Monday, June 15, 2015

నారాయణుని వైషమ్య అభావం - అలుకనైన

7-14-ఆటవెలది
లుక నైనఁ జెలిమి నైనఁ గామంబున
నైన బాంధవమున నైన భీతి
నైనఁ దగిలి తలఁప ఖిలాత్ముఁ డగు హరిఁ
జేర వచ్చు వేఱు జేయఁ డతఁడు.
          ఆ స్వామి ఎవరినీ ఎప్పుడూ పరునిగా చూడడు. కోపంతో కానీ, స్నేహంతో కానీ, ఇష్టంతో కానీ, బంధుత్వంతో కానీ, భయంతో కానీ ఎలా అయినా సరే మనస్ఫూర్తిగా ఏకాగ్రంగా విష్ణునామాన్ని స్మరణ చేస్తే చాలు, సర్వ భూతాత్మకు డైన ఆ శ్రీమహావిష్ణువు సన్నిధానానికి చేర్చుకుంటాడు.
७-१४-आटवेलदि
अलुक नैनँ जेलिमि नैनँ गामंबुन
नैन बांधवमुन नैन भीति
नैनँ दगिलि तलँप नखिलात्मुँ डगु हरिँ
जॅर वच्चु वॅर्रु जॅयँ डतँडु.
            అలుకన్ = కోపముతో; ఐనన్ = అయినను; చెలిమిన్ = స్నేహముతో; ఐనన్ = అయినను; కామంబునన్ = కోరికతో; ఐనన్ = అయినను; బాంధవమునన్ = చుట్టరికముతో; ఐనన్ = అయినను; భీతిన్ = భయముతో; ఐనన్ = అయినను; తగిలి = పూని; తలపన్ = తరచిచూసినచో; అఖిలాత్ముడు = సర్వభూతస్వరూపుడు; అగు = అయిన; హరిన్ = నారాయణుని; చేరవచ్చును = చేరుట సాధ్యము; వేఱుచేయడు = భేదముగ చూడడు; అతడు = అతడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: