश्वरा!
            కామ = మన్మథ వికారము నందలి; ఉత్కంఠతన్ = ఆసక్తితో; గోపికల్ = గోపికలు; భయమునన్ = భయముతో; కంసుండు = కంసుడు; వైర = విరోధపు; క్రియన్ = చేతల; సామగ్రిన్ = బలమున; శిశుపాల = శిశుపాలుడు; ముఖ్య = మున్నగు; నృపతుల్ = రాజులు; సంబంధులు = చుట్టరికము గల వారు; ఐ = అయ్యి; వృష్ణులున్ = యాదవులు {వృష్ణులు - వృష్ణవంశపు యాదవులు}; ప్రేమన్ = ప్రేమతో; మీరలు = మీరు; భక్తిన్ = భక్తితో; ఏమున్ = మేము; ఇదె = ఇదిగో; చక్రిన్ = విష్ణుమూర్తిని {చక్రి – చక్రము ధరించిన వాడు, హరి}; కంటిమి = దర్శించితిమి; ఎట్లు = ఏ విధముగ; ఐనన్ = అయినప్పటికిని; ఉద్దామ = ఉన్నత మైన; ధ్యాన = ధ్యానముచే; గరిష్ఠుడు = శ్రేష్ఠుడు; ఐన = అయిన; హరిన్ = నారాయణుని; చెందన్ = పొంద; వచ్చు = సాధ్యము; ధాత్రీశ్వరా = రాజా {ధాత్రీశ్వరుడు - ధాత్రి (భూమి)కి ఈశ్వరుడు (ప్రభువు), రాజు}.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, June 17, 2015

నారాయణుని వైషమ్య అభావం - కీటకముఁ దెచ్చి

7-16-కంద పద్యము
కీటకముఁ దెచ్చి భ్రమరము
పాటవమున బంభ్రమింప భ్రాంతంబై త
త్కీటకము భ్రమరరూపముఁ
బాటించి వహించుఁ గాదె భయయోగమునన్.
          తుమ్మెద పురుగును తీసుకువచ్చి, ఝంకారం చేస్తూ దానిచుట్టూ తిరుగుతుంది. ఆ పురుగు భయంతో ఆ పురుగునే విడువకుండా చూస్తూ భ్రాంతిపడి, తుమ్మెదగా మారిపోతుంది కదా! అలాగే భయంవల్లగానీ, నయంవల్లగానీ, స్మరణవల్లగానీ, శ్రవణంవల్లగానీ శ్రీహరి సామీప్యం పొందవచ్చు.
७-१६-कंद पद्यमु
कीटकमुँ देच्चि भ्रमरमु
पाटवमुन बंभ्रमिंप भ्रांतंबै त
त्कीटकमु भ्रमररूपमुँ
बाटिंचि वहिंचुँ गादे भययॉगमुनन.
            కీటకమున్ = పురుగును; తెచ్చి = తీసుకొచ్చి; భ్రమరము = తుమ్మెద; పాటవమునన్ = నేర్పుతో; బంభ్రమింపన్ = చుట్టుతిరుగగా; భ్రాంతంబు = భ్రాంతిలోపడినది; ఐ = అయ్యి; తత్ = ఆ; కీటకము = పురుగు; భ్రమర = తుమ్మెదయొక్క; రూపమున్ = స్వరూపమును; పాటించి = విడువక; వహించున్ = ధరించును; కాదె = కాదా; భయ = భయముయొక్క; యోగమునన్ = సంబంధముతో.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Tuesday, June 16, 2015

నారాయణుని వైషమ్య అభావం - వైరానుబంధనంబున

7-15-కంద పద్యము
వైరానుబంధనంబునఁ
జేరిన చందమున విష్ణుఁ జిరతర భక్తిం
జేరఁగ రాదని తోఁచును
నారాయణభక్తి యుక్తి నా చిత్తమునన్.
          ‘ఆ మహావిష్ణువును విశృంఖలమైన విరోధంతో చేరినంత సుళువుగా, బహు అధికమైన విష్ణుభక్తి మార్గమున చేరలేము’ అని నాకైతే మనసులో అనిపిస్తుంది.
७-१५-कंद पद्यमु
वैरानुबंधनंबुनँ
जॅरिन चंदमुन विष्णुँ जिरतर भक्तिं
जॅरँग रादनि तँचुनु
नारायणभक्ति युक्ति ना चित्तमुनन.
            వైర = శత్రుత్వపు; అనుబంధనంబునన్ = సంబంధముతో; చేరిన = పొందిన; చందమునన్ = విధముగ; విష్ణున్ = నారాయణుని; చిరతర = చాలా ఎక్కువ కాలము చేసిన {చిరము - చిరతరము - చిరతమము}; భక్తిన్ = భక్తితో; చేరగన్ = చేరుటకు; రాదు = సాధ్యముకాదు; అని = అని; తోచును = అనిపించును; నారాయణ = విష్ణువు యెడలి; భక్తి = భక్తియనెడి; యుక్తిన్ = ఉపాయముతో; నా = నా యొక్క; చిత్తమునన్ = ఉద్దేశ్యములో.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, June 15, 2015

