Wednesday, March 8, 2017

కాళియమర్దనము – ఈ శాంతులు

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:
10.1-685-క.
 శాంతులు గాని తనువు
లీశాయీ మూఢజాతు లీ సజ్జాతుల్
యీశాంత తనువులందుఁ బ్ర
కాశింతువు ధర్మహితముగా సుజనులలోన్.
10.1-686-ఉ.
నేము లెన్న నెక్కడివినేము దలంచు తలంపు లోపలన్
నేరుపు లున్నవే? సుతుల నేరమిఁ దండ్రులు ద్రోచిపుచ్చరే?
నేము చేయువారి ధరణీపతు లొక్కకమాటు గావరే?
నేము గల్గు మద్విభుని నే డిటఁ గావఁగదే కృపానిధీ!

టీకా:
ఈ = ఈ కనబడుచున్న; శాంతలుగాని = శాంతాదిసద్గుణములులేని; తనువులు = దేహధారి జీవులు; ఈశా = సర్వభోక్త, కృష్ణా; ఈ = ఈ కనబడుచున్న; మూఢ = నీ స్వరూపఙ్ఞానములేని; జాతులు = జన్ములు; ఈ = ఈ కనబడుచున్న; సఙ్ఞాతుల్ = నీ స్వరూపఙ్ఞానమున్నవి; ఈశాంత = ఈశ్వరుడే తుదిగా గల; తనువులు = దేహధారి జీవులు; అందున్ = అందు; ప్రకాశింతువు = వెలిగెదవు; ధర్మ = వర్ణాచారములకు; హితముగా = మేలుకలుగుటకు; సుజనుల = సజ్జనుల; లోన్ = అందు.
నేరములు = తప్పులు (శిక్షించదగినవి); ఎన్నన్ = తరచిచూసినచో; ఎక్కడివి = ఎక్కడ ఉన్నవి; నేము = మేము; తలంచు = తలచెడి; తలంపులు = ఆలోచనలు; అందులోన్ = అన్నిటిలోని; నేరుపులు = చతురత్వములు, నేర్పులు; ఉన్నవే = ఉన్నాయా, లేవు; సుతుల = కొడుకుల; నేరమున్ = తప్పును; తండ్రులు = తండ్రులు; త్రోసిపుచ్చరే = విడిచిపెట్టరా, విడిచెదరు; నేరము = తప్పు; చేయు = చేసెడి; వారిన్ = వారిని; ధరణీపతులు = రాజులు; ఒక్కొక్క = ఒక్కొక్క; మాటు = సారి; కావరే = క్షమించరా; నేరము = తప్పు; కల్గు = చేసినట్టి; మత్ = మా యొక్క; విభుని = భర్తను; నేడు = ఇవాళ; ఇటన్ = ఇక్కడ; కావగదే = కాపాడుము; కృపానిధీ = దయాసాగరా, కృష్ణా.

భావము:
ఈశ్వరా! నీవు శాంతి లేని వారిలోను, మూఢులైన వారి లోను, ఙ్ఞానులైన వారిలోను, ఈశ్వరుడే తుదగా జీవించే వారి లోను అందరిలోను ప్రకాశిస్తుంటావు. కాని ధర్మానికి మేలు చేయటం కోసం మంచి వాళ్ళలో తరచుగా ప్రకాశిస్తావు.
దయాసాగరా! కృష్ణా! మేము చేసే ఆలోచనలలో నేర్పులన్నవి లేవు కదా! నీ సన్నిదిలో నేరాలు అంటూ ఏముంటాయి? పిల్లలు తప్పులు చేస్తే తండ్రులు క్షమించరా! రాజులు కూడ ఒక్కొక్కసారి నేరంచేసేవారిని కూడ క్షమిస్తుంటారు కదా! నేరం చేసిన మా భర్త కాళియుడుని క్షమించు. నీవు కరుణకు పుట్టిల్లు వంటివాడవు కదా! కాపాడు తండ్రీ!


No comments: