Tuesday, June 16, 2015

నారాయణుని వైషమ్య అభావం - వైరానుబంధనంబున

7-15-కంద పద్యము
వైరానుబంధనంబునఁ
జేరిన చందమున విష్ణుఁ జిరతర భక్తిం
జేరఁగ రాదని తోఁచును
నారాయణభక్తి యుక్తి నా చిత్తమునన్.
          ఆ మహావిష్ణువును విశృంఖలమైన విరోధంతో చేరినంత సుళువుగా, బహు అధికమైన విష్ణుభక్తి మార్గమున చేరలేము అని నాకైతే మనసులో అనిపిస్తుంది.
७-१५-कंद पद्यमु
वैरानुबंधनंबुनँ
जॅरिन चंदमुन विष्णुँ जिरतर भक्तिं
जॅरँग रादनि तँचुनु
नारायणभक्ति युक्ति ना चित्तमुनन.
            వైర = శత్రుత్వపు; అనుబంధనంబునన్ = సంబంధముతో; చేరిన = పొందిన; చందమునన్ = విధముగ; విష్ణున్ = నారాయణుని; చిరతర = చాలా ఎక్కువ కాలము చేసిన {చిరము - చిరతరము - చిరతమము}; భక్తిన్ = భక్తితో; చేరగన్ = చేరుటకు; రాదు = సాధ్యముకాదు; అని = అని; తోచును = అనిపించును; నారాయణ = విష్ణువు యెడలి; భక్తి = భక్తియనెడి; యుక్తిన్ = ఉపాయముతో; నా = నా యొక్క; చిత్తమునన్ = ఉద్దేశ్యములో.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: