Thursday, January 7, 2016

ప్రహ్లాదుని హింసించుట - నరుడుం దానును

7-218-మ.
"రుఁడుం దానును మైత్రితో మెలఁగుచున్ నారాయణుం డింతయున్
రుసన్ నారదసంయమీశ్వరునకున్ వ్యాఖ్యానముం జేసె మున్
రిభక్తాంఘ్రిపరాగ శుద్ధతను లేకాంతుల్ మహాకించనుల్
తత్త్వజ్ఞులు గాని నేరరు మదిన్ భావింప నీ జ్ఞానమున్.
7-219-వ.
తొల్లి నేను దివ్యదృష్టి గల నారదమహామునివలన సవిశేషం బయిన యీ జ్ఞానంబును బరమభాగవతధర్మబును వింటి" ననిన వెఱఁగు పడి దైత్యబాలకు ల ద్దనుజ రాజకుమారున కిట్లనిరి.
టీకా:
          నరుడు = నరుడుయనెడి ఋషి; తానునున్ = తను; మైత్రి = స్నేహము; తోన్ = తోటి; మెలగుచున్ = తిరుగుచు; నారాయణుండు = నారాయణుడనెడి ఋషి; ఇంతయున్ = ఇదంతయును; వరుసన్ = క్రమముగా; నారద = నారదుడు యనెడి; సంయమి = మునులలో; ఈశ్వరున్ = గొప్పవాని; కున్ = కి; వ్యాఖ్యానమున్ = వివరించి చెప్పుట; చేసెన్ = చేసెను; మున్ = ఇంతకు పూర్వము; హరి = నారాయణ; భక్త = భక్తులయొక్క; అంఘ్రి = పాదముల; పరాగ = ధూళిచేత; శుద్ధ = పరిశుద్ధమైన; తనులు = దేహములుగలవారు; ఏకాంతుల్ = గహనమైన భక్తిగలవారు; మహాకించనుల్ = సర్వసంగవర్జితులు; పరతత్త్వజ్ఞులు = పరతత్త్వము తెలిసినవారు; కాని = తప్పించి ఇతరులు; నేరరు = సమర్ధులు కారు; మదిన్ = మనసున; భావింపన్ = ఊహించుటకైనను; ఈ = ఈ; జ్ఞానమున్ = జ్ఞానమును.
          తొల్లి = పూర్వము; నేను = నేను; దివ్యదృష్టి = దివ్యదృష్టి {దివ్యదృష్టి - భూతభవిష్యద్వర్తమానములు చూడగల దృష్టి, అతీంద్రియ విషయములను తెలుసుకొనగల జ్ఞానము}; కల = కలిగిన; నారద = నారదుడు యనెడి; మహా = గొప్ప; ముని = ముని; వలనన్ = వలన; సవిశేషంబు = ఎల్లరహస్యములతోకూడినట్టిది; అయిన = ఐన; ఈ = ఈ; జ్ఞానంబున్ = విద్యను; పరమ = అత్యుత్తమమైన; భాగవత = భాగవత; ధర్మంబును = ధర్మమును; వింటిని = విన్నాను; అనిన = అనగా; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; దైత్య = రాక్షసుల; బాలకుల్ = పిల్లలు; ఆ = ఆ; దనుజరాజకుమారుని = ప్రహ్లాదుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:
            పురాతన కాలంలో నరనారాయణులు అవతరించి మైత్రితో భూలోకంలో మెలగుతూ ఉన్నప్పుడు, నారాయణ మహర్షి ఈ జ్ఞానాన్ని నారద మహర్షికి బోధించాడు. హరి భక్తుల పాదధూళితో పవిత్రులు అయిన మహాత్ములూ, ఏకాగ్రచిత్తులూ, నిరాడంబరులూ, పరతత్వం తెలిసిన వాళ్లూ తప్పించి ఈ విషయాన్ని ఇతరులు ఎవరూ అర్థం చేసుకోలేరు.
            ఇంతకు పూర్వం నేను దివ్యదృష్టి సంపన్నుడైన నారద మహర్షి వలన ఈ విశిష్టమైన జ్ఞానమునూ, పరమ భాగవతుల ధర్మములనూ తెలుసుకున్నాను.” అని అనగానే, వింటున్న తోటి రాక్షస బాలకులు ఆ దానవ రాకుమారుడు అయిన ప్రహ్లాదుడిని ఇలా అడిగారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: