:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం
అందరం:
10.1-695-వ.
అని విన్నవించిన కాళియు పలుకులు విన నవధరించి
కారుణ్యమానసుం డైన సర్వేశ్వరుం డతని కిట్లనియె
10.1-696-క.
గోవర్గముతో మనుజులు
ద్రావుదు రీ మడుఁగు నీరుఁ; దగ దిం దుండన్;
నీవును నీ బాంధవులును
నీ వనితలు సుతులుఁ జనుఁడు నేఁ డంబుధికిన్.
ద్రావుదు రీ మడుఁగు నీరుఁ; దగ దిం దుండన్;
నీవును నీ బాంధవులును
నీ వనితలు సుతులుఁ జనుఁడు నేఁ డంబుధికిన్.
టీకా:
అని = అని; విన్నవించినన్
= మనవిచేసుకొన్న; కాళియు = కాళియుని యొక్క; పలుకులు = మాటలు; వినన్
= అంగీకరించుటకు; అవధరించి = గ్రహించి; కారుణ్య = దయగల; మానసుండు
= మనసుగలవాడు; ఐన = అయిన; సర్వేశ్వరుండు
= కృష్ణుడు; అతని = అతని; కిన్ =
కి; ఇట్లు = ఈ విధముగ; అనియె
= పలికెను.
గో = ఆవుల; వర్గము
= సమూహము; తోన్ = తోపాటు; మనుజులు
= మానవులు; త్రావుదురు = తాగెదరు; ఈ = ఈ; మడుగు
= మడుగులోని; నీరున్ = నీటిని; తగదు =
యుక్తముకాదు; ఇందున్ = ఈ మడుగునందు; ఉండన్ = ఉండుట; నీవును
= నీవు; నీ = నీ యొక్క; బాంధవులును
= చుట్టాలు; నీ = నీ యొక్క; వనితలు
= స్త్రీలు; సుతులు = పిల్లలు; చనుడు
= వెళ్ళండి; నేడు = ఇవాళ; అంబుధి
= సముద్రమున {అంబుధి - అందు (నీటికి) నిధి, కడలి}; కిన్ =
కు.
భావము:
ఈ విధంగా మనవి చేసుకొన్న కాళియుడి మాటలు
విని మన్నించ దలచుకొన్న దయాస్వభావి, సర్వేశ్వరుడు
అయిన కృష్ణుడు అతనిని ఇలా ఆఙ్ఞాపించాడు.
“కాళియుడా!
ఈ మడుగులోని నీటిని గోవులతో పాటు మనుషులు కూడా తాగుతారు. కనుక, ఇంక నువ్వు ఇక్కడ ఉండ కూడదు. నువ్వు, నీ పెళ్ళం పిల్లలు, బంధువులు
అందరితో కలిసి ఇవాళే సముద్రం లోకి వెళ్ళిపోండి.
No comments:
Post a Comment