7-225-మత్త.
ప్రల్లదంబున
వేల్పు లుద్ధతిఁ బాఱి రాజనివాసముం
గొల్ల బెట్టి
సమస్త విత్తముఁ గ్రూరతం
గొని పోవఁగా
నిల్లు చొచ్చి
విశంకుఁడై యమరేశ్వరుం డదలించి మా
తల్లిఁ దాఁ
జెఱఁబట్టె సిగ్గునఁ దప్తయై
విలపింపఁగాన్.
టీకా:

భావము:
దండెత్తి వచ్చిన దేవతలు దౌర్జన్యంతో రాక్షసరాజు నివాస మందిరాన్ని వెంటనే
ఆక్రమించారు. సర్వ సంపదలూ, ధనాగారం సమస్తం దోచేశారు.
దేవేంద్రుడు సంకోచం లేకుండా అంతఃపురంలోకి చొరబడ్డాడు. మా తల్లిని చెరబట్టాడు. ఆమె
సిగ్గుతో విలవిలలాడింది. దేవేంద్రుడు ఆమె ఎంత ఏడ్చినా వినిపించుకోలేదు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment