:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం
అందరం:
10.1-682-సీ.
విశ్వంబు నీవయై విశ్వంబుఁ జూచుచు;
విశ్వంబుఁ జేయుచు విశ్వమునకు
హేతువవై పంచభూతమాత్రేంద్రియ;
ములకు మనః ప్రాణ బుద్ధి చిత్త
ముల కెల్ల నాత్మవై మొనసి గుణంబుల;
నావృత మగుచు నిజాంశభూత
మగు నాత్మచయమున కనుభూతి చేయుచు;
మూ డహంకృతులచే ముసుఁగుబడక
విశ్వంబుఁ జేయుచు విశ్వమునకు
హేతువవై పంచభూతమాత్రేంద్రియ;
ములకు మనః ప్రాణ బుద్ధి చిత్త
ముల కెల్ల నాత్మవై మొనసి గుణంబుల;
నావృత మగుచు నిజాంశభూత
మగు నాత్మచయమున కనుభూతి చేయుచు;
మూ డహంకృతులచే ముసుఁగుబడక
10.1-682.1-తే.
నెఱి ననంతుఁడవై దర్శనీయరుచివి
గాక సూక్ష్ముఁడవై నిర్వికారమహిమఁ
దనరి కూటస్థుఁడన సమస్తంబు నెఱుఁగు
నీకు మ్రొక్కెద మాలింపు నిర్మలాత్మ!
గాక సూక్ష్ముఁడవై నిర్వికారమహిమఁ
దనరి కూటస్థుఁడన సమస్తంబు నెఱుఁగు
నీకు మ్రొక్కెద మాలింపు నిర్మలాత్మ!
టీకా:
విశ్వంబు = జగత్తు; నీవ = నీవే; ఐ =
అయ్యి; విశ్వంబున్ = జగత్తును; చూచుచున్ = సాక్షివై చూచుచు; విశ్వంబున్ = జగత్తును; చేయుచున్ = సృష్టించుచు; విశ్వమున్ = జగత్తున; కున్ = కు; హేతువవు
= కారణభూతుడవు; పంచభూత = పంచమహాభూతములకు {పంచమహాభూతములు - 1 భూమి 2నీరు 3అగ్ని 4వాయువు 5ఆకాశము}; మాత్ర = పంచతన్మాత్రలకు {మాత్రలు, పంచతన్మాత్రలు
- 1శబ్దము 2స్పర్శము
3రూపము 4రసము 5గంధము}; ఇంద్రియముల్
= ఙ్ఞానకర్మేంద్రియముల {దశేంద్రియములు - ఙ్ఞానేంద్రియములు ఐదు (కన్ను
ముక్కు చెవులు నాలుక చర్మములు) కర్మేంద్రియములు ఐదు (కాళ్ళు చేతులు నోరు గుదము
గుహ్యములు)}; కున్ = కు; మనః =
మనస్సునకు {మనస్సు - సంకల్ప రూపము}; ప్రాణ = దశవాయువులకు {ప్రాణములు, దశవాయువులు
- పంచవాయువులు ఐదు (ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు) పంచ ఉపవాయువులు ఐదు (నాగ
కూర్మ కృకర దేవదత్త ధనంజయములు)}; బుద్ధి = బుద్ధి {బుద్ధి - నిశ్చయము రూపము}; చిత్తముల = చిత్తముల {చిత్తము - సంశయ రూపము}; కిన్ = కి; ఎల్లన్
= సమస్తమునకు; ఆత్మవు = స్వరూపుడవు; ఐ = అయ్యి; మొనసి
= పూని; గుణంబులన్ = త్రిగుణములచేత; ఆవృతము = కప్పబడినవాడవు; అగుచున్ = అగుచు; నిజ =
నీయొక్క; అంశ = అంశములో; భూతము
= ఐనవవి; అగు = అయిన; ఆత్మచయమున
= సర్వజీవజాలముల; కున్ = కు; అనుభూతి
= జీన్మరణాద్యనుభవములు; చేయుచున్ = కలుగజేయుచు; మూడహంకృతుల = త్రిగుణాత్మకహంకృతులు {త్రిగుణాత్మకహంకృతులు - రాజసాహంకృతి తామసాహంకృతి
సాత్వికాహంకృతి}; చేన్ = వలన; ముసుగుబడకన్
= కమ్ముకొనబడకుండగ.
నెఱిన్ = పరిపూర్ణత్వముచేత; అనంతుడవు = అంతములేనివాడవు {అనంతుడు - దేశ కాల వస్తు విభాగము లేనివాడు, అంతము లేనివాడు}; ఐ = అయ్యి; దర్శనీయ = చూడదగిన; రుచివి = తగినవాడవు {రుచి - ప్రకాశము, దృశ్యప్రపంచ రూపమైన ఇదంవృత్తి}; కాక = కాకుండగ; సూక్ష్ముడవు = సూక్ష్మత్వముకలవాడవు; ఐ = అయ్యి; నిర్వికార = షడ్వికారశూన్యత్వ; మహిమన్ = మహత్యముచేత; తనరి = ఒప్పి; కూటస్థుడు = కూటస్థుడు {కూటస్థుడు - కూటస్థము (ఎల్లకాలము ఒకే విధముగా నుండెడి తత్వము) కలవాడు, పంచమహాభూతముల సమూహమున ఉండువాడు, క్షేత్రఙ్ఞుడు}; అనన్ = అనబడుతు; సమస్తంబున్ = సమస్తమును {సమస్తము - ద్రష్ట దృక్ దృశ్య మయమైన సమస్తము}; ఎఱుగు = తెలిసియుండెడి; నీ = నీ; కున్ = కు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; ఆలింపుము = వినుము {పంచమలములు - 1ఆణవము 2కార్మికము 3మాయికము 4మాయేయము 5తిరోధానము, చూ. వీని విస్తారములకు వివరముల దస్త్రము చూడుడు}; నిర్మలాత్మా = కృష్ణా {నిర్మలాత్మ - పంచమలములు లేని పరబ్రహ్మ స్వరూపుడు, విష్ణువు}.

భావము:
ఈ సమస్త విశ్వము నీవే; ఈ విశ్వంగా ఉండి దాన్ని చూస్తున్న వాడవు కూడ
నీవే. దీన్ని నిర్మిస్తూ ఉండేది నీవే. ఈ విశ్వానికి మూలకారణం నీవే. పంచతన్మాత్రలు, పంచేంద్రియాలు, మనస్సు, ప్రాణం, బుద్ధి, చిత్తం అన్ని కూడ నీవే. ఈ గుణాలచేత ఆవరింపబడి
ఉన్నవాడవు నీవే. నీలో కొంత భాగమై, నీ అంశలై ఇన్ని
ఆత్మలు వర్తిస్తు ఉంటే, వాటికి అనుభూతి కలిగించే మొత్తంగా నీవే ఉన్నావు.
త్రిగుణాలైన సత్వరజస్తమాల రూపంలో పనిచేసే మూడు అహంకారాలుచేత కప్పబడకుండా ఉంటావు.
అంతులేని ప్రకాశం కలిగి ఉంటావు. గమనించడానికి శక్యంకాని సూక్ష్మ రూపుడవు అయ్యి
ఉంటావు. మార్పులన్నవి లేకుండా ఉండి, అన్నిటిలోను
దాగి ఉంటావు కనుక, సమస్తము ఎరుగుదువు. అటువంటి నీకు నిర్మలాత్ముడా!
మేము నమస్కరిస్తున్నాము.
No comments:
Post a Comment