Sunday, March 5, 2017

కాళియమర్దనము – ఘన సంసారాహతులగు


:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:


10.1-680-క.
 సంసారాహతులగు
ను లాకాంక్షింపఁ గడు నక్యం బగు శో
ము సమక్షంబున నహి
నియెం దామసుఁడు రోషలితుం డయ్యున్
10.1-681-వ.
దేవా! సకల పురుషాంతర్యామి రూపత్వంబు వలనఁ బరమ బురుషుండ వయ్యు, నపరిచ్ఛిన్నత్వంబు వలన మహాత్ముండ వయ్యు, నాకాశాది భూతసమాశ్రయత్వంబు వలన భూతావాసుండ వయ్యును, భూతమయత్వంబు వలన భూతశబ్ద వాచ్యుండ వయ్యుఁ, గారణాతీతత్వంబు వలనఁ బరమాత్ముండ వయ్యును, జ్ఞాన విజ్ఞాన పరిపూర్ణత్వంబు గలిగి నిర్గుణత్వ నిర్వికారత్వంబు వలన బ్రహ్మంబ వయ్యుఁను, బ్రకృతి ప్రవర్తకత్వంబు వలన ననంతశక్తివై యప్రాకృతుండ వయ్యుఁ, గాలచక్రప్రవర్తకత్వంబు వలనఁ గాలుండ వయ్యుఁ, గాలశక్తి సమాశ్రయత్వంబు వలన గాలనాభుండ వయ్యు, సృష్టి జీవన సంహారాది దర్శిత్వంబు వలనం గాలావయవసాక్షి వయ్యు నొప్పు నీకు నమస్కరించెదము; మఱియును.

టీకా:
ఘన = గొప్పదైన; సంసార = సంసారపు; ఆహతులు = బారముపడినవారు; అగు = ఐన; జనులు = ప్రజలు; ఆకాంక్షింపన్ = కోరుకొనుటకైనన్; కడు = మిక్కలి; అశక్యంబు = అసాధ్యము; అగు = ఐన; శోభనము = మేలు; సమక్షంబునన్ = కంటికెదురుగా; అహి = ఈ సర్పము; కనియెన్ = దర్శించెను; తామసుడు = తమోగుణాన్వితుడు; రోష = కోపము; కలితుండు = కలవాడు; అయ్యున్ = అయినప్పటికి.
దేవా = భగవంతుడా; సకల = సమస్తమైన; పురుష = జీవులయొక్క; అంతర్యామి = లోపల వర్తించునట్టి; రూపత్వంబు = రూపముకలవాడవు; వలన = అగుట వలన; పరమపురుషుండవు = పరమపురుషుడవు {పురుషుడు - వ్యుత్పత్తి. పురీ శరీరేశేత ఇతి పురుషః, సకల జీవశరీరముల యందు వసించువాడు పురుషుడు}; అయ్యున్ = అయినప్పటికి; అపరిచ్ఛిన్నత్వంబు = అంఖడస్వభావము {అపరిచ్ఛిన్నము - దేశ కాల వస్తువుల చేత విభాగింపబడనిది}; వలన = వలన; మహాత్ముండవు = మహాత్ముడవు {మహాత్ముడు - మహత్తత్వ అవ్యక్తములను మీరిన గొప్పరూపము కలవాడు}; అయ్యున్ = అయినప్పటికి; ఆకాశ = ఆకాశము; ఆది = మొదలగు; భూత = పంచభూతములకు {భూత - భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము అనెడి పంచభూతములు ఆ భూతజన్యములైన జీవులు}; సమ = చక్కటి; ఆశ్రయత్వంబు = అండగానుండుతత్వము; వలన = వలన; భూత = సమస్తభూతములకు; ఆవాసుండవు = నివాసమైనవాడవు; అయ్యును = అయినప్పటికి; భూత = సమస్త భూతముల; మయత్వంబు = నిండి యుండు తత్వము; వలన = వలన; భూత = భూతము అనెడి; శబ్ద = నామము చేత; వాచ్యుండవు = పలుకబడువాడవు; అయ్యున్ = అయినప్పటికి; కారణా = మూల ప్రకృతి {మూలప్రకృతి - సర్వకారణములకు కారణమైనది}; అతీతత్వంబు = మీరినలక్షణము; వలన = వలన; పరమాత్ముండవు = పరమాత్ముడవు; అయ్యును = అయినప్పటికి; ఙ్ఞాన = అపరోక్షఙ్ఞానమునందు; విఙ్ఞాన = పరోక్షఙ్ఞానమునందు {పరోక్షఙ్ఞానము - ప్రపంచకల్పనాది రూపముకలది}; పరిపూర్ణత్వంబు = సంపూర్ణభావము; కలిగి = ఉండి; నిర్గుణత్వ = త్రిగుణాతీతస్వభావము {నిర్గుణత్వము - శాంతరూపైన సత్వగుణము ఘోరరూపైన రజోగుణము మూఢరూపైన తమోగుణము ఐన త్రిగుణములు లేకపోవుట}; నిర్వికారత్వంబు = షడ్భావవికారాతీతత్వము {నిర్వికారత్వము - షడ్విధ వికారములు లేకపోవుట (1గర్భములోనుండుట 2పుట్టుట 3పెరుగుట 4ముదియుట 5కృశించుట 6చనిపోవుట)}; వలన = వలన; బ్రహ్మంబవు = పరబ్రహ్మవు {పరబ్రహ్మ - అఖండ పరిపూర్ణ సచ్చిదానంద పరబ్రహ్మ (శో. బహిర్బ్రహ్మ వృద్ధై బృహతేర్ధాతోః అర్థానుగమాత్ దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్నం యద్వస్తు తద్బ్రహ్మేతి భాష్యం)}; అయ్యును = అయినప్పటికి; ప్రకృతి = నీ అవ్యక్తనామశక్తియొక్క; ప్రవర్తకత్వంబు = సర్వవ్యాపారప్రవర్తకము {సర్వవ్యాపారప్రవర్తకము - సమస్తమైన పంచవ్యాపారముల (1సృష్టి 2స్థితి 3లయ 4తిరోధాన 5అనుగ్రహములు) యందు విచిత్రముగ వ్యాపించగలుగుట}; వలనన్ = వలన; అనంతశక్తివి = అంతులేనిశక్తికలవాడువు {అనంతశక్తి - 1సర్వజ్ఞత్వ 2సర్వేశ్వరత్వ 3సర్వభోక్తృత్వ 4సర్వపాలకత్వాది సామర్థ్యములు కలిగ ఉండుట}; ఐ = అయ్యి; అప్రాకృతుండవు = ప్రకృతికి అతీతుడవు; అయ్యున్ = అయినప్పటికి; కాలచక్ర = కాలావయవములను {కాలచక్రము - అఖండమై నిమేష ఘటిక దిన మాస సంవత్సరాది కాలావయవము లనెడి భేదములచే చక్ర భ్రమణయుక్తమైన కాలము}; ప్రవర్తకత్వంబు = నడిపించెడివాడవు; వలన = అగుట వలన; కాలుండవు = అఖండకాలస్వరూపుడవు; అయ్యున్ = అయినప్పటికి; కాల = కాలము అనెడి; శక్తి = శక్తికి (సృష్టిస్థితిలయాదులకు); సమ = మేలైన; ఆశ్రయత్వంబు = ఆశ్రయభూతుడగుట; వలన = వలన; కాలనాభుండవు = కాలము స్వాధీనముగ కలవాడువు; అయ్యున్ = అయినప్పటికి; సృష్టి = సృష్టి; జీవన = స్థితి; సంహార = లయ; ఆది = మొదలగునవానిని; దర్శిత్వంబు = చూపువాడవు; వలన = అగుట వలన; కాల = కాలము యొక్క; అవయవ = భాగములకు (నిమేష సంవత్సరాదులు); సాక్షివి = సాక్షివి {సాక్షి - కాల వస్తు స్థితి స్వభావముల ప్రభావములకు లోనుగాక చూచువాడు}; అయ్యున్ = అయ్యి; ఒప్పు = ఉండునట్టి; నీ = నీ; కున్ = కు; నమస్కరించెదము = మ్రొక్కెదము; మఱియును = ఇంకను.