నారాయణుని వైషమ్య అభావం - అలుకనైన

7-14-ఆటవెలది
అలుక నైనఁ జెలిమి నైనఁ గామంబున
నైన బాంధవమున నైన భీతి
నైనఁ దగిలి తలఁప నఖిలాత్ముఁ డగు హరిఁ
జేర వచ్చు వేఱు జేయఁ డతఁడు.
          ఆ స్వామి ఎవరినీ ఎప్పుడూ పరునిగా చూడడు. కోపంతో కానీ, స్నేహంతో కానీ, ఇష్టంతో కానీ, బంధుత్వంతో కానీ, భయంతో కానీ ఎలా అయినా సరే మనస్ఫూర్తిగా ఏకాగ్రంగా విష్ణునామాన్ని స్మరణ చేస్తే చాలు, సర్వ భూతాత్మకు డైన ఆ శ్రీమహావిష్ణువు సన్నిధానానికి చేర్చుకుంటాడు.
७-१४-आटवेलदि
अलुक नैनँ जेलिमि नैनँ गामंबुन
नैन बांधवमुन नैन भीति
नैनँ दगिलि तलँप नखिलात्मुँ डगु हरिँ
जॅर वच्चु वॅर्रु जॅयँ डतँडु.
            అలుకన్ = కోపముతో; ఐనన్ = అయినను; చెలిమిన్ = స్నేహముతో; ఐనన్ = అయినను; కామంబునన్ = కోరికతో; ఐనన్ = అయినను; బాంధవమునన్ = చుట్టరికముతో; ఐనన్ = అయినను; భీతిన్ = భయముతో; ఐనన్ = అయినను; తగిలి = పూని; తలపన్ = తరచిచూసినచో; అఖిలాత్ముడు = సర్వభూతస్వరూపుడు; అగు = అయిన; హరిన్ = నారాయణుని; చేరవచ్చును = చేరుట సాధ్యము; వేఱుచేయడు = భేదముగ చూడడు; అతడు = అతడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, June 14, 2015

నారాయణుని వైషమ్య అభావం - అదియునుంగాక దంతవక్త్రుండును

7-13-వచనము
అదియునుం గాక, దంతవక్త్రుండును వీఁడును నిరంతరంబు గోవిందు నింద జేయుదురు; నిఖిలజనులు సందర్శింప నేఁడు వీనికి విష్ణు సాయుజ్యంబు గలుగుట కేమి హేతువు? వినిపింపుము; పవన చలితదీపశిఖయునుం బోలె నా హృదయంబు సంచలించుచున్న" దనిన, ధర్మనందనునకు నారదుం డిట్లనియె; "దూషణభూషణతిరస్కా రంబులు శరీరంబునకుం గాని పరమాత్మకు లేవు; శరీరాభిమానంబునం జేసి దండవాక్పారుష్యంబులు హింసయై తోఁచు తెఱంగున; నేను నాయది యనియెడు వైషమ్యంబును భూతంబులకు శరీరంబు నందు సంభవించు; అభిమానంబు బంధంబు; నిరభిమానుండై వధించినను వధంబుగాదు; కర్తృత్వ మొల్లనివానికి హింసయు సిద్ధింపదు; సర్వభూతాత్మకుండైన యీశ్వరునికి వైషమ్యంబు లేదు; కావున.
          ఇంతే కాకుండా, ఈ శిశుపాలుడూ, వీడి తమ్ముడు దంతవక్త్రుడూ ఎప్పుడూ కృష్ణుణ్ణి నిందించే వాళ్ళే కదా! అంతటి పాపీ, ఇందరు చూస్తుండగా పరమ ముక్తి గమ్యమైన విష్ణుసాయుజ్యం ఎలా పొందాడు? ఈ సందేహం తీరక, గాలికి కొట్టుమిట్టాడే దీపంలా, నా హృదయం చలించిపోతోంది. దీనికి కారణం ఏమిటో చెప్పి నా సందేహం తీర్చు?” అన్నాడు. అప్పుడు నారదమహర్షి ఇలా అన్నాడు. “తిట్టినా, పొగిడినా అవి దేహానికే కాని ఆత్మకు, పరబ్రహ్మకు అంటవు; దండించటం, తిట్టటం, కొట్టటం వంటివి దేహం మీద మమకారంతో బాధ హింసలా తోస్తాయి; జీవులకు సహజమైన అహంకార మమకారాలు లేకుండా అభిమాన బంధం లేకుండా చంపేసినా కూడా అది హత్యా కాదు, పాపం అంటదు; చేసిన వాడిని నేను అనే కర్తృత్వం వదలిపెట్టిన వానికి జీవహింస, పాపాలు ఏవీ అంటవి; ఎల్ల జీవులలో అంతరాత్మగా ఉండే భగవానునికి భేదభావం అన్నది లేదు; ఎవరిమీదా దేనిమీదా ద్వేషంకానీ, విరోధంకానీ ఎప్పడూ ఎక్కడా విష్ణుమూర్తికి ఉండదు;
            అదియునున్ = అంతే; కాక = కాకుండగ; దంతవక్త్రుండును = దంతవక్త్రుడు {దంతవక్త్రుడు - శిశుపాలుని తమ్ముడు}; వీడునున్ = ఇతడు; నిరంతరంబు = ఎల్లప్పుడును; గోవిందున్ = శ్రీకృష్ణుని; నిందన్ = తెగడుట; చేయుదురు = చేయుచుందురు; నిఖిల = ఎల్ల; జనులున్ = లోకులు; సందర్శింపన్ = చక్కగ చూచుచుండగా; నేఁడు = ఇప్పుడు; వీని = ఇతని; కిన్ = కి; విష్ణు = విష్ణుమూర్తియందు; సాయుజ్యంబున్ = ఐక్యమగుట; కలుగుట = సంభవించుట; కున్ = కు; ఏమి = ఏమిటి; హేతువు = కారణము; వినిపిపంపుము = తెలుపుము; పవన = గాలికి; చలిత = కొట్టుకొనెడి; దీప = దీపము యొక్క; శిఖయున్ = మంట; పోలెన్ = వలె; నా = నా యొక్క; హృదయంబు = హృదయము; సంచలించుచున్నది = కలతనొందుచున్నది; అనినన్ = అనగా; ధర్మనందనున్ = ధర్మరాజున {ధర్మనందనుడు - యమధర్మరాజు యొక్క పుత్రుడు, ధర్మరాజు}; కున్ = కు; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; దూషణ = తెగడుట; భూషణ = పొగడుట; తిరస్కారంబులు = అవమానించుటలు; శరీరంబున్ = దేహమున; కున్ = కు; కాని = కాని; పరమాత్మ = పరమాత్మ; కున్ = కు; లేవు = లేవు; శరీర = దేహమందలి; అభిమానంబునన్ = అహంకారము; చేసి = వలన; దండ = కొట్టుట; వాక్పారుష్యంబులున్ = కఠినముగామాట్లాడుట; హింస = వధించుట; ఐ = జరుగునట్లు; తోచు = తెలియు; తెఱంగునన్ = విధముగ; నేను = నేను; నాయది = నాది; అనియెడు = అనెడి; వైషమ్యంబును = భేదభావము; భూతంబుల్ = జీవుల; కున్ = కు; శరీరంబున్ = దేహమున; అందున్ = అందు; సంభవించు = కలుగును; అభిమానంబు = అహంకారము; బంధంబు = బంధములు; నిరభిమానుండు = అభిమానములేనివాడు; ఐ = అయ్యి; వధించినను = చంపినను; వధంబు = హత్య; కాదు = కాదు; కర్తృత్వము = కర్త యైన భావము; ఒల్లని = అంగీకరించనట్టి; వాని = అతని; కిన్ = కి; హింసయున్ = హత్యాపాపము; సిద్ధింపదు = కలుగదు; సర్వ = సమస్తమైన; భూత = జీవులు; ఆత్మకుండు = లోనుండువాడు, తానైనవాడు; ఐనన్ = అయినట్టి; ఈశ్వరున్ = భగవంతుని; కిన్ = కి; వైషమ్యంబున్ = భేదభావము,శత్రుత్వభావము; లేదు = లేదు; కావున = అందుచేత.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :