:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం
అందరం:
10.1-678-మ.
బహు కాలంబు తపంబు చేసి వ్రతముల్ బాటించి కామించి నీ
మహనీయోజ్వల పాదరేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ
మహిళారత్నము తొల్లి కాంచె నిదె నేమం బేమియున్ లేక నీ
యహి నీ పాదయుగాహతిం బడసె నే డత్యద్భుతం బీశ్వరా!
మహనీయోజ్వల పాదరేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ
మహిళారత్నము తొల్లి కాంచె నిదె నేమం బేమియున్ లేక నీ
యహి నీ పాదయుగాహతిం బడసె నే డత్యద్భుతం బీశ్వరా!
10.1-679-ఉ.
ఒల్లరు
నిర్జరేంద్రపద మొల్లరు బ్రహ్మపదంబు నొందఁగా
నొల్లరు చక్రవర్తిపద మొల్లరు సర్వరసాధిపత్యము
న్నొల్లరు యోగసిద్ధి మఱియొండు భవంబుల నొందనీని నీ
సల్లలితాంఘ్రి రేణువుల సంగతి నొందిన ధన్యు లెప్పుడున్.
నొల్లరు చక్రవర్తిపద మొల్లరు సర్వరసాధిపత్యము
న్నొల్లరు యోగసిద్ధి మఱియొండు భవంబుల నొందనీని నీ
సల్లలితాంఘ్రి రేణువుల సంగతి నొందిన ధన్యు లెప్పుడున్.
టీకా:
బహు = చాల; కాలంబు
= కాలము; తపంబున్ = తపస్సు; చేసి =
చేసి; వ్రతముల్ = వ్రతములు; పాటించి = ఆచరించి; కామించి
= కోరి; నీ = నీ; మహనీయ
= గొప్ప; ఉజ్వల = ప్రకాశవంతమైన; పాద = పాదముల; రేణు =
ధూళి; కణ = లేశము; సంస్పర్శ
= సోకునట్టి; అధికారంబు = అర్హతను; శ్రీమహిళారత్నము = లక్ష్మీదేవి; తొల్లి = పూర్వము; కాంచెన్
= పొందెను; ఇదె = ఇదిగో; నేమంబు
= నియమములు; ఏమియున్ = ఏమికూడ; లేకన్
= లేకుండగనే; ఈ = ఈ యొక్క; అహి =
సర్పము; నీ = నీయొక్క; పాద =
పాదముల; యుగ = జంట యొక్క; హతిన్
= దెబ్బలను; పడసె = పొందెను; నేడు =
ఇవాళ; అతి = మిక్కిలి; అద్భుతంబు
= ఆశ్చర్యకరము; ఈశ్వరా = కృష్ణా.
ఒల్లరు = అంగీకరించరు; నిర్జరేంద్ర పదము = దేవేంద్ర పదవిని; ఒల్లరు = అంగీకరింపరు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; పదంబున = పదవు; ఒందగా
= పొందుటకు; ఒల్లరు = అంగీకరించరు; చక్రవర్తి = సార్వభౌమ; పదమున్ = స్థానమును; ఒల్లరు = అంగీకరింపరు; సర్వ = సమస్తమైన; రస =
భూమండలమును; అధిపత్యమున్ = ఏలెడిఅధికారమును; ఒల్లరు = అంగీకరించరు; యోగ = యోగసాధనలో; సిద్ధిన్
= సాఫల్యమును; మఱి = మరి; ఒండు =
ఇంకొక; భవంబులన్ = జన్మలను; ఒందనీని = పొందనియ్యని; నీ = నీ యొక్క; సత్ =
ప్రశస్తమైన; లలిత = మనోజ్ఞమైన; అంఘ్రి
= పాద; రేణువుల = ధూళితోడి; సంగతిన్ = కూడికను; ఒందిన
= పొందినట్టి; ధన్యులు = కృతార్థులు; ఎప్పుడున్ = ఎప్పుడైనను.
భావము:
దేవా? కృష్ణా? పూర్వం లక్ష్మీదేవి ఎంతోకాలం తపస్సు చేసి, పట్టుదలగా వ్రతా లనేకం చేసి, గొప్ప తేజస్సుతో ప్రకాశించే నీ పాదరేణువుల లోని
కణాన్ని తాకేటట్టి అర్హత సంపాదించు కొంది. ఆహా! అలాంటిది ఈ సర్పరాజు ఏ తపస్సు
చేయకుండానే నీ రెండు పాదాల పవిత్ర స్పర్శకు నోచుకున్నాడు.
అతి మనోఙ్ఞము లైన నీ పాదరేణువుల స్పర్శ
పొందిన ధన్యులు ఎప్పటికి మరొక పునర్జన్మను పొందరు. అట్టి ధన్యులు ఎప్పుడూ దేవేంద్ర
పదవికి కూడా ఇష్టపడరు. బ్రహ్మపదానికి కూడా ఇష్టపడరు. చక్రవర్తి, వరుణ పదవులకి కూడా ఒప్పుకోరు. యోగసిద్ధికి అయినా
సరే ఒప్పుకోరు.
No comments:
Post a Comment