భావము:
నీ సాన్నిధ్యమే పరమ శుభం; అతి భారమైన సంసారం వలన మిక్కిలిగా కూరుకుపోయిన వారికి కోరడానికి కూడ సాధ్యం కానిది. ఎంత అదృష్టవంతుడో? అట్టి భాగ్యాన్ని ఈ క్రోధం రోషంతో నిండిన వాడైన ఈ కాళియుడు పొందాడు.
ఓ కృష్ణ దేవుడా! నీవు అందరిలోను నిండి ఉండేవాడవు, కనుక జీవుడనే పురుషుడవు. అంతే కాక, అందరిలోని అంతర్యామివి, కనుక పరమ పురుషుడవు. విడివిడిగా కాకుండా అందరిలోను నిండి ఉండేవాడవు, కనుక మహాత్ముడవు. ఆకాశం మొదలైన పంచభూతాలకు ఆశ్రయుడవు గనుక, నీవు భూతవాసుడవు. సమస్తభూతాలు నీలో ఉన్నాయి గనుక, నీవు భూతమయుడవు. నీకు కారణం ఏమి లేదు కనుక నీవు పరమాత్మవు. పరిపూర్ణమైన ఙ్ఞానం విఙ్ఞానం కలవాడవు కనుకను, గుణాలు ఆటంకాలు మార్పులు లేనివాడవు కనుకను, బ్రహ్మమువవు. ఈ ప్రకృతిని ప్రవర్తింప జేసేవాడవు నీవే కనుక, అనంతశక్తి స్వరూపుడవు. ఆ ప్రకృతి అంటని వాడవు. కాలచక్రాన్ని నడుపుతుంటావు కనుక, కాలస్వరూపుడువు. కాలం యొక్క శక్తిని ఆశ్రయించి ఉన్నావు కనుక, కాలనాభుడవు. సృష్టిలోని జీవులు జన్మించటం మరణించటం చూస్తూ ఉంటావు కనుక, నీవు సర్వసాక్షివి. అటువంటి దేవా? నీకు నమస్కరిస్తున్నాము.

No comments: